Friday, January 6, 2012

మురికి బొమ్మ - Dirty Picture

శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
ఆఫీస్ లో మా మేనేజర్ ఏదో మీటింగ్ అంటే వెళ్ళా. "We need to think about big picture" అని ఏదేదో చెప్తున్నాడు. ఆయన బిగ్ పిక్చర్ అనగానే నాకు డర్టీ పిక్చర్ గుర్తొచ్చింది. తర్వాత నాకింకా కొన్ని డౌట్లొచ్చాయి.

నటనలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన , ఓ ఎస్.వి రంగారావుగారు, ఊర్వశి శారద వీళ్ళ పేర్ళు జాతీయ స్థాయిలో చాలామందికి తెలియవు. ఎస్.వి. రంగారావంటే గుర్తొచ్చింది, ఏమి మనిషండీ, రూపు గట్టిన హిరణ్యకశిపుడే అనిపిస్తాడు భక్త ప్రహ్లాద సినిమాలో. "శ్రీ కాకుళాంధ్ర మహావిష్ణువు కధ" లో వల్లభుడనే సమాధానం వచ్చే పొడుపుకధ విప్పే సమయంలో, సంకెళ్ళు పటపటా తెంపే సన్నివేశంలో ఆయన హావభావాలు అలా గుర్తుండిపోయాయి. ఇలాంటివాడు కాబట్టే సంకెళ్ళు తెంపగలిగాడు అని అనుకునేవాడిని చిన్నప్పుడు. ఆయనవి ఇంకా మంచి మంచి సినిమాలు ఉన్నాయనుకోండి, నాకు బాగా నచ్చిన సినిమా భక్త ప్రహ్లాద, నాకు బాగా గుర్తున్న సీన్లు పైన చెప్పిన రెండూనూ.
అలాంటి తరం నుండి, నేటి తరం సినిమాలు ఎలా ఉన్నాయో చూస్తే కొంచెం బాధగానే ఉంది.
ఎందుకు ఈ మధ్య మన హీరోయిన్లంతా ఐటం సాంగులు, వాంపు రోల్స్ మీద పడ్డారు, ఇవ్వేళ ఏ ఇంట్లో విన్నా "జిలేబీ భాయ్ " అనో, లేకుంటే "చిక్ని చమేలి" అనొ ,"ఊ ళళా ఊళళా" అనొ,"చమ్మక్ చల్లో" అనొ ,"డియ్యాలో డియ్యాలో " అనొ, "రింగ రింగ" అనొ తప్ప వేరే పాటలు వినపడట్లేదు. మీడియా కూడా వీటినే పాపులర్ చెయ్యడానికి చూస్తుంది. రోజుకి పదిసార్లు అదే పాటని ప్రసారం చేస్తే , వాళ్ళని చూసి పిల్లలు కూడా ఓ మల్లికా షెరావత్ లాగానో, విద్యాబాలన్ లాగానో అయితే మనకి తొందరగా పేరొస్తుందనుకున్నరనుకోండి , సామాజిక విలువలు ఏ స్థాయికి పడిపోతాయో అందరూ అర్ధం చేసుకోవాలి. పిల్లలు ఏం చూస్తున్నారో ,వాటి ప్రభావం పిల్లలమీద ఎలా ఉంటుందో కూడా తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. అందరూ చూస్తున్నారు కదా, ఇవ్వాళ ఇదే ట్రెండ్ అని వదిలేస్తే, దాని పర్యవసానం చాలా తీవ్రం గా ఉంటుంది.

నేనో చిన్న ఉదాహరణ చెప్తాను.

