Thursday, July 5, 2007

అమ్మ-అమ్మ-అమ్మ

(ఇది నా సొంతం కాదని మనవి)

నువ్వు మొదటి సారి గర్భాన కదిలినపుడు
పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని
నిద్ర రాకుండా కదులుతూ హడావిడి చేస్తుంటే
ఉత్సాహంగా అనిపించింది హుషారయిన వాడివని

నను చీల్చుకొని ఈ లోకంలోకి వచ్చాక
మమకారం పొంగులు వారింది నా ప్రతిరూపానివని

నా రక్తాన్ని పాలుగా తాగుతుంటే
బోలెడంత ఆశ కలిగింది
అందరికంటే బలవంతుడవ్వాలని

తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే
తట్టుకోలేనంత ఆనందం పొంగింది
నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని

ఆ అడుగుల్లోనే నాకు దూరమైతే
ఆశీర్వదించాలనిపించింది
గొప్పవాడివవ్వమని

జీవన వత్తిడిలో పడి నన్ను మరిచిపోతే
కొండంత దైర్యం వచ్చింది
నేను లేకపోయినా బ్రతకగలవని

ప్రాణం పోయేటప్పుడు
కంటతడి పెట్టనందుకు త్రుప్తి గా ఉంది
నీకు తట్టుకొనే శక్తి ఉందని

ఇప్పుడే నాక్కొంచెం బాధ గా ఉంది
అందరూ నే పొయానని ఏడుస్తుంటే

నన్ను కాల్చేటప్పుడు నీ చెయ్యి కాలుతుందేమోనని

No comments: