Tuesday, February 17, 2009

నామ రామాయణం


  1. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్

  2. కాలాత్మక పరమేశ్వర రామ్

  3. శేషతల్ప సుఖ నిద్రిత రామ్

  4. బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్

  5. చండకిరణకుల మండన రామ్

  6. శ్రీ మద్దశరథ నందన రామ్

  7. కౌసల్యా సుఖవర్ధన రామ్

  8. విశ్వామిత్ర ప్రియ ధన రామ్

  9. ఘోర తాటకా ఘాతక రామ్

  10. మారీచాది నిపాతక రామ్

  11. కౌశిక మఖ సంరక్షక రామ్

  12. శ్రీమదహల్యోద్ధారక రామ్

  13. గౌతమముని సంపూజిత రామ్

  14. సుర మునివర గణ సంస్తుత రామ్

  15. నావిక ధావిత మృదు పద రామ్

  16. మిథిలా పురజన మోహక రామ్

  17. విదేహ మానస రంజక రామ్

  18. త్ర్యమ్చక కార్ముక భంజక రామ్

  19. సీతార్పిత వర మాలిక రామ్

  20. కృత వైవాహిక కౌతుక రామ్

  21. భార్గవ దర్ప వినాశక రామ్

  22. శ్రీమదయోధ్యా పాలక రామ్

  23. అగణిత గుణగణ భాషిత రామ్

  24. అవనీ తనయా కామిత రామ్

  25. రాకా చంద్ర సమానన రామ్

  26. పితృ వాక్యాశ్రిత కానన రామ్

  27. ప్రియ గుహ వినివేదిత పద రామ్

  28. తత్ క్షాలిత నిజ మృదుపద రామ్

  29. భరద్వాజ ముఖానందక రామ్

  30. చిత్ర కూటాద్రి నికేతన రామ్

  31. దశరథ సంతత చింతిత రామ్

  32. కైకేయీ తనయార్థిత రామ్

  33. విరచిత నిజ పితృ కర్మక రామ్

  34. భరతార్పిత నిజ పాదుక రామ్

  35. దండక వనజన పావన రామ్

  36. దుష్ట విరాధ వినాశన రామ్

  37. శరభంగ సుతీక్షార్చిత రామ్

  38. అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్

  39. గృధ్రాధిప సంసేవిత రామ్

  40. పంచవటీ తట సుస్థిత రామ్

  41. శూర్పణఖార్తి విధాయక రామ్

  42. ఖర దూషణ ముఖ సూదక రామ్

  43. సీతా ప్రియ హరిణానుగ రామ్

  44. మారీచార్తి కృదాశుగ రామ్

  45. వినష్ట సీతాన్వేషక రామ్

  46. గృధ్రాధిప గతి దాయక రామ్

  47. శబరీ దత్త ఫలాశన రామ్

  48. కబంధ బాహు చ్ఛేదన రామ్

  49. హనుమత్సేవిత నిజపద రామ్

  50. నత సుగ్రీవాభీష్టద రామ్

  51. గర్విత వాలి సంహారక రామ్

  52. వానరదూత ప్రేషక రామ్

  53. హితకర లక్ష్మణ సంయుత రామ్

  54. కపివర సంతత సంస్కృత రామ్

  55. తద్గతి విష్ణు ధ్వంసక రామ్

  56. సీతా ప్రాణాధారక రామ్

  57. దుష్ట దశాశన దూషిత రామ్

  58. శిష్ట హనూమ ద్భూషిత రామ్

  59. సీతా వేధిత కాకావన రామ్

  60. కృత చూడామణి దర్శన రామ్

  61. కపివర వచనాశ్వాసిత రామ్

  62. రావణ నిధన ప్రస్థిత రామ్

  63. వానరసైన్య సమావృత రామ్

  64. శోషిత సరిదీశార్థిత రామ్

  65. విభీషణాభయ దాయక రామ్

  66. పర్వతసేతు నిబంధక రామ్

  67. కుంభకర్ణ శిరచ్ఛేదక రామ్

