Monday, June 11, 2007

ఓం మహా ప్రాణ దీపం

ఓం మహా ప్రాణదీపం,శివం,శివం
మహోంకార రూపం, శివం,శివం
మహా సూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గాఢ తిమిరాంతకం సౌర గాత్రం
మహా కాంతిబీజం, మహా దివ్య తేజం,
భవానీ సమేతం , భజే మంజునాధమ్,
ఓం....ఓం.....ఓం
నమః శంకరాయచ, మయస్కరాయచ, నమశ్శివాయచ, శివతరాయచ, భవహరాయచ......
అద్వైత భాస్కరం, అర్ధ నారీశ్వరం,హృదిశ హృదయంగమం , చతురుదదిసంగమం,పంచభూతాత్మకం, షఢ్చత్రు నాశకం, సప్త స్వరేశ్వరం,అష్ట సిద్దేశ్వరం, నవ రస మనోహరం, దశ దిశాసురిమలం, మేఘా దశోజ్వలం, మేఘ నాధేశ్వరం, ప్రస్తుదివ శంకరం, ప్రణవ జన కింకరం, దుర్జన భయంకరం, సజ్జన శుభంకరం,ప్రాణి భవతారకం, ప్రకృతి హిత కారకం, భువన భవ్య భవ ధాయకం, భాగ్యాత్మకం, రక్షకం.........
ఈశం,సురేశం,రుషేశం,పరేశం,నటేశం, గౌరీశం, గణేశం, భూతేశం, మహా మధుర పంచాక్షరీ మంత్ర పాశం, మహా హర్ష వర్ష ప్రవర్షం,సుశీర్షం,.........

ఓం నమో హరాయచ, స్మరహరాయచ, పురహరాయచ, రుద్రాయచ, భద్రాయచ,ఇంద్రాయచ,నిద్రాయచ, నిర్నిద్రాయచ, మహా ప్రాణ దీపం........
ఢం ఢం ఢ ఢం ఢం, ఢం ఢం ఢ ఢం ఢం, ఢంకాదినాద నవ తాండవాడంబరం తధ్ధిమ్మి తకధిమ్మి, ధిధ్ధిమ్మి ధిమిధిమ్మి, సంగీత సాహిత్య సుమ కమలమంబరం.....
ఓం కార, హ్రీంకార, శ్రీంకార, ఐంకార, మంత్రబీజాక్షరం, మంజునాధేశ్వరం,
ఋగ్వేద మాధ్యం, యజుర్వేద వేద్యం, సామ ప్రదీప్యం, అధర్వ ప్రకాశం,
పురాణేతిహాసం, ప్రసిధ్ధం విశుధ్ధం, ప్రపంచైక సూత్రం, విశుధ్ధం,సుశిధ్ధం,
నకారం, మకారం, శికారం, వకారం, యకారం, నిరాకార సాకార సారం, మహా కాల కాలం, మహా నీలకంఠం, మహా నందనందం,మహాట్టాట్టహాసం, జటా జూట రంగైక గంగా సుచిత్రం, జ్వలద్యుగ్ర నేత్రం, సుమిత్రం, సుగోత్రం,
మహకాశ భాసుం, మహా భాను లింగం,............మహా వక్త్రు వర్ణం, సువర్ణం ప్రవర్ణం,
సౌరాష్ట్ర సుందరం, సోమనాధేశ్వరం, శ్రీ శైల మందిరం, శ్రీ మల్లిఖార్జునం, ఉజ్జయని పుర మహా కాళేశ్వరం, వైద్య నాధేశ్వరం, మహా భీమేశ్వరం, అమర లింగేశ్వరం, రామ లింగేశ్వరం, కాశి విశ్వేశ్వేశ్వరం, పరం కృష్ణేశ్వరం, త్రయంబకేశ్వరం, నాగ లింగేశ్వరం, శ్రీ కేదార లింగేశ్వరం .........................
ఆది లింగాత్మకం, జ్యోతి లింగాత్మకం, వాయు లింగాత్మకం, ఆత్మ లింగాత్మకం, అఖిల లింగాత్మకం, అగ్ని సోమాత్మకం ............
అనాదిం, అమేయం, అజేయం, అచింత్యం, అమోఘం, అపూర్వం, అనంతం, అఖండం(2)
ధర్మ స్ధల క్షేత్ర వర పరం జ్యోతిం(3)
ఓం నమః సోమాయచ , సౌమ్యాయచ, భవ్యాయచ, భాగ్యాయచ, కాలాయచ, కాంతాయచ, రమ్యాయచ, గమ్యాయచ, ఈశాయచ, శ్రీశాయచ, సర్వాయచ ............................

No comments: