Monday, December 26, 2011
సనాతన ( హిందు ) ధర్మం లో "ఓం" ను ఎందుకు భగవంతుని చిహ్నము గా స్వీకరించారు?
శబ్దమే భగవంతుడని చెప్పబడింది.ప్రతిపదము నకు మూలాధారము గా ఒక గుర్తుగా ఉంటే అది ఉత్తమోత్తమ చిహ్నం అవుతుంది.శబ్దోచ్చారణ లో మనం కంఠం లో ని స్వరపేటికను,అంగిలిని, శబ్ద ఫలకాన్ని ఉపయోగిస్తాము.ఏ శబ్దము నుండి ఇతర శబ్దాలన్నీ వ్యక్తమవుతున్నాయో అలాంటి అత్యంత స్వాభావిక శబ్దము ఏదైనా ఉందా? ఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారము.ఇందులో అ,ఉ,మ లు ఉన్నాయి.నాలుకలోని, అంగిలిలోని ఏ భాగము కూడా 'అ 'కార ఉచ్చారణ కు తోడ్పడదు.ఇది ఓంకారానికి బీజం గా ఉంది.చివరిది 'మ 'కారము.పెదవులని మూసి దీన్ని ఉచ్చరిస్తారు.నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయము లో దొర్లుకుంటూ ఉంటుంది.ఇలా శబ్ద ఉచ్చారణా ప్రక్రియనంతా ఓంకారం తెలియజేస్తూంది.అందువలన ఓంకారాన్ని స్వీకరించడము జరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
Well done Sir!
ఓంకార ప్రభవా వేదా ఓంకార ప్రభవా స్స్వరాః / ఓంకారప్రభవం సర్వం త్రైలోక్యం స చరాచరం //
భరద్వాజ్ గారు,
సర్ అనకండి,
వయసులో కానీ, అనుభవంలో కానీ మీకన్నా చాలా చిన్నవాడిని
@భారతి:
మంచి శ్లోకాన్నిచ్చారు, ధన్యవాదాలు
/నోటిలోని మూలభాగము నుండి అంత్యభాగము వరకు కూడా ఉచ్చారణ సమయము లో దొర్లుకుంటూ ఉంటుంది./
అలానా? మీ వివరణ బాగుంది.
అలా దొర్లుకుంటే వచ్చే లాభం ఏమిటండి? ఇలా దొర్లుకునే పదాలు ఇంకా ఏమైనా వున్నాయా, ఇదొక్కటేనా?
Post a Comment