  68. రాక్షససంఘ విమర్దక రామ్

  69. అహి మహి రావణ చారణ రామ్

  70. సంహృత దశముఖ రావణ రామ్

  71. విధి భవ ముఖ సుర సంస్తుత రామ్

  72. ఖస్థిత దశరథ వీక్షిత రామ్

  73. సీతాదర్శన మోదిత రామ్

  74. అభిషిక్త విభీషణ నత రామ్

  75. పుష్పక యానారోహణ రామ్

  76. భరద్వాజాభినిషేవణ రామ్

  77. భరత ప్రాణ ప్రియకర రామ్

  78. సాకేత పురీ భూషణ రామ్

  79. సకల స్వీయ సమానత రామ్

  80. రత్నలసత్పీఠాస్థిత రామ్

  81. పట్టాభిషేకాలంకృత రామ్

  82. పార్థివకుల సమ్మానిత రామ్

  83. విభీషణార్పిత రంగక రామ్

  84. కీశకులానుగ్రహకర రామ్

  85. సకలజీవ సంరక్షక రామ్

  86. సమస్త లోకాధారక రామ్

  87. అగణిత మునిగణ సంస్తుత రామ్

  88. విశ్రుత దశకంఠోద్భవ రామ్

  89. సీతాలింగన నిర్వృత రామ్

  90. నీతి సురక్షిత జనపద రామ్

  91. విపిన త్యాజిత జనకజ రామ్

  92. కారిత లవణాసురవద రామ్
  93. స్వర్గత శంభుక సంస్తుత రామ్

  94. స్వతనయ కుశలవ నందిత రామ్

  95. అశ్వమేధ క్రతు దీక్షిత రామ్

  96. కాలావేదిత సురపద రామ్

  97. అయోధ్యక జన ముక్తిద రామ్

  98. విధిముఖ విభుధానందక రామ్

  99. తేజోమయ నిజరూపక రామ్

  100. సంసృతి బంధ విమోచక రామ్

  101. ధర్మస్థాపన తత్పర రామ్

  102. భక్తిపరాయణ ముక్తిద రామ్

  103. సర్వచరాచర పాలక రామ్

  104. సర్వభయామయ వారక రామ్

  105. వైకుంఠాలయ సంస్థిత రామ్

  106. నిత్యానంద పదస్థిత రామ్

  107. రామ రామ జయ రాజా రామ్
  108. రామ రామ జయ సీతా రామ్

Monday, February 16, 2009

దశ రూపకం-౧౦ వ(పదవ -ఆఖరు) భాగం

౧౦
మందపిల్లి.
౦౭-౧౨-౩౮.
రసరాట్టుగారూ! నాన్నగారు వచ్చారు.మీరు ఏమీ అనుకోకుండా ఉంటే మీకు ఒక సంగతి రాసేసి ఇక్కడితో ఊరుకోమన్నారు.మీపేర నేను పంపిన రచన ఒక పుష్కరం క్రితం మీరే రచించిందట. అది మీరచనలలో కల్లా గొప్పదనే అప్యాయంకొద్దీ నాన్నగారు స్వహస్తంతో లిఖించి, ఆ కాగితం తనదగ్గిర అట్టేపెట్టుగున్నారట,నేను పంపిన రచన అదే అయి ఉంటుందని చెప్పారు. క్షమించండి.

ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౦౮ -౧౨ -౩౮
గోపీనాధానికి అనేక ఆశీర్వచనాలు.నేనూ ఊరెళ్ళి ఈ ఉదయమే వచ్చాను.లోగడ నీకు వచ్చిఉన్న జాబులన్నీ, నేను ఊళ్ళో లేకపోబట్టి మా అమ్మాయి రాసింది.జాబుల్లో ఉన్న వృత్తాంతం యావత్తూ,నువ్వు పంపించిన కాగితాల మీద రాసిఉన్నదే. ఆ రచనా, దస్తూరీకూడా మీనాన్నగారివే. అందులో వారు విమర్శనమోనాలురాసి అట్టే పెట్టుగున్నారు, అది పొరపాట్న ఇక్కడికి వచ్చింది. నా రచన అన్నావే! అది కుంభయ్యగారిచేతికి నిరుడు మీ నాన్నే ఇచ్చారు, ఙ్ఞాపకం చేసుగోమను. అయితే నీకు పెండ్లి అయిందా?.......
ఇట్లు,
రసరాట్

