Tuesday, October 27, 2009

ఇంకెన్నో రోజులు లేదులే మీ కోరిక తీరడానికి!

శ్రీ రామదూతం శిరసా
నమామి!

తెలుగు మెడలో ఈ
బోర్డ్ ఎప్పుడో పడింది.

ఈ రోజు కొత్తగా
బాధ పడడమెందుకు? మనం కోరుకున్నదేగా
జరుగుతున్నది. మన పిల్లలు తెలుగులో
మాట్లాడితే మనకే అవమానం.

"
అల
వైకుంఠపురం లో,జో అచ్యుతానంద
జోజో ముకుంద " లాంటి అచ్చతెలుగు
పదాలు, పద్యాల అందాలు ఇప్పుడు
అవసరం లేదు.
ఆకాశంలో మెరిసే
తారల గురించి కూడా ఇంగ్లిష్
లోనే చెప్పాలి,ట్వింకిల్ ట్వింకిల్
స్టార్ అంటూ.... చెప్దాం.
క్రిష్టియన్

స్కూల్లో పిల్లలు పెద్ద చదువులు(?) చదవాలి, దానికి తెలుగైతే ఏంటి, ఇంగ్లిష్ ఐతే ఏంటి అనే కదా చేర్పించాము
ఇప్పుడు ఏడవడం దేనికి?

ఎటూ మన పిల్లల్ని
వాళ్ళు తెలుగు చదవ నివ్వరు,మనమూ
చదవనివ్వము.,
పెద్దవాళ్ళకి తెలుగు

తప్ప ఇంకేది రాని కుటుంబాలు
ఇంకా కొన్ని ఉండడం చేత పిల్లలకు
, ఆ లు  అమ్మ,అత్త పదాలు వస్తున్నాయి.

ఈ పిల్లలకు అంతకు మించి తెలుగు

రాదు ఇరవయ్యేళ్ళకైనా, అరవయ్యేళ్ళకైనా . ఇక ఆ తర్వాతి తరానికి అసలు చన్సే
ఉండదు.
సో ఇంకొక్క తరమే మిగిలింది

తెలుగుని బతికించడానికైనా, చంపడానికైనా...


ఒక హారీ పోటర్
పిల్లలకి నచ్చుతుందంటే, అంతకి
మించి పిల్లల ఊహా శక్తిని, సృజనాత్మకతని
పెంచే కధలు మనకి లేవా?
(లేవు అని
ఇప్పుడు ఎవరూ అనకపోవచ్చు, కాని
భవిష్యత్తులో లేవని చెప్పే
రోజులు కచ్చితంగా వస్తాయి.)
కానీ చెప్పాలంటే మనకి రావాలి
కదా,
మనకి తెలిసినవన్నీ చేతన్

భగత్ పుస్తకాలూ, సిడ్నీ షెల్డన్
పుస్తకాలున్నూ , ఇక మనమేం చెప్తాం.

అందుకే టీచర్స్ కి వదిలేసి మనం

మాత్రం మన పిల్లల మెరుగైన భవిష్యత్తు
కోసం (డబ్బుంటే చాలా వ్యక్తి
వికాసం అవసరం లేదా) కష్టపడుతూ
ఉంటాం (?).
ఆ టీచర్స్ ఏం చెప్తున్నారో

మనకి తెలియదు.
మన పురాణాలు
,కావ్యాల
గురించి ఉండేదే ఒక తెలుగు పుస్తకంలో , అలాంటి తెలుగు ఒక క్రిష్టియన్
టిచర్ చెప్తే ఎలా ఉంటుందో అనుభవించి
బాధ పడాలే కాని చెప్పేది కాదు.

పార్వతీ కళ్యాణం చెప్పినా అదే

తంతు, శ్రీ కృష్ణుని బాల్య క్రీడలు
చెప్పినా అంతే. ఇవన్నీ మనకవసరం
లేదు.
ఇంకేం జరుగుతుంది ఇది

కాక. మనమలక్ష్యం చేసి చంపేసిన
తెలుగుకి వాళ్ళు ఇప్పుడు సమాధి
కడుతున్నారు...


తెలుగు బతకాలంటే
ఏం చెయ్యాలో అందరికీ తెలుసు, ఇలా చెయ్యండి, అలా చెయ్యండి
అని చెప్పల్సిన అవసరం లేదు అని
నా అభిప్రాయం.
ఇప్పుడు పెద్ద

పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు
చాలా మంది తెలుగు వాళ్ళు(తెలుగు
మీడియం) కారా?

Friday, October 9, 2009

నేనూ ఒక పద్యం రాసానోచ్.

శ్రీ రామదూతం శిరసా నమామి.
గజేంద్ర మోక్షం చదివిన తర్వాత నాకు కూడా ఆంజనేయస్వామి మీద ఒక పద్యం రాయలనిపించింది. మత్తేభమో, శార్దూలమో, చంపకమో, ఉత్పలమో కొడదాం అనుకున్నా
*ఫర్ క్విక్ రిఫరెన్స్
ఉత్పలమాల-భ ర న భ భ ర వ
చంపకమాల-న జ భ జ జ జ ర
మత్తేభం-స భ ర న మ య వ
శార్దూలం- మ స జ స త త గ (ఆటవెలది,తేటగీతి, కందం- పేర్లు మాత్రమే తెలుసు చందస్సు తెలియదు.). *

సరే కాన్సెప్ట్ కావాలి కదా... తీవ్రంగా బ్రైన్ ని ఆ భగవంతుడి గుణగణాల మీద కేంద్రీకరించి అలోచించాక నాకు తట్టిన మొదటి అలోచన ఆ రామదూత కు పెద తండ్రి అయిన యముడి విషయం. తదుపరి గుర్తొచ్చింది ఎవరినైనా ముంచగలిగిన సంసారమనే మృత్యుసాగరాన్ని అవలీలగా దాటిన విషయం. దాంతో దీన్నే పద్యంగా రాద్దాం అనుకున్నా. కాని ఇక్కడ ఒక చిక్కు వచ్చింది.యముడు హనుమ కి పెద నాన్న అయినది ద్వాపరంలో, కానీ సాగరాన్ని దాటింది త్రేతాయుగం లో. దానితో ఎలా రాయడమా అని తెగ అలోచించాను. ఏమీ తోచలేదు. నేనేమన్నా సహజ పాండితీ ప్రకర్ష ఉన్న పొతన్ననా, మామూలు పదాలతోనే పెద్ద పెద్ద పద్యాలు రాసెయ్యడానికి(జో జో కమలదలేక్షణ, జో జో మృగరాజ నయన జో జో-దశమ స్కంధం), లేకపోతె అజ్జాడ గారిలాగా సమయ స్పూర్తి ఉన్నవాడినా,(రాజుతో పేకాట ఆడుతూ రాజుకు మూడు ఆసులు , తనకు మూడు రాజులు వస్తే, పెద్ద పందెం పెట్టేసి ఆనక "ఏ ధైర్యం తో అంత పందెం పెట్టావంటే" రాజుల మీద నమ్మకంతో అని ఎస్కేప్ అయినట్టు అవ్వడానికి)
అందుచేత చివరికి నేను కూడా అర్జునుని బాణాన్నే నమ్ముకుని - పద్యం తెలిసిన వాళ్ళకి కవిత అని, తెలియని మా అశోక్, శశాంక్, అభి, కిరణ్(కిరణ్ కి కొంచెం తెలుసనుకుంటా),రెక్కల పక్షి(వింగ్ బర్డ్-వెంకట్)కి ఏ కందమో, ఆటవెలదో, తేటగీతో అని చెప్పెయ్యచ్చులే అని ఒక పద్యం రాసేసా.
ఇదుగో ---
సర్వతముడవు,సర్వోత్తముడవు
సర్వాత్ముడవు,సర్వము నీవై యుండన్
సర్వకాలములందు నమస్కరింతు
సర్వం సహా చక్రవర్తికి సరసీరుహాళికిన్
ఏంటి ఎక్కడో చదివినట్టు ఉందా (1-విశ్వకరు,విశ్వదూరుని,విశ్వాత్ము,విశ్వవేద్యు విశ్వునవిశ్వున్ శాశ్వతనజు బ్రహ్మ ప్రభు నీశ్వరునిన్ బరమ పురుషు నే సేవింతున్ 2-లోకంబులు లోకేశులు లోకస్ధులు దెగిన దుది నలోకంబగు పెంజీకటికవ్వలనెవ్వడేకాకృతి వెలుగుచునుండునాతని సేవింతున్ ... ఇలా ), ఒక వేళ మీరెక్కడన్న చదివినా అది నా తప్పు కాదు. ఎందుకంటే ఇది నా సొంతం......(ఏంటీ స్వామి నవ్వుతున్నావా నా సొంతమన్నానని-అంతేలే ఎందుకు నవ్వవు, గ్రామర్ పెద్దగా తెలియని నాకు ఒక పద్యం రాయాలని కోరిక కలిగించి చివరికి నేను రాయలేకపోతే నిరుత్సాహ పడకూడదని ఒక చిన్న పద్యం రాసేలా చేస్తే ఇప్పుడు నేను ఈ పద్యం నాదే అంటే నవ్వు రాదా).
నాది అని అన్నందుకు క్షమించు స్వామీ కానీ అలా అనడానికి కారణం ఉంది, అలా అనుకోకపోతే నీకు నైవేద్యంగా సమర్పిన్చుకోలేనన్న చిన్న ఆలోచన . అందుకే ఈ చిన్న ధిక్కారం.
కూర్చె భాగవతమొకరు నిను సేవించి కైవల్యమొంద,
తీర్చుకొనుటకు జన్మ జన్మంబుల కర్మ పాశములు కొంద
రర్చించె శతకములతో,అల్ప జ్ఞాన వశమున నే
కూర్చిన ఈ పదమాలనర్చించనిమ్ము నీ పాద పద్మంబుల
నా మొదటి పద్యం(సర్వతముడవు...) ఆ శ్రీ రామదూతకి అంకితమిస్తూ.......
శ్రీ రామదూతం శిరసా నమామి....
మంగళాశాసన పదైః మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం