Monday, April 13, 2009

ఎవరికి మీ వోటు?

ఈ మధ్య కాలంలో లోక్ సత్తా గురించి ఎప్పుడు మాట్లాడినా
నువ్వు నేను తప్ప ఇంకెవరూ లోక్ సత్తా కి ఓటెయ్యరు. మనిద్దరి వల్లే లోక్ సత్తా గెలుస్తుందా అని అడుగుతున్నారు.

కానీ ఒకసారి లోక్ సత్తాని కనీసం ప్రతిపక్షానికైనా పంపగలిగితే మరికొంతమందికి స్ఫూర్తిగా ఉంటుందేమో, లేకపోతే నిజాయితీగా పనిచేద్దాం అనుకున్నవాడు కూడా ప్రజలు సినిమా వాళ్లకైనా వేస్తారు కానీ పని చేసేవాళ్ళకు మాత్రం వెయ్యరు అనుకునే ప్రమాదం ఉంది.ఒక రామా రావు గెలిస్తే ఇంకొక చిరంజీవి పుట్టుకొచ్చాడు, ఇప్పుడు చిరంజీవి గెలిస్తే ఇంకో జూనియర్ ఆర్టిస్ట్(అప్పటికి వాడు సీనియర్ అవుతాడు) మళ్ళీ వస్తానంటాడు. కానీ లోక్ సత్తా గెలిస్తే జయప్రకాష్ లాంటి అభిప్రాయాలు , ఆశయాలు ఉన్న మరి కొద్దిమంది రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉంది.కనీసం అలా మార్చగలం అన్న స్పూర్తి అన్నా కలుగుతుంది.

మళ్ళీ ఒకసారి ఇది కేవలం
మనిద్దరి వల్లే లోక్ సత్తా గెలుస్తుందా అని అడిగేవాళ్ళ కోసం........

7 comments:

amma odi said...

Good one.

సిరిసిరిమువ్వ said...

నిజం చెప్పారు. లోక్‌సత్తా నుండి కనీసం ఓ నలుగురు అసెంబ్లీకి ఒక్కరిద్దరు పార్లమెంటుకి వెళ్లినా చాలు.

ప్రస్తుతం పరిస్థితి కాస్త ఆశావహంగానే ఉందిలేండి-కనీసం హైదరాబాదులో. చాలామంది మా ఓటు లోక్‌సత్తాకే అంటున్నారు, మరి చూద్దాం.

మనోహర్ చెనికల said...

"కనీసం హైదరాబాదులో" అదే ప్రాబ్లం

Anonymous said...

సగటున ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం లో పదివేల వోట్లు తెచ్చుకుంటే లోక్ సత్తా బతికి ఉంటుంది.

లోక్ సత్తా తన నిజమైన సత్తా వచ్చే మునిసిపల్ ఎన్నికలలో చూపించగలదు.

అందరికంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు.

చైతన్య.ఎస్ said...

బాగా చెప్పారు.

Unknown said...

లెస్స పలికితివి మనోహరా...

మనోహర్ చెనికల said...

ఆదిలక్ష్మి గారుః
నెనర్లు.

bonagiri:
చూద్దాం.

చైతన్యః
నెనర్లు

ఫణిః
నెనర్లు