Wednesday, January 7, 2009

దేవుడా ఓ మంచి దేవుడా

దేవుడా ఓ మంచి దేవుడా
కాస్ట్ కటింగ్ పేరు చెప్పి
కుబేరుడి లాంటి ఐటిని కుచేలుడులాగా చేశావు
కిన్లే వాటర్ని కాస్తా కుండ నీళ్ళుగా మార్చావు
తాగడానికి డ్రింతులు తినడానికి బర్గరు లేకుండా చేశావు
సుఖమైన క్యాబ్ ప్రయాణాన్ని నిలిపివేయించావు
వీకెండ్స్ పార్టీలు లేవు, డిస్కోథెక్ లు లేవు
హౌస్ లోన్లు లేవు-పర్సనల్ లోన్లు లేవు
ఎప్పుడూ వెంటపడే బ్యాంక్ వాళ్ళు ఎటెళ్ళిపోయారో తెలియదు
ఎప్పుడు ఏం తీసేస్తారో తెలీదు
ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలీదు
ప్రశాంతమైన జీవితాన్ని ఒక ప్రశ్నలాగా మార్చావు
చివరికి ఐటి వాళ్ళకి పిల్లని ఇవ్వాలన్నా భయపడేలా చేశావు
ఈ కొత్త సంవత్సరంలోనైనా
ఉన్న పళ్ళు ఊడిపోయేలా కాకుండా
ఉన్న ఉద్యోగం నిలబడేలాగా- ఇస్తున్న జీతం ిచ్చేలాగా
మాకు కూడా పెళ్ళి అయ్యేలాగా చూస్తావని
కాస్ట్ కటింగ్ అనేది ఐటి వాళ్ళ జీవితంలో మరియు జీతంలో లేకుండా చేస్తవని ఆశిస్తున్నాను
నాకు తెలుసు నువ్వు చేస్తావని
ఎందుకంటే బేసికల్ గా యువార్ యె గాడ్, గుడ్ గాడ్

ఐటి వాళ్ళ తరపున నీకు ౨౦౦౯ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

ఇది నాకు వచ్చిన ఒక మెయిల్ నుండి, ఎవరైనా ముందే రాసుంటే క్షంతవ్యుడిని

3 comments:

Anonymous said...

అవును. ఇంతకుముందు బ్లాగుల్లో రెండు సార్లు వచ్చింది. ఈనాడు ఈతరంలో కూడా వచ్చింది.

mohanraokotari said...

kaavali vaaru nenu nellurkar ni ila manchi vishayaalu post chesthundandi

మనోహర్ చెనికల said...

@krishnarao
అందుకే ఎందుకన్నా మంచిదని ముందే రాశాను,
@koresh

సరిగ్గా అర్ధం కాలేదు.