చీమ వేసవికాలం అంతా కష్టపడి శీతాకాలానికి కావాల్సిన అన్నింటిని(ఇల్లు ,ఆహారం) సమకూర్చుకొంది. మిడత మాత్రం చీమను చూసి నవ్వుకొంది. ఎగతాళి చేసింది. వేసవి అంతా ఎంజాయ్ చేసింది. వేసవి వచ్చాక చీమ వెచ్చగా రెస్ట్ తీసుకుంటుంటే మిడత మాత్రం అహారం లేక, ఉండడానికి షెల్టర్ లేక చలికి చనిపొయింది.
నీతి ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.
ఇదంతా నా చిన్నప్పుడు, ఇప్పటి కోతులు మాకూ తాతలున్నారన్నట్టే, మిడతలు కూడా తెలివిమీరిపోయాయి.
2007:
చీమ వేసవికాలం అంతా కష్టపడి శీతాకాలానికి కావాల్సిన అన్నింటిని(ఇల్లు ,ఆహారం) సమకూర్చుకొంది. మిడత మాత్రం చీమను చూసి నవ్వుకొంది. ఎగతాళి చేసింది. వేసవి అంతా ఎంజాయ్ చేసింది. చలికాలం వచ్చింది.
మిడత వణుక్కుంటూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అందరూ చలికి వణుకుతూ, కరువులో వుంటే చీమ మాత్రం వెచ్చగా , వేళకు తింటూ ఆనందంగా ఉండడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించింది. ఇక మొదలు అసలు కధ.
NDTV, BBC, CNN ఛానల్స్ అన్నీ ఒకపక్క వణుకుతున్న మిడత ఫొటోని, మరోపక్క చీమ సౌకర్యంగా ఇంట్లో తినే వీడియోని పోటీ పడి ప్రసారం చేసాయి.
ప్రపంచం అంతా బిత్తరపోయింది. మిడత మాత్రం, మిడత మాత్రమే ఎందుకు అలా బాధ పడాలని.....
అరుందతి రాయ్ చీమ ఇంటి ముందు నిరసన ప్రదర్శన చేసింది.
మేధా పాట్కర్ మిగతా మిడతలతో కలిసి మిడతలన్నిటినీ చలికాలంలో వెచ్చని ప్రదేశాలకి తరలించాలని నిరాహార దీక్ష మొదలు పెట్టింది.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ , కోఫీ అన్నన్ మిడతల హక్కుల్ని పరిరక్షించలేక పోయినందుకు భారత ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఇంటర్నెట్ అంతా మిడతలకు న్యాయం జరగాలని ఆన్ లైన్ పిటిషన్స్ తో హోరెత్తిపోయింది.
అపోజిషన్ పార్టీ వాకౌట్ చేసింది. లెఫ్ట్ పార్టీస్ పశ్చిమ బెంగాల్ లో భారత్ బంద్ కి పిలుపునిచ్చాయి. కేరళ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరింది.
వెనువెంటనే కేరళ లో CPM పార్టీ, చీమలకూ,మిడతలకూ సమానత్వం కావాలంటూ, చీమలు వేసవి కాలంలో పని చేయరాదంటూ ఒక ఆర్డినెన్స్ పాస్ చేసింది.
లాలూ ప్రసాద్ ఇండియన్ రైల్వే తరపున ఒక పూర్తి కోచ్ ని మిడతలకి ఇచ్చేసారు.
చివరికి జ్యుడిషియల్ కమిటీ Prevention Of Terrorism Against Grasshoppers Act(POTAGA) ను పాస్ చేసింది. అది ఆ శీతాకాలం నుంచే అమల్లోకి వచ్చింది.
అర్జున్ సింగ్, అన్ని మిడతలకి విద్యాలయాలలోనూ, ప్రభుత్వ ఉద్యోగాలలోనూ ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు.
చీమ POTAGA చట్టానికి విరుధ్ధంగా ప్రవర్తించినందుకు చీమకు ఫైన్ పడింది. చీమ చెల్లించకపోయేసరికి చీమ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మిడతకు అప్పగించింది. ఈ కార్యక్రమాన్ని NDTV ప్రత్యక్ష ప్రసారం చేసింది.
.......
చివరకు న్యాయమే గెలించిందని అరుందతి రాయ్ అన్నారు.
సమాజానికి ఇప్పుడు న్యాయం జరిగిందని లాలు ప్రసాద్ పేర్కొన్నారు.
బలహీన వర్గాల విజయంగా దీన్ని CPM పేర్కొంది.
కోఫీ అన్నన్ UN సర్వ సభ్య సమావేశం లో ప్రసంగించాల్సిందిగా మిడతను అహ్వానించారు.
చాలా సంవత్సరాల తర్వాత,
…………
...........…….
అప్పుడే చీమ ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్ళిపోయింది. అక్కడే సిలికాన్ వాలీ లో భారీ పరిశ్రమ నొకదాన్ని స్ధాపించి సంతోషంగా ఉంది.
కానీ ఇక్కడ ఇండియా లో మాత్రం మిడతలు కరువుతో చస్తూనే ఉన్నాయి.(రిజర్వేషన్ ఉన్నా)
కష్టపడి పని చేసే చీమలను పోగొట్టుకోవడంచేతనూ, మిడతలను మేపుతూ ఉండడం చేతనూ ,
................................................
................................................
భారతదేశం ఇంకా వర్ధమాన దేశమే!