మినీ కధ

ఇద్దరు వ్యక్తులు స్మశానంలో మాట్లాడుకుంటున్నారు
మొదటివ్యక్తి: ఇంతకు ఇతను ఏం వదిలిపెట్టి వెళ్ళాడు తన వాళ్ళకి?
రెండవ అతను: "అంతా" .

యండమూరి "వీళ్ళనేం చేద్దాం ?" నుండి

Friday, February 13, 2009

దశ రూపకం- ౯ వ (తొమ్మిదవ) భాగం

మందపిల్లి.
౦౫ -౧౨ -౩౮ .

రసరాట్టు గారూ! క్షమించాలి. మా నాన్న గారు ఉత్తరం రాసారు. రేపో నేడో ఇక్కడికి వచ్చేస్తార్ట. ఒక పని జరిగిందట. నాలుగైదు రచనలు మానాన్నగారు తమ బోంట్లకి విడివిడిగా అభిప్రాయంకోసం పంపించారట.అందులో ఒకటి శ్రీనాధుని రచన కూడా ఉందట. కడం అభిప్రాయాలన్నీ వచ్చేశాయి. ఒక వేళ, దిక్కుమాలి ప్రాలుద్ధం,మీకు నే పంపింది అదే కావచ్చు!
ఇట్లు,
గోపి.


జవాబు
పేరారం,
౦౬ -౧౨ -౩౮
గోపీ! అదా కమామిషూ! హోరీ! చెప్పవేం మరీ! అందుకనే, కిందన మాటు నేనెంత ఏకుతూ రాసినట్టు ఉన్నా,అప్పుడు కూడా ఈ రచనలోని ఆ రసస్ఫూర్తీ, ఆ పద సౌష్ఠవమూ, ఆ భావ విశేషమూ, ఆ గుఱ్ఱపునడకా, ఆ భాషామేళవం, ఆ వగైరాలూ - అవన్నీ తొంగిచూస్తూనే ఉన్నాయి. పెద్దవాళ్ళ రచనలు అనేకం ఇతరుల చేతుల్లో పడి పాడైపోయాయి.
ఇట్లు,
రసరాట్

Thursday, February 12, 2009

దశ రూపకం - ౮(ఎనిమిదో) వ భాగం

మందపిల్లి.
03-12-38.
రసరాట్టుగారూ! శాస్త్రం చెప్పిన తరవాయిగా వచ్చింది. ఎప్పటికప్పుడు మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం కట్టేద్దాం అనుకుంటూండడం,ఏదో పిల్లసమ్మేరీ వస్తూండడం జరుగుతోంది.మీరేమన్నా అనుకుంటారేమో అని ఇదవుతున్నాను కుడానూ! ఈవేళ మరో ఆయన వచ్చాడు. ఇతగాడిపేరు కేతయ్యట. ఆయనకూడా మా నాన్న గారి చేతికి అభిప్రాయం నిమిత్తం తన రచన ఇచ్చాట్ట. మా నాన్న ఊళ్ళో లేరని చెప్పేసి మెల్లిగా ఆయన్ని వొదిలించుగున్నాను. ఘంటారావురచనమీద అభిప్రాయం నిన్న మరొకరి దగ్గర్నించి నాకు వచ్చేసింది.మీదగ్గిరున్న రచన కేతయ్యదే. ఏదో ప్రసంగం వచ్చి , మీకూ తనకీ పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందని కేతయ్య అన్నాడు.
ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౦౪-౧౨-౩౮

గోపీ! ఈ సంగతి రాశావు నయమే. ఇంకాదాచుగుని ఊరుకున్నావుకావు,చచ్చిపోదుం. నాకూ అనిపించింది,'ఏమిరా! కొన్ని లక్షణాలు ప్రశంసార్హంగా కనిపిస్తూఉన్నా, ఈ రచన మొత్తంమీద ఏడిసినట్టుందేమిటీ అని. అల్లా అనిపించడానికి కారణం ఇప్పుడు భోదపడ్డది.
ఇంత దరిద్రగొట్టురచన భూమిమీదగాని,అంగారకుడులో గాని లేదు. బుద్ధిగల వాడెవడూ ఇది చివరంటా చదవడు. అందుకనే నే చదవలేదు. ఇందులో, గాఢంగా చూస్తే, అర్ధం వ్యర్ధం,భావం అభావం,రసం నీరసం,శైలిగాలి,భాషఘోష ,రీతి కోతి, వృత్తి మిత్తి,శయ్య కొయ్య,ధార నార. కొన్ని పట్ల కవి ఏడవబోయాడు. ఆ ఏడుపు ఉచితరీతిగా-అనగా ఏడుపు ఏ రీతిగా ఊండాలో అల్లా లేదు. నన్నడిగితే నేనేనా చెబుదును. చాలా బేస్ధలాల్లో కూడా నవ్వు తెప్పించడానికి ప్రయత్నించి రచయిత చచ్చి చెడ్డాడు.నేనెంత బిగపట్టుగుని కూర్చున్నా ప్రాణంమీది కొచ్చింది గాని నవ్వు రాలేదు. సహజమైన మాటపొందికా సమయస్ఫూర్తీ ఇందులోమృగ్యం. రచననీ , రచయితనీ వేరువేరుగా పుఠాలేసినా ఈ రచన ఇంతే. నుడికారం సుడిలో పడింది, కారకం మారకం చెందింది. నాబోటి గొప్పవాళ్ళనీ కొన్ని గొప్పసంస్ధల్నీ నిరసించడం తప్ప ఇతరం ఏమీ ఇందులో లేదు. ఈ రచనలో కొంత-చిరవదాకా అసలే చదవలేకపోయాను!-చదివి నేను చాలా పాడైపోయాను. నే కాక తక్కినవాళ్లు చదివితే ఎక్కడ చెడిపోతారో అని బెంగతో తీసుగుంటున్నాను. ఇది ఎవరేనా చదివితే పెద్ధ ఒట్టు; జాగ్రత్త!

ఇట్లు,
రసరాట్

Wednesday, February 11, 2009

అహం బ్రహ్మాస్మి(నువ్వు దేవుడిని నమ్మితే దెయ్యమూ ఉంటుంది).

చూడగానే ఏ సినిమా గురించో అర్ధం అయ్యే ఉంటుంది.
ఏంటి అయ్యేది రెండూ వేరే వేరే సినిమాలకు సంబందించినవి అంటారా ఐతే మీరు గ్రేట్. నిజమే "అరుంధతి" ,"నేను దేవుడిని " ఈ రెండు సినిమాల గురించే రాద్దాం అనుకున్నాను.
జనరల్ గా నేను సమీక్షలు చదవను(అప్పుడప్పుడూ తప్ప). ఇక మా శశి ప్రతి సినిమా కి రివ్యూ చదువుతాడు . అలాగని రివ్యూలని అధారం చేసుకుని సినిమాలు చూస్తాడనుకుంటే పప్పులో కాలేసినట్టే.తను అధమం విడుదలైన ప్రతి సినిమా చూస్తాడు. అలాంటిది "నేను దేవుడిని" చూసావా అని అడిగితే సౌండ్ లేదు, ఏమంటే సినిమా చూడలేమంట, రివ్యూ రాసినతనే వాంతి చేసుకున్నాడట, నేను చూడను అన్నాడు. నిజంగానే చూడలేదు కుడా. మా వాడు చూడను అన్నాడంటే ఏదో పెద్ద కధే ఉండి ఉంటుంది అని నేను పోయిన శుక్రవారం తిన్నగా శశికళ దియేటర్ కి వెళ్ళి సెకండ్ షో చూసి వచ్చాను.
ఆ తర్వాతి ఆదివారం అంటే నిన్న అనుకోకుండా అరుంధతి కి వెళ్ళాడం జరిగింది. ఇక అప్పుడు మొదలైంది నా ఆత్మ సంఘర్షణ. అదేంటి అరుంధతి ఆహా,ఒహో అన్నారే! బ్లాగ్లోకంలో ఒక్కరు తప్ప అంతా ఆ సినిమా ని నెత్తికేంటి,బ్లాగుల కెత్తుకున్నారే! అలాంటిది నాకేంటి ఈ సినిమా పరమ దరిద్రంగా కనిపిస్తుంది. అలాగే నేను దేవుడిని బాలేదన్నారే , కానీ ఇదేమో నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకా అని ఆలోచించగా కొన్న్ని విషయలు కనిపించాయి.
1)బహుశా బాల సినిమాలో అఘోరాలంటే దైవ ప్రతిరూపాలుగా,దేహానికి ప్రాణానికి మధ్య గిజగిజలాడే ఆత్మకి మోక్షాన్ని ప్రసాదించే వాళ్ళుగా చూసి అరుంధతి లో వాళ్ళని క్షుద్రోపాసకులుగా, నీచమైన చేతబడులు, బాణామతులు చేసేవాళ్ళుగానూ చూపించడం వల్లనేమో అనిపించింది. కానీ అలోచించగా ఇంకా చాలా క(అ)నిపించాయి. నేను ఎక్కడో ఒక పుస్తకంలో అఘోరాలను గురించి చదివాను(బహుశా యండమూరి అనుకుంటా).దానిలో వాళ్ళు కాల స్వరూపులని,దేనికి కట్టుబడని వాళ్ళని రచయిత చెప్తే కామోసనుకున్నాను.
2)అరుంధతి సినిమా అంతా రక్తం,విపరీతమైన రక్తం. అదేంటో అంత రక్తం చూసినా జుగుస్స కలుగలేదు కానీ వాస్తవ జీవితాన్ని చూస్తే (చూపిస్తే) మాత్రం జుగుస్సాకరంగా ఉందనడం హాస్యాస్పదమనిపించింది(ఈమాట రాసేటప్పుడు నా మిత్రుడన్నమాట: "బట్టలు విప్పి రికార్డింగ్ దాన్స్ చేస్తే చూడగలం కానీ, బట్టలు లేని వాళ్ళు రోడ్డు పక్కన పడి ఉంటే చూడలేం కదరా ఇదీ అంతే").
మొదటినుండీ మనకు ఒక అలవాటు ఉంది అదుగో పులి అంటే ఇదిగో తోక అనే అలవాటు.చూడబోతే ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగిందేమో అనిపిస్తోంది.ఒకడు ఈ సినిమా చూస్తే కళ్ళు తిరిగుతాయి అంటే ఇదో నాకు తిరుగుతున్నాయి అని పదిమంది అంటే వందమందికి అలా అనిపించడంలో అసందర్భమేముంది?
అయినా బాలకి బుద్దుండాలి ప్రజలు తాము కుందేళ్ళకోసం కొండలెక్కలేకా,పారాషూట్ లేసుకుని పాకిస్తాన్ కి వెళ్ళలేకా సినిమాలకి వస్తారు తప్ప గుడ్డివాళ్ళని,కుంటివాళ్ళని మూగవాళ్ళని చూడడానికి కాదనీ,

Friday, February 6, 2009

వేయి పడగల నీడలో నేను-2(గిరిక)

"ఒక పుస్తకంపై సమీక్ష రాయడానికి కావలసిన అర్హత ఏంటి? " ఈ ప్రశ్న ఏప్పటినుండో నా మనసుని తొలచేస్తుంది.నా వరకైతే ఆ పుస్తకాన్ని ఆమూలాగ్రంగా చదవడమే ఆ అర్హత . అలా అయితే వేయి పడగలు మీద నేను సమీక్ష రాయవచ్చు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిన పుస్తకం అది.
వేయి పడగలు నన్ను రెండు విధాలుగా మార్చింది.ఒకటి-ఆధ్యాత్మికంగా,రెండు -వ్యక్తిగా .
వ్యక్తిగతమైన అభివృద్ధిని ఇంకొక టపాలో వివరిస్తాను.
మొదట ఆధ్యాత్మికంగా -
దైవానికి నాకు దూరం పెరుగుతోంది అని మొట్టమొదటి సారి బి.టెక్ లో ఉన్నప్పుడు అనిపించింది.ఎందుకు,ఎవరి వల్ల అని చాలా ఆలోచించాను.నా వల్లైతే కాదు అని ఒక సారి, ఏం జరిగినా నా వల్లే జరిగి ఉంటుంది అని ఒక్కొక్కసారి అనిపించేది. ఆ సమయంలోనే వేయి పడగలు చదివాను.
మహాతల్లి గిరిక నా మనసును కదిలించింది.నాకు మళ్ళీ మార్గనిర్దేశం చేసింది.అప్పుడే మహాతల్లి గిరికతో పాటు ధర్మరావు గారిని నేను కూడా గురువుగా మనసా స్ధాపించుకొన్నాను.నేను కూడా కళ్యాణోత్సవాలకోసం వేయి కన్నులతో ఎదురుచూశాను.వేయిపడగలు పుస్తకం అంతా ఒక ఎత్తు వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాలు ఒక ఎత్తు.సుబ్బన్నపేటలో నాగేశ్వర స్వామిని మొదటసారి చూసినప్పుడు అరుంధతికి కలిగిన అనుభూతి లాంటిది కలిగింది ఆ కళ్యాణోత్సవాలు చదువుతుంటే. ఎన్ని సార్లు చదివినా జరిగిన పెళ్ళిని మళ్ళీ వీడియో లో చూస్తున్న అనుభూతే కలిగేది.పదకొండు రోజుల కళ్యాణోత్సవాలు, దశావతారాలు . ఉత్సవాలు పూర్తయ్యేసరికి స్వామి అన్ని అవతరాలను నా కళ్ళ ముందే ధరించినట్లనిపించింది. మనకు ఒక కల్పం బ్రహ్మ కు ఒక రోజు ఎలా అవుతుందో అనుభవపూర్వకంగా తెలిసింది. ఎందుకంటే సుబ్బన్నపేటలో పదకొండు రోజులు అనంతపురంలో మూడు రోజులే అయ్యాయి కదా.

గిరికాదేవి మత్స్యరూపిణి అయినపుడు ఆమెతో కలిసి స్వామి కోసం సాగరగర్భాన్ని శోధించాను. గిరికా దేవి కూర్మరూపిణి అయినపుడు స్వామి ఎక్కడ మంధర పర్వతాన్ని మోయలేక కందిపోతాడో అని ఆమెతో పాటు నేను తల్లడిల్లాను. ఇలా ప్రతి అవతారంలోనూ గిరిక తోపాటు నేను ఆ స్వామికోసం ఎదురుచూసాను.
కళ్యాణోత్సవాల ముగింపురోజున స్వామి గిరికతోపాటే నన్ను అనుగ్రహించాడు.నా చర్మచక్షువులకి ఙ్ఞాన దృష్ఠిని ప్రసాదించాడా అనిపించింది.

నేను నీకెప్పుడూ దూరంగా వెళ్ళలేదు, "యతోభావ: తతో దృష్టి:" -అన్న స్పష్టమైన సందేశం క(వి)నిపించింది.


అనుభవైక వైద్యమైన ఈ అనుభవాన్ని అక్షరరూపంలో పెట్టాలని నేను ఎంత ప్రయత్నించినా చేయలేకపోయాను.నాచేతనైనంత ప్రయత్నించాను ఏమైనా ఉంటే విఙ్ఞులు సరిదిద్దగలరు.