మా కజిన్ ఒకామెకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దామె పేరు వైష్ణవి, పాటలు బాగా పాడుతుంది అంటే ఒక రోజు ఏదన్నా పాట పాడమ్మా అని అడిగా, అంతే డియ్యాలో,డియాలో..... రింగ రింగ అని మొదలు, నాకు చిరాకు వేసి ఎక్కడ నేర్చుకున్నావు ఈ పాట అని అడిగా,మా నాన్న సెల్లులో పాటలు అని చెప్పింది. వాళ్ళ నాన్న సెల్లులో ప్లే చేస్తుంటే విని నేర్చుకుంది. తనకి ఆ పాట పూర్తి అర్ధం తెలియదు. సరే నేను ఒకసారి "మహా ప్రాణదీపం ,శివం,శివం" పాట వినిపించాను. అర్ధం కాకపోయినా మామయ్యా, ఈ పాటే బాగుంది, మళ్ళీ పెట్టవా అని అడిగి మరీ విన్నారు, ఎప్పుడు వెళ్ళినా మర్చిపోకుండా మావయ్యా అల్లా శివం పాట పెట్టవా అని అడిగి మరీ వింటారు. ఆ పాటకీ వాళ్ళకి అర్ధం తెలియదు, కానీ ఆ పాట వినేకంటే ఈ పాట వినడం మంచిది కదా.
రేపు పొద్దున్న ఈ పాటకి అర్ధం తెలిస్తే శివతత్వం మీద ఆసక్తి పెరుగుతుంది, ఒక్క పాట వేదాలెన్నో, సంగీత గతులెన్నో, ద్వాదశ జ్యోతిర్లింగాలేంటో, పంచాక్షరీ ప్రాశస్త్యమేంటో, అన్నిటి గురించీ చెప్తుంది. వీటిలో ఏ ఒక్కదానిమీద ఆ పాపకి ఆసక్తి కలిగినా తన జీవితం బాగుంటుంది కదా. on the other hand రేపు పొద్దున్న పెద్దయ్యాక డియ్యాలో డియ్యాలో పాట అర్ధం అయ్యే వయసు వచ్చినప్పుడు ?..........

అందుకే అంటారు మాట్లాడే మాట ఆత్మహత్యా సదృశమూ కాగలదు, అభయ,జ్ఞాన ప్రదానమూ చెయ్యగలదు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం రామాయణమే ఉంది. ఒక పతివ్రతని బంధించి తన ఇంట్లో పెట్టి అనకూడని మాటలన్నీ అని చావు కొని తెచ్చుకున్నాడు రావణాసురుడు, ఒక పతివ్రత దుఃఖాన్ని చేత్తో స్పృశించకుండా తన వాక్కుతో ఓదార్చి ధైర్యం చెప్పి ఆమెని మనస్పూర్తిగా నవ్వేలా చెయ్యగలిగాడు, శత్రు సభా మధ్యంలో నిలబడి నిర్భీతిగా మాట్లాడగలిగాడు హనుమ.

వాళ్ళు డబ్బొస్తుంది కదా అని ఆ మురికి బొమ్మల్లో పొర్లాడుతున్నారు, ఇకనుండైనా ఈ మురికి బొమ్మల మూలంగా పిల్లలకి మురికి అంటకుండా జాగ్రత్త పడదాం.

6 comments:

durgeswara said...

వెల్

Sunny said...

బాగా చెప్పారు... అస్తమానం ఆ దరిద్రపు పాటలే వింటే పిల్లలు కూడా అలాగే తయారవుతారు.. పెద్దలు కూడా చొరవ తీస్కొని, అసలు పిల్లలు ఎం నేర్చుకుంటున్నారో దృష్టి పెట్టాలి.

Poojalu & Homa said...

మీరు అన్న మాట నిజమే ఇరోజు చాలామంది పిల్లలు ఈ విధానములో ఉన్నారు ఇంత ఎందుకు ఈరోజు టీవీ లో ఒక పౌరాణిక చిత్రము వస్తోంది అంటే ఎవ్వరు చూడరు వేరే చానల్లోకి వెళ్ళిపోతారు పిల్లల ఆలోచనా ప్రవృత్తి మారుతోంది దానిని మనము నివారించడానికి అయినా ఏదో ఒకటి మంచి ఆలోచన చెయ్యాలి.

Anonymous said...

మురికి బొమ్మ. డర్టీ పిక్చర్ కన్నా ఘాటుగా ఉందీ టైటిల్.
చాలా బాగా పెట్టారు.

ముఖ్యంగా టివిల వల్ల వయోభేదం లేకుండా అందరూ అన్నీ చూసేస్తున్నారు.
ఈ విషయంలో పిల్లలకి గైడెన్స్ చాలా అవసరం.
వాళ్ళకి ఇష్టం లేకపోయినా అప్పుడప్పుడు మంచి పాత సినిమాలు చూపించాలి.

Disp Name said...

ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చె తనువున్ 'డ్రెస్సు ' శ్రమంబయ్యెడిన్ కాలమును గాంచినెన్!




చీర్స్
జిలేబి.

మాలా కుమార్ said...

సినిమాలేనా టి. వి లూ అలాగే వున్నాయి భయంకరం గా .