మొన్ననే సిరీస్ ఐపోయింది కదా ఇంక ముసుగేసుకుని పడుకుందాం అనుకుని , ఎందుకన్నా మంచిదని క్రికెట్ కేలండర్ చూస్తే, చూస్తే ఏముంది? మనోహర్ మళ్లి బిజీ అని అర్ధం ఐపోయింది. సరే ఇక మన టైం వచ్చిందని మళ్లి గుర్తు chEsukunnA .
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి యాభై ఓవర్ల మాచ్ లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. యువరాజ్ సింగ్ ౧౩౮ పరుగులతో అజేయంగా నిలిచాడు. పీటర్సన్ తో పాటు ఇంకొకరెవరో పోరాడారు కాని లాభం లేకపోయింది. స్వింగ్ అవుతుందని ఉహించడం వల్లనేమో పీటర్సన్ టాస్ గెలిచి భారత్ ను బాటింగ్ కు ఆహ్వానించాడు. అందుకు భారీ ముల్యాన్నే చెల్లించుకోవలసి వచ్చింది.
గమనిక:ఈ విషయాలలో ఏమైనా తప్పు ఉండి ఉంటే , అది నేను మాచ్ చూడకపోవడం వల్ల జరిగిందని అర్ధం చేసుకోవాలని మనవి. ఏదో కూడలి లో ఇంకా ఎవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు కదా, మనం రాసేసి మార్కులు , ఓ పది హిత్సు కొట్టేద్దామని ప్లాన్ ....
Friday, November 14, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment