మొదటి భాగం
౧
మందపిల్లి
౧౯-౧౧-౩౮
రస రాట్టు గారికి నమస్కారములు -------మహాశయా! నాన్నగారు మా తోటారం భూముల మీదికి శిస్తు వాసులు వగైరాలకి వెళ్ళారు. పది రోజుల క్రితం తమ పేరట ఒక వచనరచన పంపి ఉన్నాను. మరి ఆలస్యం కానియక దానిమీద తమ సదభిప్రాయం పంపండి. తిరుగు టపాలో పంపాలి.
ఇట్లు,
గోపీనాధం.
జవాబు
పేరారం
౨౦-౧౧-౩౮
గోపినాధానికి ఆశీర్వచనాలు -----అబ్బాయీఏదో ఆలస్యం అయ్యింది. ఏమీ అనుకోకు. నాకు మీ నాన్న గారొకటీ నువ్వొకటీ కాదు. ఇదుగో:
ఈ గ్రంథం ఆంధ్రానికి ఒక ఆస్తి. అక్కడక్కడ దీంట్లో మామూలు దోషాలు లేకపోలేదు కాని, కొన్నిపట్ల ఇది ఎంతో హృద్యంగా ఉంది. ఇటీవలి దిన్నీమాండలికమున్నూ అయిన పోతభాష వాడితే నేంపోయె , చేతభాష కుడా పాళం గానే పడింది. అతి తెలివి సంకర సమాసాలు బలే విరివిగానూ, మహా జోరుగాను, లేవని చెప్పలేం కాని, జటిలత్వం నిండుకుంది అనడానికీ వీలు లేదు. పాండిత్యంలో లోటుకీ కదలోని నీటుకీ ఉర్జీ సరిపోయింది. ఇది ఉత్తమోత్తమం అని వ్రాయజాలం కాని , దీన్నినీచ కావ్యం అని కొట్టిపారెయ్యడానికీ మనస్కరించకుండా ఉంది. మొదలు ఎట్లా ఉందో చివరంటా అంతే.
ఇట్లు
రసరాట్.
(ఇంకా ఉంది)
2 comments:
పోతభాష, చేతభాష ... భమిడిపాటి కామేశ్వరరావుగారి రచనలు చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా చదివేదాన్ని. మళ్లీ మీరు ఇక్కడ పెట్టి ఆరోజులు గుర్తు తెచ్చినందుకు కృతజ్ఞతలు. మిగతా భాగాలకోసం ఎదురు చూస్తున్నా.
నేను ఎదురు చూస్తున్నాను మిగతా భాగాల కోసం. థాంక్స్.
Post a Comment