Saturday, May 2, 2009

విజయేంద్ర జాతక కధలు-"మిత్రుడు"

బుద్ధుడి జాతక కధలు అని అప్పుడప్పుడూ మీరు వినే వుంటారు. ఇది మన విజయేంద్రుడి కలం నుండి జాలువారిన జాతక కధ. పోస్టర్ చూసిన తర్వాత ఫస్ట్ అనిపించింది ఏంటంటే శివలెంక కృష్ణప్రసాద్ కి ఈ సినిమా కొంచెం డబ్బులు మిగులుస్తుంది అని. టైటిలే కొంచెం మార్చి ఏ మూడు ముళ్ళ బంధం అనో ఏడడుగుల సంబంధం అనో పెట్టుంటే బాగుండు అనిపించింది. బహుశా విదేశంలో జరిగిన పెళ్ళికి అంత పవర్ ఉండదనుకున్నారేమో అందుకే టైటిల్ అవి తట్టినట్టు లేవు. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాలో నిజంగా నటించాడు. ఒక్క మగాడిని అని అహంకరించకుండా స్క్రిప్ట్ లో ఉన్న మిగతా నటీనటులకి కూడా కనిపించే అవకాశం ఇచ్చాడు. ఇక కొయ్యడాలు, నరకడాలు ,భారీ భారీ డవిలాగులు లేకుండా మరి మన బొబ్బిలి సింహంతో సినిమా తీసినందుకు నిజంగా దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఒక యంగ్ హీరో కి సరిపోయే కధతో ఆ కధలో బాలకృష్ణ ని పెట్టి బాలకృష్ణ ని యంగ్ గా చూపించగలిగిన(మరీ టూ మచ్ రాస్తున్నానా ,లేదు లే బాలకృష్ణ నిజంగానే యంగ్ గా ఉన్నాడు సినిమా లో) టీం నిజంగా ప్రశంసా పాత్రమే. సినిమా ఆద్యంతం ఒకే టెంపో మెయింటెయిన్ చేసాడు. టెంపో అంటే పెద్ద ఉద్దేశ్యం ఏమీ లేదండీ నాకు. బాలకృష్ణ సినిమా అంతా పాటలతో సహా ఒకేలా కనిపించాడు. మామూలుగా అయితే విజయేంద్రవర్మ క్లైమాక్స్ లాగా ప్రతీ సినిమాలోనూ పదీ ,పదిహేను రకాలుగా కనిపించేవాడు.ఇందులో అలా లేదు ఇందుకు దర్శకుడిని తప్పకుండా మెచ్చుకోవాలి. ఇక ద్రోణ తర్వాత సినిమా అయినా కూడా దర్శకుడు ప్రియమణిని కంట్రోల్ లో ఉంచాడు. అందుకు ఒక ఓ ! డైరెక్టర్ కి ,.


ఇక ఇప్పుడు విషయంలోకి (నా బొంద విషయం ఏముంది చెప్పడానికి. సినిమా చూసిన వాళ్ళకి టైటిల్ చూడగానే అర్ధం అవుతుంది. సినిమా చూడని వాళ్ళకి ఎటూ నేను స్టొరీ చెప్పబోవడం లేదు కాబట్టి అర్ధం కాదు.)సరే విషయం టూకీగా చెప్తాను అర్ధం చేసుకోగలిగినవాళ్ళు చేసుకోండి. లేదంటే సినిమా చూడండి.

ఓ యాక్సిడెంట్-కొన్ని చావులు-ఒక జాతక ప్రేమకధ- ఒక చావుకై ,తోడుకై వెతుకులాట (కంగారు పడద్దు చావులో తోడు అని కాదు , చావక పోతే,చావు రాకపోతే బతకాడిని తోడు అని అర్ధం) - అదీ స్టోరి .

ఒక వేల మీరీ టపా చదివి సినిమాకెల్తే మాత్రం బయటకు వచ్చాక కూడా మీకు కూడలీ,జల్లెడా నా బ్లాగూ తప్పకుండా గుర్తుంటాయి నాదీ పూచీ.


ఎనీ క్వశ్చన్స్:

-- ఈ టపాకి మీ టైటిల్ కీ సంబంధం లేదు అని నా ఆబిప్రాయం ,దీనికి మీ సమాధానం?

సమా: సర్లే పెద్ద చెప్పొచ్చావు కాదు కాదు అడగొచ్చావు తెలుగు సినిమా టైటిల్స్ కి , సినిమాలకీ ఉంటున్న సంబంధం కంటే ఎక్కువే వుంది .అయినా అడిగావు కాబట్టి నీకింకో విషయం చెప్తా. సినిమా చూసి బయటకు రాగానే సినిమా పోస్టర్ చూసి నేను అన్న మొదటి మాట ఇదే . అందుకే ఇదే టైటిల్ అంతే.

3 comments:

Kathi Mahesh Kumar said...

హహహ బాగుంది.

నాగప్రసాద్ said...

మొత్తానికి ఎండాకాలంలో బాలకృష్ణ నటించిన సినిమా ధైర్యంగా చూడొచ్చన్నమాట. :)

Anil Dasari said...

>> "సినిమా ఆద్యంతం ఒకే టెంపో మెయింటెయిన్ చేసాడు"

పాపం మరీ అంత లో బడ్జెట్ సినిమానా? మరీ ఒకే ఒక డొక్కు టెంపోతో సినిమా అంతా లాగించేశారా!?! రెండు మూడు సూమోలు పెడితే సినిమా మరికొంత భారీగా ఉండేది కదా :-)