Tuesday, May 19, 2009

హనుమత్ రక్షా యాగం పూర్ణాహుతి .





రవ్వవరం లో రెండు ఎకరాల సువిశాల క్షేత్రంలో నిర్మింప బడ్డ శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం లో హనుమత్ రక్షా యాగం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ యాగం ఇప్పుడు పూర్ణాహుతి దశకు చేరుకుంది. ఎక్కడెక్కడనుండో మీ సంకల్పాలను మాష్టరుగారు ఆ స్వామికి నివేదించి, రోజూ మన గోత్ర నామాలతో క్రమం తప్పకుండా పూజ ను నిర్వహిస్తూ వచ్చారు.ఆ స్వామి అనుగ్రహం చేత నేను రవ్వవరం లో వేంచేసి యున్న ఆ జగన్మాత ని, క్షేత్ర పాలకుడైన ఆ వాయునందనుడిని దర్శనం చేసుకోగలిగాను.ఎన్నో రకాలుగా పరీక్షలు పెట్టి ఆ స్వామి రవ్వవరం వెళ్ళడానికి నాకు అనుమతినిచ్చారు. పీఠం, యాగం అనగానే నేను ఏదో అనుకున్నాను. కానీ అక్కడకు వెళ్ళిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను. చక్కటి ప్రదేశం, చూడగానే ప్రశాంతత మూర్తీభవించినట్లుండే పరిసర ప్రాంతాలు, పల్లెటురి ఆప్యాయతలు, అక్కడ దీక్ష తీసుకున్న బాల స్వాములు, అంతా కలిసి నా అనుభవాన్ని ఆనంద మయం చేసారు.వెళ్ళగానే స్నానాదికాలు పూర్తి గావించి స్వామికి పూజ చేసాము. తర్వాత యాగం లో పాల్గొన్నాము. ఆ తర్వాత ఆ పీటం గురించి , పూర్వ చరిత్ర గురించి చెప్పారు. ఆ తర్వాత బాలస్వాములతో మాటలు మొదలుపెట్టాం. మొదట కొంచెం దూరంగా మసలినా తర్వాత దగ్గరయ్యారు. దానికి తోడు నాతో పాటు నాగప్రసాద్ ఉండనే ఉన్నాడయ్యే. వాడుంటే పిల్లలు చాలా తొందరగా దగ్గరికి వస్తారు. అలా వాళ్ళు బాగా కలిసిపోయారు.వాళ్ళ మాటలు వింటూ ఉండగానే సాయంత్రం అయ్యింది.సరే పిల్లలందరినీ రమ్మనమని చెప్పి ఆటలాడాము.ఖో ఖో ఆడి కాలు బెనికించుకున్నాను. ఆ తర్వాత నాగప్రసాద్ పరిగెత్తకుండా ఆడే ఆటలు ఆడించడంతో ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత సాయంత్రం మళ్ళీ పూజ, భజన జరిగింది. మాష్టరు గారి తాళజ్ఙానం అబ్బురపరిచింది.ఆదివారం రోజు ఇంకా ఆహ్లాదంగా గడిచింది. అక్కడున్న చెట్టూ,చేమా కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించాయి. దగ్గరిలో ఒక కొండ మీద కొండగురునాధ స్వామి ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళాము. మాకు తోడుగా కొంతమంది బాలస్వాములు వచ్చారు. ట్రెక్కింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి రవ్వవరం ఆ చుట్టుపట్ల ఉన్న కొండలు కోరిక తీరుస్తాయి.ఆ తర్వాత ఊళ్ళో వెలిసిన వేణుగోపాల స్వామిని, శివున్ని దర్శించుకుందామనుకుంటే సమయాభావం చేత కుదరలేదు.
కుదిరితే మీరు కూడా పూర్ణాహుతి కి వెళ్ళడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. ఏర్పాట్లు మాత్రం భారీ ఎత్తున జరుగుతున్నాయి. వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనిపిస్తుంది. ప్రయత్నించండి. ౫౪ (54) రోజుల పాటు అఖండంగా జరిగిన ఈ దీక్షా కార్యక్రమాన్ని చివరి రోజైనా దగ్గరనుండి చూడాలనుకుంటే,చూడాలనుకుంటే ఏంటి పాల్గొనాలనుకుంటే మరెందుకు ఆలస్యం, వెంటనే irctc నో,RTC నో అడిగి వినుకొండ కి టికెట్ తీసుకోండి. ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి.




దూర ప్రాంతములో ఉండి ఇక్కడకు రాలేని పరిస్థితిలో ఉన్న వారి కోసం స్వామి వారి రక్షలను (ఉచితంగానే) పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టల్ ఖర్చులు మాత్రం పంపించవలసి ఉంటుంది. ఇతర వివరాల కోసం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలవరకు ఈ ఫోన్ లలో సంప్రదించండి. అందుబాటులో ఉంటాము.Phone numbers: 09948235641, 09940050078, 08646211717.




marinni ఫోటో లు తదుపరి టపాలో ................

1 comment:

amma odi said...

"విజయ దశమి శుభాకాంక్షలు"