Thursday, February 5, 2009

దశ రూపకం -౭ వ భాగం


మందపిల్లి.
౦౧ -౧౨ -౩౮.

రసరాట్టుగారూ!
మీ పేర వ్రాయడం ఏ ముహూర్తాన్ని ప్రారంభించానో గాని సంగతి తెమిలేటట్టు కనపడదు. మరో చిక్కొచ్చింది. పొద్దున్న ఒకాయన నే ఉండగానే మా ఇంటికొచ్చారు. ఆయన పేరు ఘంటారవుట. ఆయనట తన రచన మా నాన్నగారికిచ్చింది. మీకు నేను పంపిన రచన తనదేనని ఆయన పట్టు పడుతున్నాడు. వెనక మీ ఎన్నికల్లో మీ తరఫున పని చేసింది ఈయనేట.
ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౦౨ -౧౨ -౩౮
అబ్బాయి, గోపీనాధం! అల్లా చెప్పు మరీ! అందుకనే తీవ్రంగా చూసిన మీదట ఈ రచన కడుంగడు ప్రౌఢంగా ఉంది. కొన్ని స్ఖాలిత్యాలున్నాయి. ఉంటే ఏం అన్నాను! కొన్ని స్ఖాలిత్యాలు ఉండాలి అని కూడా నేను వాదిస్తాను. లేకపోతే రచన మానుషమే అనిపించుకోదు.ఇది యధార్ధభావాలతోనూ, ఉన్నతాదర్శాలతోనూ నిండి ఉంది. రసం ఇందులో కేవలం ఆవకాయి ఊటలాగ ఊరిపోవడమే కాకుండా సముద్రపు పోటులాగ ఉబ్బి మీద పడిపోతోంది.భాష అతిమధురం.శైలి మనోహరం,వట్టివేళ్ల యొక్క చల్లదనం, వనసంతర్పణపోపుయొక్క ఘుమఘుమా, చలిమిడి యొక్క పాకం ఏకకాలంలో ఇక్కడ దొరుకుతాయి.వేయేల? ఈ రచనలోని మాటలు అన్న జిహ్వే జిహ్వ, విన్నచెవే చెవి,తస్కరించిన కవే కవి.
ఇట్లు,
రసరాట్.

దశ రూపకం - ౬వ భాగం


మందపిల్లి.
౨౯ -౧౧ -౩౮ .
రసరాట్టు గారూ! ఇంతటితో ఊరుకుందాం అంటే వీల్లేని పరిస్థితి ఏర్పడ్డది. నిన్న మా ఇంటికి నే లేనప్పుడు ఒకాయన మా నాన్నగారికోసం వచ్చారని మా అమ్మ చెప్పింది. ఆయన తాలూకు ఒక రచన మీద అభిప్రాయం తెప్పించి ఇస్తానని మా నాన్నగారు వారికి వాగ్దానం చేసి రచన పుచ్చుకున్నార్ట . ఆయన పేరు తెలియదు. చూపులకి కొత్త బియ్యేలా ఉన్నడని మా అమ్మ్మ చెప్పింది. మీకు నేను పంపింది ఆయన రచనేమో!
ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౩౦ -౧౧ -౩౮
గోపీ! అసలు నేను మొదట్లోనే అల్లా అనుకున్నాను. ఈ కవి ఇంగ్లీషు చదివినవాడు. ఇంగ్లీషులో తను చదువుకున్నదంతా మక్కికిమక్కి ఇందులో పొట్టిగ్రాఫు దింపేశాడు. ఈ సరుకు ఎక్కణ్ణించీ దిగుమతీ చేస్తున్నాడో చెప్పడు. ఆ సంగతి తెలుగు ఘటాలు ఎక్కడ కనిపెట్టొచ్చారని ఇతని ఊహ. రచనంతా ఇంగ్లీషు కంపే. ఉద్బోధన గాని ఇత్తేజన గాని ఇందులో లేవనడం సాహసం. భాష మాత్రం ఆంగ్లాంధ్రద్రావిడవంగ ధప్పళం.
ఇట్లు,
రసరాట్