Sunday, June 17, 2007

తాజ్ మహల్ -> తేజో మహాలయ్ (శివాలయం) ???--- నాగరాజు గారి పోస్ట్ కి సపోర్టింగ్

(అచ్చు తప్పులను క్షమించగలరు)
తాజ్ మహల్,
ఒక మహా శివాలయాన్ని సమాధి గా చరిత్రకారులు అందించడం తప్పే, కాదనను. కానీ ఇక్కడ సమస్య తాజ్ మహల్ సమాధి అవునా కాదా అనేది కాదు అని నా అభిప్రాయం. నిర్ద్వంద్వంగా తాజ్ మహల్ షాజహాన్ కట్టించలేదు. దానికి చాలా రకాల అధారాలు ఉన్నాయి. అయితే తాజ్ మహల్ గొప్ప కట్టడమా కాదా? దానికి ప్రపంచ ఏడు వింతల్లో చోటు సాదించే అర్హత ఉందా లేదా అని మాత్రం మనం మట్లాడుకోవాలి. నేను అందరినీ పేరుపేరునా అడిగేది ఒకటే. మీకు తాజ్ మహల్ నచ్చితే వోటు వేయండి. దానికంటే అధ్భుతమైన కట్టడాలు కనిపిస్తే వాటికే వోటు వేయండి. దీనికి చరిత్ర రంగు పులమకండి. తాజ్ ని షాజహాన్ కట్టించలేదని నిరూపించే పనులు ఎప్పుడో మొదలై పూర్తయ్యాయని నా అభిప్రాయం.భారత దేశానికి ఉన్న ఒకే ఒక అమూల్యమైన, అపూర్వమైన, అద్వితీయమైన కట్టడాన్ని భావి తరాలకు తెలియచేయడానికి దాన్ని ఏడు వింతల్లో చేర్చడమే మార్గమని నా అభిప్రాయం.లేకుంటే ఎన్నో శిధిలాలయలలా, అదీ మరుగున పడి మసి బారి పోతుంది.

M.V.R. Shastry - "ఏది చరిత్ర" పుస్తకం తాజ్ మహల్ గురించి, చరిత్ర గురించి నిజాలను చాలా వరకు తేట తెల్లం చేస్తుంది. చదివి చూడండి.

3 comments:

చదువరి said...

ఔను, భారతీయుడన్న ప్రతీ వాడూ తాజ్ మహలుకే ఓటేసి, ఏడు వింతల్లో దానికీ చోటు దక్కేలా చూడాలి. అప్పుడన్నా "ఏంటసలీ మహలు కథ" అని నెట్లో ఈదకపోరు, అది మహలు కాదు మహాలయమని ఎరుగకా పోరు. చరిత్రను చాపలా చుట్టేసి దాచేసే మన హిరణ్యాక్షుల సంగతులను గ్రహించకా మానరు.

తాజ మహలు కంటే అద్భుతమైన కట్టడాలుంటే ఉండొచ్చేమో గానీ, అద్భుత చారిత్రక వారసత్వాన్ని కాలదన్ని, దురాక్రమణదారులను, దోపిడీగాళ్ళను, జాతి పీడకులను ఆదర్శ చక్రవర్తులుగా కీర్తించే జాతి ప్రపంచ చరిత్రలో మరోటి ఉండదు.

Naga said...

అవును. బాగా చెప్పారు. తాజ్ మహల్ అంటే తెలియని విదేశీయులు చాలా తక్కువ, అది 7 అద్భుతాలలో ఉన్నందుకే సాధ్యం అయ్యిందనుకుంటాను.

yallapragada hyma kumar said...

తాజ్ మహల్ గురించి చారిత్రక సత్యాలు బయట పెట్టాలి అంటే దానర్ధం ఇప్పటి భారతీయముస్లింలకు వ్యతిరేకమయ్ న చర్యగా అభివర్ణించే మేధావులున్న దేశంమంది..అది చూసి ఓట్ల కోసం గాడిదలు ఆడే నాటకం మనకి తెలియంది కాదు.రామసేతునే కల్పితం కధగా చెప్పిన ప్రభుత్వాలు మనవి.