శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్
కాలాత్మక పరమేశ్వర రామ్
శేషతల్ప సుఖ నిద్రిత రామ్
బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్
చండకిరణకుల మండన రామ్
శ్రీ మద్దశరథ నందన రామ్
కౌసల్యా సుఖవర్ధన రామ్
విశ్వామిత్ర ప్రియ ధన రామ్
ఘోర తాటకా ఘాతక రామ్
మారీచాది నిపాతక రామ్
కౌశిక మఖ సంరక్షక రామ్
శ్రీమదహల్యోద్ధారక రామ్
గౌతమముని సంపూజిత రామ్
సుర మునివర గణ సంస్తుత రామ్
నావిక ధావిత మృదు పద రామ్
మిథిలా పురజన మోహక రామ్
విదేహ మానస రంజక రామ్
త్ర్యమ్చక కార్ముక భంజక రామ్
సీతార్పిత వర మాలిక రామ్
కృత వైవాహిక కౌతుక రామ్
భార్గవ దర్ప వినాశక రామ్
శ్రీమదయోధ్యా పాలక రామ్
అగణిత గుణగణ భాషిత రామ్
అవనీ తనయా కామిత రామ్
రాకా చంద్ర సమానన రామ్
పితృ వాక్యాశ్రిత కానన రామ్
ప్రియ గుహ వినివేదిత పద రామ్
తత్ క్షాలిత నిజ మృదుపద రామ్
భరద్వాజ ముఖానందక రామ్
చిత్ర కూటాద్రి నికేతన రామ్
దశరథ సంతత చింతిత రామ్
కైకేయీ తనయార్థిత రామ్
విరచిత నిజ పితృ కర్మక రామ్
భరతార్పిత నిజ పాదుక రామ్
దండక వనజన పావన రామ్
దుష్ట విరాధ వినాశన రామ్
శరభంగ సుతీక్షార్చిత రామ్
అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్
గృధ్రాధిప సంసేవిత రామ్
పంచవటీ తట సుస్థిత రామ్
శూర్పణఖార్తి విధాయక రామ్
ఖర దూషణ ముఖ సూదక రామ్
సీతా ప్రియ హరిణానుగ రామ్
మారీచార్తి కృదాశుగ రామ్
వినష్ట సీతాన్వేషక రామ్
గృధ్రాధిప గతి దాయక రామ్
శబరీ దత్త ఫలాశన రామ్
కబంధ బాహు చ్ఛేదన రామ్
హనుమత్సేవిత నిజపద రామ్
నత సుగ్రీవాభీష్టద రామ్
గర్విత వాలి సంహారక రామ్
వానరదూత ప్రేషక రామ్
హితకర లక్ష్మణ సంయుత రామ్
కపివర సంతత సంస్కృత రామ్
తద్గతి విష్ణు ధ్వంసక రామ్
సీతా ప్రాణాధారక రామ్
దుష్ట దశాశన దూషిత రామ్
శిష్ట హనూమ ద్భూషిత రామ్
సీతా వేధిత కాకావన రామ్
కృత చూడామణి దర్శన రామ్
కపివర వచనాశ్వాసిత రామ్
రావణ నిధన ప్రస్థిత రామ్
వానరసైన్య సమావృత రామ్
శోషిత సరిదీశార్థిత రామ్
విభీషణాభయ దాయక రామ్
పర్వతసేతు నిబంధక రామ్
కుంభకర్ణ శిరచ్ఛేదక రామ్
రాక్షససంఘ విమర్దక రామ్
అహి మహి రావణ చారణ రామ్
సంహృత దశముఖ రావణ రామ్
విధి భవ ముఖ సుర సంస్తుత రామ్
ఖస్థిత దశరథ వీక్షిత రామ్
సీతాదర్శన మోదిత రామ్
అభిషిక్త విభీషణ నత రామ్
పుష్పక యానారోహణ రామ్
భరద్వాజాభినిషేవణ రామ్
భరత ప్రాణ ప్రియకర రామ్
సాకేత పురీ భూషణ రామ్
సకల స్వీయ సమానత రామ్
రత్నలసత్పీఠాస్థిత రామ్
పట్టాభిషేకాలంకృత రామ్
పార్థివకుల సమ్మానిత రామ్
విభీషణార్పిత రంగక రామ్
కీశకులానుగ్రహకర రామ్
సకలజీవ సంరక్షక రామ్
సమస్త లోకాధారక రామ్
అగణిత మునిగణ సంస్తుత రామ్
విశ్రుత దశకంఠోద్భవ రామ్
సీతాలింగన నిర్వృత రామ్
నీతి సురక్షిత జనపద రామ్
విపిన త్యాజిత జనకజ రామ్
కారిత లవణాసురవద రామ్- స్వర్గత శంభుక సంస్తుత రామ్
స్వతనయ కుశలవ నందిత రామ్
అశ్వమేధ క్రతు దీక్షిత రామ్
కాలావేదిత సురపద రామ్
అయోధ్యక జన ముక్తిద రామ్
విధిముఖ విభుధానందక రామ్
తేజోమయ నిజరూపక రామ్
సంసృతి బంధ విమోచక రామ్
ధర్మస్థాపన తత్పర రామ్
భక్తిపరాయణ ముక్తిద రామ్
సర్వచరాచర పాలక రామ్
సర్వభయామయ వారక రామ్
వైకుంఠాలయ సంస్థిత రామ్
నిత్యానంద పదస్థిత రామ్
రామ రామ జయ రాజా రామ్- రామ రామ జయ సీతా రామ్
Tuesday, February 17, 2009
నామ రామాయణం
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
sriraama chamdra parabrahamane namah
మనోహర్ చెనికల గారు,
ప్రతీ రోజూ క్రమం తప్పకుండా నా టపా చదివి వ్యాఖ్య వ్రాస్తున్నందుకు కృతఙ్ఞతలు. మీరు ప్రస్తుతం విశ్వనాధవారి ‘వేయి పడగలు’ చదివిన స్ఫూర్తితో జ్వలించి పోతున్నట్లున్నారు.
