Friday, October 24, 2008

తెలుగు వాళ్లకు కూడా దీవాళీ యేనా?

1౯౯౫:
అనగనగా ఒక పండుగ . ఆ రోజు కృష్ణుడు సత్యభామ తో కలిసి నరకాసురుడిని వధించారు అందుకని అంతా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. అందుకని ఆ పండుగని దీపావళి అంటారు.
తెలుగు లో దీపం అనే పదం ఉంది. ఆవళి అనే పదం ఉంది. అందుకే దీపావళి అనే పదం పుట్టింది.
రెండేళ్ళ తర్వాత :
దీవాళీ అనే పండుగ ఉత్తర భారతదేశం లో ఎక్కువగా జరుపుకుంటారు. రాఖి పండుగ వలెనే ఈ పండుగ కూడా ఉత్తరాది నుండి దక్షిణాది కి వచ్చింది. ఆ రోజు అంధ్రప్రదేశ్ లో కూడా దీవాళీ ని భక్తి శ్రద్దల తో జరుపుకుంటారు.
రాష్ట్రమంతా "దీవాళీ ధమాకా " లు రాజ్యమేలుతాయి.
-------------------------------------------------------------------------------------------------
మనం వాడే పదాలని బట్టే ఒక భాష మనుగడ ఆధార పడి ఉంటుంది అని నమ్మే వాళ్ళకి నేను ఏంచెప్పబోతున్నానో అర్ధం అయ్యే ఉంటుంది. "ఆ! దీపావళి ని దీవాళీ అన్నంత మాత్రాన కొంపలు ముంచుకుపోతాయా అనే వాళ్ళకి , ఈ బ్లాగ్ కి సంబంధం లేదు. వాళ్లు హాయిగా వేరే బ్లాగ్లు చదువుకోవచ్చు. కాకపోతే అంటే ఏమొచ్చింది అనేవాళ్ళు అనాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని ఆలోచించుకుంటే చాలు.
-------------------------------------------------------------------------------------------------
"Happy DIWALI"
"DIWALI Wishes for you and your family"
"Let this DIWALI bring light to your life,many wishes" ....
ఇది వరస,
పండుగలని కూడా పర భాష లోనే ......
ఇప్పుడు నాకు తెలిసిన పిల్లలంతా దీవాళీ అనే అంటున్నారు. ఈ సంవత్సరం దీపావళి అనే మాట అసలు విన్నట్టు గుర్తే లేదు.

దీపావళి అనే మాట మన మన రాతలో గాని, మాటలో గాని మిగలనప్పుడు మన హృదయాలలో , మన తర్వాతి తరాల హృదయాలలో ఎలా మిగులుతుంది. జీ తెలుగు లో దీపావళి ప్రత్యేక ప్రసారాల కోసం వేసే ప్రకటనలో "దీవాళీ ధమాకా"
అని ఉంటుంది చూడండి కావాలంటే . మనకు మనమే గొయ్యి తీసి తెలుగు ని పరభాషామట్టి తో పూడ్చి వేస్తున్నంత కాలం తెలుగు ఇలాగే ఉంటుంది.

తెలుగుని వాడుతున్నంత కాలమే తెలుగు బతికి ఉంటుంది. ఇది నిజం.

11 comments:

Anil Dasari said...

బాగా చెప్పారు. దీపావళిని పట్టుకుని 'దివాలీ' అంటే తెలుగోళ్లకే కాదు, మిగతా భారతీయులకీ క్లాస్ పీకేస్తుంటా నేను.

అసలు 'దివాలీ' ఏంటండీ? 'దివాలా తీయించేది' అనా? టపాసులు వగైరాలకోసం జేబులు ఖాళీ చేసి దివాలా తీయిస్తుందని ఆ పేరెట్టినట్లున్నారు, చూడబోతే.

Rajendra Devarapalli said...

ఒక్క దివాలీ ఏం ఖర్మ,మనకో లాడూ ఉంది(లడ్డు)యుగాడీ (ఉగాది కొచ్చిన తిప్పలు)పత్రికలు,టీవీలనిండా ఫెస్టివల్ ఆఫర్లే పండగలెటు పొయాయో???

ఉమాశంకర్ said...

కడుపుచించుకుంటే కాళ్ళ మీద పడుద్దని...ఒకటా రెండా

"గోదావరి ఎక్స్ ప్రెస్" "గొడేవరి ఎక్స్ ప్రెస్" అవుతుంది.

సాంబ్రాణి కడ్డీ లంటే ఈమధ్య నామోషీ లాగుంది "ధూప్ స్టిక్కులట".

పక్క రాష్త్రం వాళ్ళు కాదు , మన తెలుగువాళ్ళే ఇలా మాట్లాడుతారు.

బాధ పడాల్సిన విషయమైనా మీ సెటైరు బాగుంది "గొయ్యి తీసి తెలుగు ని పరభాషామట్టి తో పూడ్చి " వేయటం.

Anonymous said...

మీకు అడ్వాన్సుగా హప్పీ దీవాళి! ఎన్సాయ్!!

Rajendra Devarapalli said...

@ నెటిజన్ :)

సుజాత వేల్పూరి said...

రాజేంద్ర కుమార్ గారు,
బాగా చెప్పారు. యధా శక్తి మన న్యూస్ చానెళ్ళ వాళ్ళు భలే హెల్ప్ చేస్తారు ఇటువంటి భాషాభివృద్ధికి.

Sujata M said...

Wish you happy Diwali. (oops.. Dipavali)

Sujata M said...

kshaminchandi.. lekhini pani cheyaladeu. anduke aangleanu. tittukokandi pandugapoota.

MURALI said...

దీపావళి శుభాకాంక్షలు.

Valluri Sudhakar said...

ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. ఇక పరభాషా వ్యామోహం గురించి ఎంతచెప్పినా చర్వితచరణమే. దీపావళి, దివాళి అవటం తెలుగువాడి వెదవయాత్వనికి నిదర్శనమే.

మనోహర్ చెనికల said...

thanks for ur comments