Tuesday, October 27, 2009

ఇంకెన్నో రోజులు లేదులే మీ కోరిక తీరడానికి!

శ్రీ రామదూతం శిరసా
నమామి!

తెలుగు మెడలో ఈ
బోర్డ్ ఎప్పుడో పడింది.

ఈ రోజు కొత్తగా
బాధ పడడమెందుకు? మనం కోరుకున్నదేగా
జరుగుతున్నది. మన పిల్లలు తెలుగులో
మాట్లాడితే మనకే అవమానం.

"
అల
వైకుంఠపురం లో,జో అచ్యుతానంద
జోజో ముకుంద " లాంటి అచ్చతెలుగు
పదాలు, పద్యాల అందాలు ఇప్పుడు
అవసరం లేదు.
ఆకాశంలో మెరిసే
తారల గురించి కూడా ఇంగ్లిష్
లోనే చెప్పాలి,ట్వింకిల్ ట్వింకిల్
స్టార్ అంటూ.... చెప్దాం.
క్రిష్టియన్

స్కూల్లో పిల్లలు పెద్ద చదువులు(?) చదవాలి, దానికి తెలుగైతే ఏంటి, ఇంగ్లిష్ ఐతే ఏంటి అనే కదా చేర్పించాము
ఇప్పుడు ఏడవడం దేనికి?

ఎటూ మన పిల్లల్ని
వాళ్ళు తెలుగు చదవ నివ్వరు,మనమూ
చదవనివ్వము.,
పెద్దవాళ్ళకి తెలుగు

తప్ప ఇంకేది రాని కుటుంబాలు
ఇంకా కొన్ని ఉండడం చేత పిల్లలకు
, ఆ లు  అమ్మ,అత్త పదాలు వస్తున్నాయి.

ఈ పిల్లలకు అంతకు మించి తెలుగు

రాదు ఇరవయ్యేళ్ళకైనా, అరవయ్యేళ్ళకైనా . ఇక ఆ తర్వాతి తరానికి అసలు చన్సే
ఉండదు.
సో ఇంకొక్క తరమే మిగిలింది

తెలుగుని బతికించడానికైనా, చంపడానికైనా...


ఒక హారీ పోటర్
పిల్లలకి నచ్చుతుందంటే, అంతకి
మించి పిల్లల ఊహా శక్తిని, సృజనాత్మకతని
పెంచే కధలు మనకి లేవా?
(లేవు అని
ఇప్పుడు ఎవరూ అనకపోవచ్చు, కాని
భవిష్యత్తులో లేవని చెప్పే
రోజులు కచ్చితంగా వస్తాయి.)
కానీ చెప్పాలంటే మనకి రావాలి
కదా,
మనకి తెలిసినవన్నీ చేతన్

భగత్ పుస్తకాలూ, సిడ్నీ షెల్డన్
పుస్తకాలున్నూ , ఇక మనమేం చెప్తాం.

అందుకే టీచర్స్ కి వదిలేసి మనం

మాత్రం మన పిల్లల మెరుగైన భవిష్యత్తు
కోసం (డబ్బుంటే చాలా వ్యక్తి
వికాసం అవసరం లేదా) కష్టపడుతూ
ఉంటాం (?).
ఆ టీచర్స్ ఏం చెప్తున్నారో

మనకి తెలియదు.
మన పురాణాలు
,కావ్యాల
గురించి ఉండేదే ఒక తెలుగు పుస్తకంలో , అలాంటి తెలుగు ఒక క్రిష్టియన్
టిచర్ చెప్తే ఎలా ఉంటుందో అనుభవించి
బాధ పడాలే కాని చెప్పేది కాదు.

పార్వతీ కళ్యాణం చెప్పినా అదే

తంతు, శ్రీ కృష్ణుని బాల్య క్రీడలు
చెప్పినా అంతే. ఇవన్నీ మనకవసరం
లేదు.
ఇంకేం జరుగుతుంది ఇది

కాక. మనమలక్ష్యం చేసి చంపేసిన
తెలుగుకి వాళ్ళు ఇప్పుడు సమాధి
కడుతున్నారు...


తెలుగు బతకాలంటే
ఏం చెయ్యాలో అందరికీ తెలుసు, ఇలా చెయ్యండి, అలా చెయ్యండి
అని చెప్పల్సిన అవసరం లేదు అని
నా అభిప్రాయం.
ఇప్పుడు పెద్ద

పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు
చాలా మంది తెలుగు వాళ్ళు(తెలుగు
మీడియం) కారా?

23 comments:

Praveen Mandangi said...

>>>>>
ఇప్పుడు పెద్ద
పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు
చాలా మంది తెలుగు వాళ్ళు(తెలుగు
మీడియం) కారా?
>>>>>
చచ్చు ప్రశ్నలంటే ఇవే. మన పేరెంట్స్ పుట్టినప్పుడు ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు ఎన్ని ఉండేవి? 1965కి ముందు మా జిల్లాలో ఒక్క ఇంగ్లిష్ మీడియం స్కూల్ కూడా లేదు. ఇప్పుడు కూడా పల్లెటూర్లలో చాలా వరకు తెలుగు మీడియం స్కూళ్ళే కదా ఉన్నాయి.

Praveen Mandangi said...

ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో చదివిన మా తమ్ముడికే గవర్నమెంట్ ఉద్యోగం దొరక్క ప్రైవేట్ ఉద్యోగంలో చేరాడు. తెలుగు మీడియంలో చదివితే ప్రైవేట్ ఉద్యోగం దొరకడం కూడా కష్టమే.

నాగప్రసాద్ said...

>>"ఇప్పుడు కూడా పల్లెటూర్లలో చాలా వరకు తెలుగు మీడియం స్కూళ్ళే కదా ఉన్నాయి.

@ప్రవీణ్ శర్మ గారు ఎక్కడున్నాయి. నాది పల్లెటూరే. మా ఊళ్ళో ఉండేది కూడా ప్రభుత్వ బడే. అందులో ఇప్పుడు CBSE పేరుతో ఇంగ్లీష్ మీడియం చేసేశారు. ప్రభుత్వ బడులనే ఇంగ్లీష్ మీడియం చేసేస్తే ఇక ప్రైవేటు బడుల సంగతేమిటి?

ఇప్పుడే ఇలా ఉంటే, రేప్పొద్దున నేను నా పిల్లలకు తెలుగు నేర్పించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి?.

Praveen Mandangi said...

శ్రీకాకుళం మండలంలో రాగోలు, భైరిసింగుపురం గ్రామాలలో మాత్రమే ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు ఉన్నాయి. అవి కూడా ప్రైవేట్ స్కూళ్ళు. మిగిలిన గ్రామాలలో ఉన్నవి తెలుగు మీడియం స్కూళ్ళే. శ్రీకాకుళం పట్టణానికి 50 కిలో మీటర్ల దూరంలో నవగాం గ్రామంలో ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఒకటి పెట్టారు, ప్రైవేట్ వాళ్ళు. ఆ స్కూల్ మూత పడి పశువుల శాలగా మారింది. నవగాంకి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న మా బంధువుల గ్రామం వండువలో నేను ఇంగ్లిష్ మీడియమ్ స్కూల్ పెట్టాలనే ఆలోచనలో ఉండేవాడిని. నవగాం ఇంగ్లిష్ మీడియం స్కూల్ మూత పడిన తరువాత నా ఆలోచన మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో అయినా ఇంగ్లిష్ మీడియం చదువులు అందిస్తే మంచిది.

నాగప్రసాద్ said...

మనోహర్ గారూ ! సమస్యల్లా అదే ! ఇది ఉద్యోగాల సమస్య కాదు, ఒక జాతిగా మన అవగాహనాలోపం. మనం భాషని వ్యక్తిగత విషయంగా ఎందుకు చూస్తామో నాకిప్పటికీ బోధపడదు. "తెలుగు అంటే మనమే" అని గ్రహించకుండా, అది తనంతట తాను పైకి రావాల్సిన వ్యక్తిలా మాట్లాడుతూ అది మనల్ని ఆదుకోవాలని లేకపోతే సేవ చెయ్యని రాజకీయనాయకుణ్ణి అవతల పారేసినట్లు దాన్ని అవతల పారెయ్యాలని ఎందుకాలోచిస్తామో కూడా నాకర్థం కాదు.

తెలుగు అనేది ఒక ఎనిమిదిన్నఱ కోట్ల మహాజాతికి సంబంధించిన విషయం. అలా దాన్ని వ్యక్తిగత విషయంగా చూస్తూ దాన్నుంచి పారిపోవడానికి వ్యక్తిగత స్థాయిలో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం మనమందఱం. దాని సమస్యల్ని పరిష్కరించకుండా, దాని పరిస్థితి మెఱుగుపఱకుండా డశాబ్దాల తరబడి నిర్లక్ష్యం చేస్తూ ఆ సమస్య మఱింత పెనుభూతమై కూర్చోవడానికి దోహదం చేస్తున్నాం. ఏ దేశంలోను భాష వ్యక్తిగత విషయం కాదు. ప్రతిజాతీ తన భాషలో తన అస్తిత్వం ఉన్నదని భావిస్తున్నది, మనం తప్ప ! ప్రతిజాతీ భాషని తమ వారసత్వానికీ రాజకీయ హక్కులకీ, చరిత్ర సంస్కృతులకి చిహ్నంగా ట్రేడ్ మార్క్ గా భావిస్తూ దానికి అవమానం జఱిగితే తోక తొక్కిన త్రాచులా లేస్తోంది. మనం మాత్రం తెలుగు విషయంలో వ్యక్తిగత పరిష్కారాలు వెతుక్కుంటున్నాం. ఆ క్రమంగా మన జాతిభాషని కాస్తా ఏ హక్కులూ, గౌరవాలూ లేని నోచుకోని ఇంటిభాషగా మార్చేశాం. మనం ఈ మహాజాతి యొక్క జాతీయభాషని ఒక కోయ, గోండ్, సవర, చెంచులాంటి లిపిలేని భాషలతో సమానం చేసేశాం.

మనమంతా తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు చదివినవాళ్ళకి ఉద్యోగాలు రావా ? ఎంతమంది తెలుగువాల్ళు అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన, సరిహద్దులు దాటివెళ్లక తప్పని, విదేశీయులతో సంబంధాలు పెట్టుకోకపోతే వల్లకాని, ఉద్యోగాలు చేస్తున్నారో నిజాయితీగా ఆలోచిద్దామా ? ఎంతమంది తెలుగువాళ్ళకి నిజంగా ఇంగ్లీషు లేకపోతే బతకలేని పరిస్థితి ఉంది ? ఆలోచిద్దామా ? అసలీ రాష్ట్రంలో 65 శాతం మంది వ్యవసాయదారులు. వాళ్లెవ్వఱికీ ఇంగ్లీషుతో పనిలేదు. చిన్నచిన్న టౌన్లలో బతికేవాళ్ళందఱి జీవితాలూ ఆ టౌన్లలోనే ముగిసిపోతాయి, వాళ్ళు కనీసం జిల్లా కేంద్రానికి వెళ్లే ఆలోచన కూడా చెయ్యరు. వాళ్ళకి ఇంగ్లీషుతో పనేముంది ? పెద్దటౌన్లలో (జిల్లా కేంద్రాల్లాంటి వాటిల్లో) కొంతమంది తమకి ఇంగ్లీషు చాలా అవసరం అనుకుంటున్నారు. నిజానికి వాళ్ళకీ ఇంగ్లీషుతో అవసరం ఉండదు, అనుకోవడమే తప్ప ! వాళ్ళు తమ జీవితంలో చాలాకాలం గడిచిపోయాక ఆ సంగతి తెలుసుకుంటారు. ఏతావతా హైదరాబాదులో ఉన్న కొంతమందికి తప్ప ఇంగ్లీషు ఈ రాష్ట్రంలో ఎవరికీ అవసరం లేదు - అవసరం గుఱించే దాన్ని నేర్చుకోవాలని, మాట్లాడాలని గట్టిగా పట్టుపట్టితే నా సమాధానం ఇది.

ఇక్కడ జనానికి ఇంగ్లీషు మాట్లాడ్డం రాకపోయినా, వారు ఆ భాషతో చాలా అసౌకర్యాన్ని అనుభూతి చెందుతున్నా, వారికి సుతరామూ ఇష్టం లేకపోయినా ఇక్కడ ఇంగ్లీషు జనం నెత్తిన బలవంతంగా రుద్దబడుతున్నది. మన అపార్టుమెంటుల్లో అందఱూ తెలుగువాళ్ళే ఉన్నా నోటిసులు మాత్రం ఇంగ్లీషులో రాసి అంటిస్తారెందుకంటారు ? రుద్దడం కాకపోతే ? అదే పరిస్థితి, అదే సమాధానం లేని నిరంకుశత్వం మన ఆఫీసులకీ, కాలేజీలకీ స్కూళ్ళకీ వర్తిస్తుంది. అన్ని దేశాలవారూ ఇంగ్లీషు లేకుండానే బతుకుతున్నారు. ఇక్కడ మాత్రం అది లేకపోతే బతకలేమని పైవాళ్ళు జనాన్ని బెదిరిస్తున్నారు. భయభ్రాంతుల్ని చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వాళ్ళ ంగ్లభాషావ్యామోహాన్ని, విదేశీవ్యామోహాన్నీ మనకందఱికీ అంటించాలని ప్రయత్నిస్తున్నారు. మన భాషాహక్కుల్ని హరించి మన భాషలో మనకేదీ లభ్యం కాని పరిస్థితిని కృత్రిమంగా సృష్టించి ఇంగ్లీషు నేర్చుకోక తప్పదని గుడ్లెఱ్ఱ జేస్తున్నారు.

నాగప్రసాద్ said...

పై దానికి కొనసాగింపు.

మన మీద ఇంగ్లీష్ రుద్దుతున్నది ఒబామా కాదు, గార్డన్ బ్రౌన్ కాదు, ఇంకో ఆస్ట్రేలియన్ కాదు, న్యూజీలాండ్ వాడు అసలే కాదు. మనమే మన మీద ఈ విదేశీభాషల్ని బలవంతంగా రుద్దుకుంటున్నాం. ఎవరికోసం ఈ పని చేస్తున్నాం ? ఒక్కసారైనా ప్రశ్నించుకుంటున్నామా ?

ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్ళేవాళ్ళ సంఖ్య ఎప్పుడూ ఏడాదికి ఇఱవైవేలు దాటలేదు. (ఇప్పుడు పదివేలే ఉందట) అలాంటివాళ్ళకోసం అలాంటివాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా ఎనిమిదిన్నఱ కోట్లమందీ ఇంగ్లిషుతో కుస్తీ పట్టాలనడం ఏం న్యాయం ? నిజానికి అఱవై శాతం మంది గల్ఫుకెళుతున్నారు. అక్కడ ఇంగ్లీషు లాభం లేదు. ఇంకో ఇఱవైశాతం మంది వలసదారులు ఇతర ఆసియా దేశాలకెళుతున్నారు. ఇంగ్లీషుదేశాలకి వలసపోతున్నది కేవలం పదిశాతం మంది వలసదారులే. ఆ కొద్దిమంది కోసం మనం కట్టూ, బొట్టూ, వేషం, భాషా, సంస్కృతీ, వారసత్వం అన్నీ దిబ్బలో కొట్టుకోవాలని డిమాండ్ చేయడం ఏం న్యాయం ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నుంచి ప్రతినెలా పదిలక్షల మంది జీతాలు తీసుకుంటారు.వాళ్ళు కాక వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా, కార్పొరేషన్ల ద్వారా పోషించబడేవారు ఇంకో పదిలక్షల మంది ఉంటారు. ఒక్కొక్కరిమీదా నలుగుఱైదుగురు ఆధారపడి జీవితారనుకుంటే ఈ రాష్ట్రంలో కోటిమంది ఏ పరాయి రాష్ట్రాలకీ, పరాయి దేశాలకీ పోకుండా ఈ ప్రభుత్వం మీదనే ఆధారపడి బతుకుతూ ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతున్నారు. కనీసం వాళ్ళకిచ్చే ఉద్యోగాలకైనా తెలుగు పరిజ్ఞానాన్ని అర్హతగా నిర్ణయిస్తే తెలుగు చదివినవాడికి ఉద్యోగం రాదనే పరిస్థితి ఉంటుందా ? చెప్పండి. మన చేతులారా మనమే చేసుకుంటున్నది కాదా ఇది ?

ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న అయ్యేయెస్ ల సంఖ్య అంతా కలిపి ఒక డెభ్భైమందికి మించదు, ఐపీయెస్ లంతా కలిపి ముప్ఫై అయిదు/ నలభై మందికంటే ఉండరు. వీళ్ళకోసం మనమంతా ఇంగ్లీషువాళ్ళమైపోవాలా ?

కనీసం తెలుగువాళ్ళు తమ సొంతడబ్బుతో తెలుగుగడ్డ మీద పెట్టే కంపెనీల్లో లేదా ఆఫీసుల్లో తెలుగెందుకు ఉండకూడదు ? అని మనల్ని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా ? తెలుగు తప్ప వేఱే భాష తెలియని బాసులు కూడా ఇంగ్లీషు చదివిన ఉద్యోగులు కావాలంటూంటే దాన్ని ఏ మీడియా అయినా, ఏ పత్రికయినా తప్పుపట్టిందా ?

ఇక తెలుగులో చదివినవాళ్ళకి ఉద్యోగాలు లేవంటే మఱి ఎలా ఉంటాయి ? మనం కావాలని చేస్తున్నదానికి ?

మీరు తెలుగు మాట్లాడ్డంలేదు. మీరే స్వయంగా తెలుగై యున్నారు.

--తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం.

పైన రాసిన రెండు వ్యాఖ్యలు తాడేపల్లి గారి అభిప్రాయాలు.

Praveen Mandangi said...

బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన పాకిస్తాన్, పాలెస్తీనా, సూడాన్, ఉగాండా లాంటి ఇతర దేశాలలో కూడా ఇంగ్లిష్ నేర్చుకునేవాళ్ళు ఎక్కువే. నాకు తెలిసి పాలెస్తీనాలోని గాజా ప్రాంతం నుంచి కూడా ఇతర దేశాలకి ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుతోంది. ఒక పాలెస్తీనా వ్యాపారి ఇండియా కంపెనీకి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనుకుందాం. అతనికి ఇంగ్లిష్ రావడం వల్లే కదా ఇండియా కంపెనీ వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాడు. చాలా కాలం క్రితం నేను చెన్నై వెళ్ళాను. అక్కడ చాలా మందికి హిందీ గానీ, ఇంగ్లిష్ గానీ రాదని తెలిసింది. ఒక టూరిస్ట్ కార్ ఆపరేటర్ మాకు టాటా సుమో అద్దెకి ఇచ్చాడు. సుమో డ్రైవర్ కి ఇంగ్లిష్ రాదు. అతనితో సంబాషణ కష్టమే అయినా అక్కడ ఇంగ్లిష్ వచ్చిన డ్రైవర్లు దొరకడం కూడా కష్టమే కనుక అతను డ్రైవర్ గా రావడానికి ఒప్పుకున్నాం. వేరే దేశానికే కాదు, వేరే రాష్ట్రానికి వెళ్ళినా ఇంగ్లిష్ రాకపోతే సమస్యే. నీకు తెలుగు బాష మాత్రమే వస్తే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ ఒరిస్సా, కర్నాటకలోని బెంగళూరు, బళ్ళారి ప్రాంతాలులో మాత్రమే సంచరించగలవు. వేరే ప్రాంతాలకి వెళ్తే ప్రోబ్లమే.

amma odi said...

మనోహర్ గారు,

మొదట మాతృ భాషే నేర్పాలి. మాతృభాషలో అయితేనే భావాన్ని గ్రహించటం, వ్యక్తీకరించటం కూడా సరిగ్గా అలవడుతుంది. ఆ తరువాత అవసరాన్ని బట్టి ఎన్ని భాషలయినా నేర్పవచ్చు, నేర్చుకోవచ్చు. కాబట్టి చిన్నారులకి తెలుగు నేర్పటం, కథలు చదివించటం మంచిపద్దతి. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయి. ఇది నా స్వానుభవం.

పెదరాయ్డు said...

ఇ౦గ్లీషు ఒక ఉపకరణమేగానీ, అదే మన జీవన విధానమైపొతున్నదనే బాధ.

మీకొక విషయ౦ తెలుసా? యూరపు లోని చాలా మ౦ది ప్రజలకు ఇ౦గ్లీషు రాదు. వాళ్ళెలా వ్యాపారాలు చేసుకు౦టున్నారు? అ౦తె౦దుకు, ప్రాచీన సి౦ధూ నాగరికతా కాల౦లోనే మన౦ గ్రీకు,లాటిన్ వాళ్ళతో వ్యాపారాలను సాగి౦చా౦...మనసు౦డాలే గానీ...

పెదరాయ్డు said...

అమ్మఒడి గారూ,

అదే కిటుకు, మన తరువాతి తర౦ వారి మాతృబాషను వారు మార్చేస్తున్నారు....

Praveen Mandangi said...

బాష రాకపోతే వ్యాపారం కష్టమే. తాడేపల్లిగూడెం సంతకి చత్తీస్ గఢ్ నుంచి కూడా చింత పండు వస్తుంది. శ్రీకాకుళం మార్కెట్ కి బళ్ళారి మార్కెట్ నుంచి కూడా ఉల్లిపాయలు వస్తాయి. దండకారణ్యం, బళ్ళారి ప్రాంతాలలో కూడా తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. హిందీ రాని ఆంధ్రా వ్యాపారికి డిల్లీకో, పంజాబ్ కో సరుకు ఎక్స్పోర్ట్ చెయ్యమంటే చెయ్యడం కష్టమే.

Anonymous said...

ఉత్తర్ ప్రదేశ్ లో పాలిటెక్నిక్ లో కూడా హిందీ మీడియం ఉంటుంది.

durgeswara said...

అవునండి మాస్కూల్ లో వినుకొండనుంచి వచ్చి పనిచెసే ఒక మాశ్టర్ గారు వినుకొండలోని నిర్మల కాన్వెంట్ లో చదివిస్తున్నాడట . తెలుగు మాట్లాడినందుకు ఐదురూపాయల ఫైన్ తెమ్మన్నారని ఏడుస్తుంటే పిల్లవాని కోసం డబ్బుపంపామండి అని నవ్వుతూ ఇందాక నాతో చెబుతుంటే కడుపుమండిపోయింది. ఏం సార్ ! మరీ వెన్నుముకలేకుండా బ్రతకాలా ? జాగ్రత్త రేపు మీనాన్నపేరు తెలుగులో వుంది కాబట్టి వాడు మీనాన్నకాదు అనికూడా నేర్పగలరు అని ,కోపగించుకున్నాను.

సూర్యుడు said...

చాలా బాగా చెప్పారు

చదువరి said...

"ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది తెలుగు వాళ్ళు(తెలుగు మీడియం) కారా?" - సరైన ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్న వేసుకోవాలంటే కొంతమందికి "భయం". తనకంటే బాగుపడిన వాడు వాడి తెలివితేటలతో పైకొచ్చాడని ఒప్పుకోడానికి ఈ రకానికి భయం. అందుకని వీళ్ళు, 'వాడు ఇంగ్లీషులో చదివాడు అందుకే పెద్ద ఉద్యోగం వచ్చింది. అంచేత తెలుగు నేర్పడం మానెయ్యాలి' అని అంటూంటారు.

అసలు ఉద్యోగం రావటానికి, జీవితంలో ఎదగడానికీ అవసరమైనది బుర్రలో సరుకు గానీ, ఇంగ్లీషు కాదని ఈ జనానికి తెలుసు. కానీ ఒప్పుకోవాలంటే "భయం". అందుకే అడ్డగోలు వాదనలు చేస్తూంటారు. ఈ అడ్డగోలు వాదాలు చేసేవాళ్ళను చూసి, ఆ వాదాన్ని బట్టీ పెట్టేసి, 'నాక్కూడా చాలా తెలుస'నుకునే తెలిసీ తెలియని రకాలు వాతలు పెట్టుకుంటూంటాయి.

ఇంగ్లీషు మీడియంలో చదివినా బుర్రలో సరుకే లేని సన్నాసులు పైకెదగలేరు. బుర్రలో సరుకున్నవాడు తెలుగు మీడియంలో చదివినా దూసుకుపోతాడు. ఇంగ్లీషు మీడియంలో చదివేవాళ్ళలో చాలామంది చినిగిపోయిన చొక్కా (బలవంతానా నేర్చుకోడం మానేసిన తెలుగు) ఒకటి వేసుకుని అది కనబడకుండా ఒ కోటును (బలవంతానా నేర్చుకోవాలని ప్రయత్నించినా సరిగ్గా నేర్చుకోలేని ఇంగ్లీషు) అద్దెకు తెచ్చుకుని తొడుక్కున్న బాపతు. ఆ కోటేమో వీళ్ళకు పెద్దదౌతుంది. అది తగిలించుకోని బపూన్ల లాగా కనబడుతూంటారు. పైగా మన వాతావరణానికి సరిపడక ఉక్క పోసేస్తుంది. పోనీ తీసి పారేద్దామా అంటే, లోపలున్న చొక్కాయేమో అతుకులబొంత. అటు తెలుగూ రాక, ఇటూ ఇంగ్లీషునూ యాడవలేక రెంటికి చెడ్డ రేవడై ఏడుస్తూంటారు.

చిన్నప్పటినుండీ ఇంగ్లీషులో చదివితే ఇంగ్లీషు రాకెక్కడికిపోతుంది అని కొందరు బొక్కలను వెతుకుతూంటారు. మన బడుల్లో ఇంగ్లీషు నేర్పే పంతుళ్ళకు సరైన ఇంగ్లీషు రాదు. వచ్చినవాళ్ళు ఏ పది శాతమో ఉంటారు. ఇప్పుడు మైదుకూరులో పిల్లల మెడలో తగిలించిన బోర్డులో ఏం రాసారో చూడండి.. ఆ రకం ముష్టి సన్నాసులు నేర్పే ఇంగ్లీషు అదుగో ఆ బోర్డులో ఉన్నట్టు ఏడుస్తుంది. ఈ సన్నాసులు తెలుగు నేర్చుకోనివ్వరంట!

Anonymous said...

వాస్తవానికి ఇదిప్పుడు మైదుకూరు రాష్ట్రమే.

--తాడేపల్లి

Praveen Mandangi said...

తుమ్మల శిరీష్ గారు. మీరు ఆంధ్రా బ్యాంక్ కి వెళ్ళినా, HDFC బ్యాంక్ కి వెళ్ళినా అక్కడ లెక్కలు ఇంగ్లిష్ లోనే వ్రాస్తారు. మీరు లాయర్ దగ్గరకి వెళ్ళినా, చార్టర్డ్ అకౌంటంట్ దగ్గరకి వెళ్ళినా వాళ్ళ ఆఫీసుల్లో ఇంగ్లిష్ లో వ్రాసిన పత్రాలే ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ వాడైనా, ప్రైవేట్ వాడైనా ఇంగ్లిష్ రాని వాడికి ఉద్యోగం ఇవ్వడు. డబ్బు ఉంటే ఉద్యోగం లేకపోయినా స్వయం ఉపాధి పెట్టుకోవచ్చు. కానీ ఆదాయపు పన్ను లెక్కలు వ్రాయడానికి ఇంగ్లిష్ రావాలి.

చదువరి said...

ప్రవీణ్ శర్మ: నేను ఇంగ్లీషు నేర్చుకోవద్దనడం లేదు. తెలుగు నేర్చుకుంటే ఇంగ్లీషు రాకుండా పోదంటున్నాను. మనోహరు గారు చెప్పిందీ అదే - తెలుగు మీడియమ్‌లో చదివినంత మాత్రాన పెద్ద ఉద్యోగాలు చెయ్యడం లేదా అని ఆయన అడిగారు. మీరు దాన్ని ఎద్దేవా చేసారు. "ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో చదివిన మా తమ్ముడికే గవర్నమెంట్ ఉద్యోగం దొరక్క.." అని మీరే అన్నారు. ఏ మీడియమ్‌లో చదివామనేదానికీ తెలివితేటలకీ సంబంధం లేదని తెలుస్తూనే ఉంది.

అన్నిటికీ ఇంగ్లీషు కావాలి. కానీ అంత మాత్రాన తెలుగును పక్కన పడేసి, ఇంగ్లీషులో చదవనక్కర్లా. మీకో సంగతి తెలుసా - మహారాష్ట్రలోను, కర్ణాటకలోను చదువు వాళ్ళ వాళ్ళ మాతృభాషలోనే చదివి తీరాలి. మరి, ఆయా రాష్ట్రాల్లోను బ్యాంకులున్నాయి, లాయర్లున్నారు. వాళ్ళూ ఆదాయప్పన్ను కడతారు.

ఇంకోసంగతి చెబుతాను.. దక్షిణాది రాష్ట్రాల్లో ఇంగ్లీషో ఇంగ్లీషో అని వెర్రి తలలు వేస్తున్న తెలివితక్కువతనం మనదే. మిగతావాళ్ళు సుబ్బరంగా వాళ్ళవాళ్ళ భాషల్లోనే చదూతారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒకప్పటి లెక్కల ప్రకారం (మానవాభివృద్ధి లెక్కలనుకుంటా, నాకు గుర్తు లేదు) విద్యాభివృద్ధి దక్షిణాదిలో అన్నిటికంటే మన రాష్ట్రంలోనే హీనం.

కాబట్టి, ఇంగ్లీషులో చదివాలనేవాళ్ళు ప్రగతివాదులు, తెలుగులో చదవాలనేవాళ్ళు తిరోగామి/రివిజనిస్టు/నయారివిజనిస్టు -ఇలాంటి పేర్లేవో పెట్టెయ్యక్కర్లేదు. కాస్త సొంత తెలివితేటల్తో ఆలోచిస్తే చాలు.

Praveen Mandangi said...

నేనేమీ ఇంగ్లిష్ మీడియం చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు అనలేదు. విశాఖపట్నంలో క్రిస్టియన్ స్కూల్ లో చదువుకున్న ఒక అమ్మాయిని పల్లెటూరి నుంచి వచ్చిన ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేశారు. ఆమె భర్త ఆమె కంటే బాగా ఇంగ్లిష్ మాట్లాడుతాడు. పట్టణాలలోని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళలో ఇంగ్లిష్ మాట్లాడమంటారు కానీ దగ్గర ఉండి నేర్పించరు. అందుకే స్టూడెంట్స్ ఇంగ్లిష్ సరిగా రాక తెలుగులో మాట్లాడడం, ఫైన్లు కట్టడం జరుగుతోంది. కడప స్కూల్ లో ఫైన్లు వసూలు చెయ్యకుండా పలకలు తగిలించారు. పలకలు తగిలించడం మాత్రమే న్యూసా? ఫైన్లు వసూలు చెయ్యడం మాత్రం న్యూస్ అవ్వకూడదా?

కెక్యూబ్ వర్మ said...

మీరు రాసిన విషయం చాలా ఆలోచనాత్మకంగా వుంది. అలాగే నాగ ప్రసాద్ గారి వ్యాఖ్యానం కూడా. యూరోపియన్ దేశాలలో వారి మాతృభాషలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే చైనా, జపాన్ వారుకూడా. ఇంగ్లీషును భాషామాద్యమంగా నేర్చుకొనడానికి ఎవరమూ వ్యతిరేకంకాదు. దానిని అంతకు మించి చేస్తున్నాం కనుకనే ఈ భయాందోళన. దీనిపై ఒక సమగ్ర కార్యాచరణ చిత్తశుద్ధితో జరగాలి. తల్లిదండ్రుల మానసిక స్థితిలో మార్పు రావాలి. అప్పుడే తెలుగును బ్రతికించుకోగలం.
http://sahacharudu.blogspot.com/ ఇందులో నా గోడుకూడా వినండి.

Praveen Mandangi said...

కబుర్లు చెపుతూ కాలం గడిపేవాళ్ళని కూడా తప్పు పట్టాలి. తెలుగు బాషాభిమానం అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళలో ఎంత మందికి తమ పిల్లలని దుంపల బడులు (తెలుగు మాధ్యమ పాఠశాలలు)కి పంపే ధైర్యం ఉందో చెప్పండి.

Praveen Mandangi said...

ఈ కథ చదవండి: http://blogzine.sahityaavalokanam.gen.in/2009/11/blog-post.html నాకు తెలిసిన గవర్నమెంట్ ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది పట్టణాలలో ఇళ్ళు తీసుకుని తమ పిల్లలని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకి పంపుతుంటారు.

Dr.R.P.Sharma said...

మనోహర్ చెనికెల గారికి,
నేను ఈ రోజే మీ బ్లాగ్ చూడడం జరిగింది.నాకు కాస్త ఈ బ్లాగోగుల పరిజ్ఞానము తక్కువే.అందుకే మమ్మల్ని అభిమానించే మీ బ్లాగ్‌‌ను ఇన్ని రోజులు చూడకుండడం నా పొరపాటే.
ఇక నాకు మీ బ్లాగ్‌‌లో తెలుగుమీది అభిమానం,మన సంస్కృతి పట్ల అభిమానం చాలా నచ్చింది.
మీరు రాసే రాతలను చదివే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది.