Wednesday, February 11, 2009

అహం బ్రహ్మాస్మి(నువ్వు దేవుడిని నమ్మితే దెయ్యమూ ఉంటుంది).

చూడగానే ఏ సినిమా గురించో అర్ధం అయ్యే ఉంటుంది.
ఏంటి అయ్యేది రెండూ వేరే వేరే సినిమాలకు సంబందించినవి అంటారా ఐతే మీరు గ్రేట్. నిజమే "అరుంధతి" ,"నేను దేవుడిని " ఈ రెండు సినిమాల గురించే రాద్దాం అనుకున్నాను.
జనరల్ గా నేను సమీక్షలు చదవను(అప్పుడప్పుడూ తప్ప). ఇక మా శశి ప్రతి సినిమా కి రివ్యూ చదువుతాడు . అలాగని రివ్యూలని అధారం చేసుకుని సినిమాలు చూస్తాడనుకుంటే పప్పులో కాలేసినట్టే.తను అధమం విడుదలైన ప్రతి సినిమా చూస్తాడు. అలాంటిది "నేను దేవుడిని" చూసావా అని అడిగితే సౌండ్ లేదు, ఏమంటే సినిమా చూడలేమంట, రివ్యూ రాసినతనే వాంతి చేసుకున్నాడట, నేను చూడను అన్నాడు. నిజంగానే చూడలేదు కుడా. మా వాడు చూడను అన్నాడంటే ఏదో పెద్ద కధే ఉండి ఉంటుంది అని నేను పోయిన శుక్రవారం తిన్నగా శశికళ దియేటర్ కి వెళ్ళి సెకండ్ షో చూసి వచ్చాను.
ఆ తర్వాతి ఆదివారం అంటే నిన్న అనుకోకుండా అరుంధతి కి వెళ్ళాడం జరిగింది. ఇక అప్పుడు మొదలైంది నా ఆత్మ సంఘర్షణ. అదేంటి అరుంధతి ఆహా,ఒహో అన్నారే! బ్లాగ్లోకంలో ఒక్కరు తప్ప అంతా ఆ సినిమా ని నెత్తికేంటి,బ్లాగుల కెత్తుకున్నారే! అలాంటిది నాకేంటి ఈ సినిమా పరమ దరిద్రంగా కనిపిస్తుంది. అలాగే నేను దేవుడిని బాలేదన్నారే , కానీ ఇదేమో నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకా అని ఆలోచించగా కొన్న్ని విషయలు కనిపించాయి.
1)బహుశా బాల సినిమాలో అఘోరాలంటే దైవ ప్రతిరూపాలుగా,దేహానికి ప్రాణానికి మధ్య గిజగిజలాడే ఆత్మకి మోక్షాన్ని ప్రసాదించే వాళ్ళుగా చూసి అరుంధతి లో వాళ్ళని క్షుద్రోపాసకులుగా, నీచమైన చేతబడులు, బాణామతులు చేసేవాళ్ళుగానూ చూపించడం వల్లనేమో అనిపించింది. కానీ అలోచించగా ఇంకా చాలా క(అ)నిపించాయి. నేను ఎక్కడో ఒక పుస్తకంలో అఘోరాలను గురించి చదివాను(బహుశా యండమూరి అనుకుంటా).దానిలో వాళ్ళు కాల స్వరూపులని,దేనికి కట్టుబడని వాళ్ళని రచయిత చెప్తే కామోసనుకున్నాను.
2)అరుంధతి సినిమా అంతా రక్తం,విపరీతమైన రక్తం. అదేంటో అంత రక్తం చూసినా జుగుస్స కలుగలేదు కానీ వాస్తవ జీవితాన్ని చూస్తే (చూపిస్తే) మాత్రం జుగుస్సాకరంగా ఉందనడం హాస్యాస్పదమనిపించింది(ఈమాట రాసేటప్పుడు నా మిత్రుడన్నమాట: "బట్టలు విప్పి రికార్డింగ్ దాన్స్ చేస్తే చూడగలం కానీ, బట్టలు లేని వాళ్ళు రోడ్డు పక్కన పడి ఉంటే చూడలేం కదరా ఇదీ అంతే").
మొదటినుండీ మనకు ఒక అలవాటు ఉంది అదుగో పులి అంటే ఇదిగో తోక అనే అలవాటు.చూడబోతే ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగిందేమో అనిపిస్తోంది.ఒకడు ఈ సినిమా చూస్తే కళ్ళు తిరిగుతాయి అంటే ఇదో నాకు తిరుగుతున్నాయి అని పదిమంది అంటే వందమందికి అలా అనిపించడంలో అసందర్భమేముంది?
అయినా బాలకి బుద్దుండాలి ప్రజలు తాము కుందేళ్ళకోసం కొండలెక్కలేకా,పారాషూట్ లేసుకుని పాకిస్తాన్ కి వెళ్ళలేకా సినిమాలకి వస్తారు తప్ప గుడ్డివాళ్ళని,కుంటివాళ్ళని మూగవాళ్ళని చూడడానికి కాదనీ,

23 comments:

కొత్త పాళీ said...

interesting take.

Unknown said...

"అయినా బాలకి బుద్దుండాలి ప్రజలు తాము కుందేళ్ళకోసం కొండలెక్కలేకా,పారాషూట్ లేసుకుని పాకిస్తాన్ కి వెళ్ళలేకా సినిమాలకి వస్తారు తప్ప గుడ్డివాళ్ళని,కుంటివాళ్ళని మూగవాళ్ళని చూడడానికి కాదనీ" --- well said

చేతన_Chetana said...

"నేను దేవుడిని" చూడలేదు కానీ, అరుంధతి విషయంలో సేం పించ్..

Anonymous said...

చెత్తగా ఉంది. ఏమిటో నీ రాత

మనోహర్ చెనికల said...

కొత్తపాళీ
ఏం చెత్తగా ఉందో చెప్పిఉంటే మీ వ్యాఖ్య విలువైనదిగా నేను భావించేవాడిని. ఏడు గంటల్లో ఇంటరెస్టింగ్ టాక్ కాస్తా చెత్తగా ఎలా మారిందో తెలుసుకోవాలనుంది.
ప్రదీప్,చేతన-నెనర్లు.

Anonymous said...

The second comment from kotta paali seems to be imposer.

can you check IP address?

I may be wrong, but just my doubt.

మనోహర్ చెనికల said...

if anybody know how to get IP,please let me know

నాగప్రసాద్ said...

మనోహర్, రెండవ కామెంటు చేసింది నిస్సందేహంగా కొత్తపాళీ గారు కాదు. కావాలంటే ఒకసారి రెండు కామెంట్లను అబ్సర్వ్ చెయ్యి. మొదటి కామెంటులో బ్లాగర్ లోగో ఉంది. రెండవ కామెంటులో లేదు. Name/Url ఆప్షన్ ఉపయోగించి ఎవరో అనామకులు కామెంట్ చేశారు.

మనోహర్ చెనికల said...

నెనర్లు నాగ,

బ్లాగర్ లోగోతో పాటు , ప్రొఫైల్ ఫోటో కూడా మిస్సింగ్.
కొత్తపాళీ గారూ ,నన్ను మన్నించండి. చూసుకుని ఉండాల్సింది.

oremuna said...

తెలుగు బ్లాగుల్లో మొదటి ఇంపోస్టరు అనుకుంటాను.

మిత్రులారా ఏదో ఓక సైన్ ఇన్ వాడండి. లేకపోతే కష్టం.

అప్పుడెప్పుడో పొద్దులో ఓపెన్ ఐడీ గురించి వచ్చింది, మరోసారి చదవండి.

ముందుంది ముసల్ల పండుగ అనుకుంటాను.

కొత్త పాళీ said...

Dear Manohar,
This was brought to my attention just now. The second kottapalee was not me.

Anonymous said...

ఒపెన్ ఐడి - Open Id గురించి పొద్దులో ఇక్కడ చదవండి.

Anonymous said...

మీరు ఇంకా moderation enable చెయ్యలేదులాగున్నదే! ఆకతాయులకి మీరు అవకాశం ఇస్తున్నారు.

Anonymous said...

http://poddu.net/?p=508

Kathi Mahesh Kumar said...

విభిన్నమైన ధృక్కొణం. బాగుంది.

Anonymous said...

zvvxf

మనోహర్ చెనికల said...

mahesh:
thanks
netigen:

ippudu enable chesanu

Sasank said...

Manohar,

Reality gurunchi daanni inkaa realistic gaa choopinchina nenu devudini gurunchi chaala goppaga chepparu...

అదేంటో అంత రక్తం చూసినా జుగుస్స కలుగలేదు కానీ వాస్తవ జీవితాన్ని చూస్తే (చూపిస్తే) మాత్రం జుగుస్సాకరంగా ఉందనడం హాస్యాస్పదమనిపించింది -- vaasthava jeevitham ante andariki oke laaga vundadhu kadhaa....ilaantivi choosinappudu jugussa raavadam lo tappemi ledhu...meeku raakapovadam lo kooda tappu ledhu....adhi meeku haasya spadamga vundadame tappu...ani naa strong feeling.

ayina cinema antene fiction, daanilo reality vethakadam ante emito naaku ippati varaku artham kaaledhu ika mundhu kaadhu koodanu....ayinaa baala ee cinemani....emanukoni teesado emi cheppalanukoni teesado....(cinema ante emo cheppali ani kaadhu) kaani baala laanti critically acclaimed director cinema ante edho cheppe vuntaadu ani expect chesthammu kadha...ayina ee cinemalo point ee bad...tappu chesina vaadiki chaavu....baadha anubhavinchina vaaniki chaavu...idhena devudu ante......inka chaala raayalane vundhi...kaani type chese oopika ledhu

....
and annatu sasi endhi sasi....paina raasetappudu sasank ani ravayychu kadhaa.....neeku kooda baddakam ekkuvaindhi ee madhayaaa and sory for typing in english

Anonymous said...

అరుంధతి చిత్రం చుసినప్పుడు నాకు కూడా మీలాగే అనిపించింది. ఏ సినిమా అయితే చూసిన ప్రేక్షకుడ్ని తరువాత ఎక్కువ సేపు ఆలోచింపచేస్తుందో అదే ఉత్తమ చిత్రం అని ఎక్కడో చదివాను.
అఘోరాలూ కాపాలిక శక్తులూ, పిశాచాల ఆక్రందనలూ, ఒక స్త్రీ పాత్ర చుట్టూ తిరిగే కధా,గ్రాఫిక్స్ ల సమాహారం ఈ చిత్రం. వీటిని చూడడం వినోదం కలిగించి ఉండవచ్ఛునేమో కానీ గొప్ప చిత్రం అని ఐతే అనిపించలేదు.

మనోహర్ చెనికల said...

@sasank:
kaani baala laanti critically acclaimed director cinema ante edho cheppe vuntaadu ani expect chesthammu kadha

ఈ మాట శుద్ద అబద్దం, ఎందుకంటే పితామగన్ లో కూడా బాల ఏమీ చెప్పలేదే?
ఒక గుడ్డిపిల్లను చంపి, రేప్ చేసే సీన్ కంటే దారుణమైన సీన్లు నే.దే లో ఏమున్నాయో నాకర్దం కావట్లేదు. ఆ సీన్ ని మాత్రం దర్శకుడి సృజనాత్మకత గా ఒప్పుకుంటుంటే ఇంక నేనేమనగలను

Sasank said...

@ Manohar

Critically acclaimed director ante guranatee ga emanna chepthaara......:)

ఒక గుడ్డిపిల్లను చంపి, రేప్ చేసే సీన్ కంటే దారుణమైన సీన్లు నే.దే లో ఏమున్నాయో నాకర్దం కావట్లేదు. ఆ సీన్ ని మాత్రం దర్శకుడి సృజనాత్మకత గా ఒప్పుకుంటుంటే ఇంక నేనేమనగలను..mari nene devudini lo heroine character guddhidh kaadhaa..aa cinemalo amani pette torture tho polisthey...arundathi lo vunna scene antha bhayam karamga ani pinchadhu emo (Kaani arundathi lo aa scene koncham ekkavua ayyindhi, adhe nenu devudni lo baagaaaaaaa ekkuva ayindhi)...

mari meeru nenu devudini lo heroine torture scene and climax nearly 25 min aa character eedusthooney vuntadhi......baadhatho....aa scenes lo meeku సృజనాత్మకత kanipisthey......arundathi lo kooda meeku సృజనాత్మకత kani pinchi teerali...............leka pothey meeru pani kattukoni....cinema baaga ledhu ani prachaaram chese bapathiki vasthaaru :)..........

rākeśvara said...

నేను దేవుణ్ణి సినిమా నేను చూడలేదు.
అది తమిళంలో చాలా బాగా ఆడింది. ఇంకా ఎవరో అనడం ఏంటంటే, తెలుగులో సినిమా నిడివి నలభై నిమిషాలు తగ్గించారని! కాబట్టి మీరు బాలాని ఏమైనా అనేముందు, తమిళంలోనిది చూసి అర్థంచేసుకుంటే మంచిదేమో...
మంచిగా చిత్రీకరిస్తే ప్రేక్షకులు ఏమైనా చూస్తారు. నిజాన్నైనా కలనైనా...

సలక్షణ దీక్షిత ఘనపాఠి సన్నిధానం said...

నేనే దేవుణ్ణి మంచి సినిమా
మనకు మంచిసినిమాలు తీయటం రాదు చూడటం రాదు
అన్న విషయం వక విచారకర వాస్తవం.
అద్వైతానికీ అఘోరాలకూ ఉన్న సంబంధాన్ని,
జాతకాల పేరుతో కొంతమంది బ్రాహ్మణులు కూడా
ఎలా మూఢులౌతారో ,గుళ్ళల్లో అడుక్కుతినే వాళ్ళవెనుక
ఎలాంటి దుర్మార్గులుంటారో ,బాగా అర్ధమయ్యేలా చేసి
సినిమా మాధ్యమం మీద ఉన్న ఉదాశీనత
తగ్గించాడు సినీప్రియ బాల.