నాకూ ఒకోసారి అన్పిస్తుంది, విశ్వనాధ వారు ఆ రోజుల్లోనే ఎంతగా కుట్రని పసిగట్టగలిగారు కదా అని! అలాగే వెళ్తే జరగబోయే భ్రష్ఠతని ఎంత ముందుగా అంచనా వేయగలిగాడాయన? విష్ణుశర్మ అంటాడు చూడండి, "నేను నేనని నువ్వు చెప్పేదేమిటి? నాకు తెలియదూ నేను నేనేనని?" అంటూ, వ్యక్తి కంటే వ్యక్తి ధృవీకరణ పత్రాలకి ప్రాముఖ్యత పెరగటం అన్న సందర్భంలో అలా నిరసిస్తాడు. నిజంగా విశ్వనాధ వారి మేధస్సు, దూరదృష్టి నాకు అబ్బురమని పిస్తుంది. అందుకేనేమో అప్పట్లో ఆయన గురించి అహంకారి అనీ, అదనీ ఇదనీ ఆయన్ని విసిగించింది అప్పటి మీడియా. తనకి తాను మహాకవి అనుకుంటాడని 70 వ దశకం చివరల్లో దుమ్మెత్తి పోసింది. చివరికి ఆయన “ఆవును. ఈ యుగానికే మహాకవిని నేను” అన్నాడట. దాంతో మరింత గోల పెట్టారు.
@durgeswara:
thanks
@ amma odi:
thanks for commenting
వేయి పడగలులో నాకు బాగా నచ్చిన విషయం , ఆయన భవిష్యత్తును ఊహించిన విధానం. మీరు వివరిస్తున్న ఇంత సోదాహరణంగా కాకపోయినా చాలా మట్టుకు వివరంగా చెప్పారాయన ఆ రోజుల్లోనే, కృష్ణమ నాయుని చేత "మన శౌర్యం ,నేర్పు ఒక్క తుపాకీ గుండు ముందు బలాదూరైనాయి" అని పలికించినా , కుమారస్వామిచేత "ఒక్కడు ఏటికెదురీద ప్రయత్నించినా ప్రవాహబలంచేత ఆ ఏటిలోనే పడి కొట్టుకపోవలసిందే కదా" అనిపించినా అన్నీ కాలగమనంలో రాబోతున్న(వచ్చిన) మార్పుల గురించే చెప్పారనిపిస్తోంది. ఇక విష్ణుశర్మ చేత ఇంగ్లీషు గురించి చెప్పించిన విధానం, ఇంగ్లీషుని నెత్తికెత్తుకునే వారికందరికీ చెంపపెట్టు.
ఒకరకంగా మీ బ్లాగుని నేను ఫాలో అవ్వడానికి కారణం కూడా వేయిపడగలే. అప్పుడే నాకు మొదటిసారి పోతూపోతూ ఈ తెల్లోళ్ళు మనల్ని ,మన సంస్కృతిని ఎందుకు నాశనం చేసి పోదాం అనుకున్నారు అని సందేహం వచ్చింది. ఆ సందేహ నివృత్తి కోసం ప్రయత్నిస్తుంటే మీ బ్లాగ్ కనపడింది. నా కోరిక తీర్చడానికే ఆ వేణుగోపాలస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి మీ చేత రాయిస్తున్నారనుకున్నాను.
Post a Comment