Tuesday, October 9, 2007

కర్ణ- గురి తప్పిన(తప్పని) శరమా? లేక గురి లేని శరమా

ఎప్పుడు భారతం గురించినా మాట్లాడినా నేను ముఖ్యంగా ఇద్దరి గురించి మాట్లాడుతాను. ఒకరు ధుర్యోధనుడు మరొకరు కర్ణుడు. ఇంకా చెప్పాలంటే కర్ణుడంటేనే నాకు చాలా ఇష్టం. స్నేహానికి ప్రాణమిచ్చేవాడు,చేతికి ఎముక లేని దాత, గురి తప్పని శరసంధాత, అభయ ప్రదాత అని. కానీ ఈ మధ్య ఎప్పుడో "దానవీరశూరకర్ణ" చూస్తుంటే చాలా సందేహాలు వచ్చాయి. ఎవరిని అడగాలో తెలియక బ్లాగ్లోక సహాయాన్నర్ధిస్తున్నాను.

కర్ణుడు నిజంగా స్నేహానికి న్యాయం చేసాడా? తెలిసి తెలిసి కుంతికి పుత్రభిక్ష ఎలా ఇచ్చాడు. కర్ణుడు తన కోసం యుధ్దం చేస్తే వైరి వర్గంలోని వారిని చంపడం , వదలడం తన ఇష్టం, కానీ తన రాజు కోసం చేస్తూ శత్రువర్గంలోని నలుగురు ప్రదాన వీరులను వదిలేస్తానని మాట ఇవ్వడం ఏ విధంగా న్యాయం? అదీ సైన్యాధిపతి స్ధానంలో ఉండి.దేవదేవుడైన వాసుదేవుడికే స్నేహధర్మాన్ని వివరించిన వాడు, తల్లి ప్రేమకు లొంగిపోయాడా?

నిజంగా కర్ణుడు స్నేహానికి న్యాయం చేసాడా? వివరించగలరు.

3 comments:

Rao said...

suyoadhanudu karNuninunDi aasinchinadi arjununitoa sama ujjee koasam.
karNuDu aa rakamgaa daana veera Soora karNuDae.

Burri said...

కర్ణ గురి తప్పని శరమే, కర్ణ ఎప్పుడు ఇతరుల్లో బాధను చూస్తాడు, మరియు వారికి దానం చేయటమై ప్రధమ ధ్యేయం, కుంతి దేవి స్ధానంలో ఎవరు వచ్చి అడినా పుత్రబిక్ష పెటేవాడు. 'కుంతి-కర్ణ సంవాదం' గురించి నా మరమరాలులో ఒక టపా చదవండి.

ఇంకా ధుర్యోధనుడు, ఇతను ఎదట వ్యక్తిలోని చెడును మాత్రమే చూడును, ఇంకా ఏమి చూడడు. ఇతనికి ఎవరూ శాశ్వత మిత్రులు ఉండరు (ఇప్పటి రాజకీయ నాయకుల మాదిరి). కర్ణధుర్యోధనులు మిత్రులుకారు, వారిది ఒక (రాజకీయ) కూటమి.

అందుకై మీతో పాటు చాలా మందికి కర్ణుడు (కాని ధుర్యోధనుడు కాదు సుమా!) అంటే అభిమానం, దాని గురించి నా టపా "కర్ణుడి అభిమాని జగదీశ్ చంద్రబోస్"ను చదవండి.

-మరమరాలు

మనోహర్ చెనికల said...

Kameswara rao:
Ofcourse, దుర్యోధనుడు కర్ణుడితో స్నేహం కట్టింది అర్జునిడితో సమఉజ్జీ అనే, కానీ అది తను సైన్యాధిపతి స్థానంలో లేకుండా ఐతే సరే. సైన్యాధిపతి అయిన తర్వాత ఆయన లక్ష్యం తన రాజు యొక్క వ్జయం మాత్రమే కావాలి కదా? తన దానగుణ నిరూపణ కోసం విజయాన్ని కూడా దానం చేయడం ఎంతవరకు న్య్యాయం?
మరమరాలు:
దుర్యోదనుడు కర్ణుడిని స్నేహితుడిగా చూడలేదు. అవసరం కోసం అంగరాజ్యం తో అభిషేకించాడు. మరి కర్ణుడు ? కర్ణుడు కూడా అంతేనా. కర్ణుడి దృష్టిలో దుర్యోధనుడు ఎంటి?