Friday, October 31, 2008

తిరిగిన స్పిన్ - తిప్పిన మిశ్రా

మొత్తానికి కోట్లాతిరగడం మొదలు పెట్టినట్లుంది. ౧౫౧ (151) వద్ద ఆస్ట్రేలియా తన మొదటి వికెట్ కోల్పోయింది . అమిత్ మిశ్రా ఒక అద్భుతమైన డెలివరి తో సైమండ్ కటిచ్ ను ఔట్ చేసాడు. ఇక పై ఏంజరుగుతుందో? ఒక వైపు హెడెన్ చెలరేగి ఆడుతున్నాడు.
allt the best team india.....

ఉక్కు మనిషి


సర్దార్ వల్లభభాయ్ పటేల్, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాన్ని ఏకం చేయడంలో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి. ఈ రోజు ఆ మహానుభావుడి జన్మ దినం సందర్భంగా ఆయన గురించి కొన్ని నాకు తెలిసిన విషయాలు.

Date of birth: October 31, 1875(1875-10-31)
Place of birth: Nadiad, Gujarat, British India
Date of death: December 15, 1950 (aged 75)
Place of death: Mumbai, Maharashtra, India
Movement: Indian Independence Movement
Major organizations: Indian National Congress
Notable prizes: Bharat Ratna (1991, posthumous)
Major monuments: Sardar Patel National Memorial
Religion: Hindu
Influences: Mahatma Gandhi
వల్లభభాయ్ పటేల్ గురించి వికిపిడియా వారు అందించే సమాచారం కోసం ఈ కింది లంకెను చూడండి.

http://en.wikipedia.org/wiki/Vallabhbhai_Patel

Thursday, October 30, 2008

గౌహతి లో ౪ చోట్ల బాంబు పేలుళ్లు

గౌహతి లో నాలుగు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి, వివరాలు ఇంకా తెలియదు. will update as soon as

Wednesday, October 29, 2008

వేయి పడగల నీడలో నేను. -1

విజయవాడ లో సత్యనారాయణ పురంలో ఒక గ్రంధాలయం ఉండేది రైల్వే స్టేషన్ దగ్గర (ఇప్పుడు లేదు లెండి. లేనిది రైల్వే స్టేషన్ , గ్రంధాలయం కాదు ). అక్కడ చాలా పుస్తకాలు చదివాను. వాటిలో నా దశ తిరిగి ఒక రోజు చలం గారి "మ్యూజింగ్స్" చదవడం తటస్తించింది. తరువాత నేను అనంతపూర్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి మామూలు పుస్తకాలు చదవలేదు. ఏది చదివినా ఆ పుస్తకంతో పోల్చేవాడిని. తక్కువే అనిపించేది. ఇక ఇలా లాభం లేదని విశ్వనాధ గారిని తగులుకొందాం అనుకొన్నా. అదృష్టం కలిసొచ్చి అనంతపూర్ లో బుక్ ఎగ్జిబిషన్ లో "వేయి పడగలు" దొరికింది. వినడం ఐతే చాలా విన్నాం ఆ పుస్తకం గురించి , కాని ఎలా వుంటుందో తెలియదు. తీరా కొన్నాక చదవలేదంటే(అసలు భయం చదవలేమేమో అని) అవమానం. కొందామంటే ౪౦౦ (400). సరే ఏదైతే అదే అవుతుందని కొన్నాను. కాలేజ్ లేదు, కాంటిన్ లేదు, చదువు లేదు, సంధ్య లేదు, పగలు లేదు, రాత్రి లేదు, ఉదయం లేదు, సాయంత్రం లేదు, నాలుగు రోజుల తర్వాత యజ్ఞం పూర్తి అయ్యింది.
అప్పటి దాకా ఒక అలౌకిక లోకంలో తిరిగిన నన్ను అక్కడి వాళ్ళు తరిమేసారా అనిపించింది. వేణుగోపాల స్వామి కల్యాణం జరిగి సంవత్సరం ఆయినా కాలేదు, అప్పుడే నన్ను పంపించేసారే అనిపించింది. ఇక్కడే గుండేటిలో పడి చావనయినా చస్తాను కాని నేను వెళ్ళాను అని అరవాలనిపించింది. కాని ఊరిలోఎవరు లేరు, అందరు ధర్మారావు గారి పెళ్ళికి బెజవాడ వెళ్ళారు.
అలా వదలలేక , వదిలి వెళ్ళలేక, అశ్రు నయనాలతో సుబ్బన్న పేట ని వదిలి అనంతపూర్ JNTU హాస్టల్ లో వాలాను.

(ఇంకా ఉంది. )

కొసమెరుపు :

"మ్యూజింగ్స్" నేను రండు చాప్టర్ లే చదవడం జరిగింది. ఎందుకంటే అది మనది కాదు. రెండవ రోజు కి లైబ్రరి లో మరి దొరకలేదు. అందుకే వేయి పడగలు కొనుక్కున్నధైనా ఏక బిగిన చదివేసాను.

Friday, October 24, 2008

తెలుగు వాళ్లకు కూడా దీవాళీ యేనా?

1౯౯౫:
అనగనగా ఒక పండుగ . ఆ రోజు కృష్ణుడు సత్యభామ తో కలిసి నరకాసురుడిని వధించారు అందుకని అంతా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. అందుకని ఆ పండుగని దీపావళి అంటారు.
తెలుగు లో దీపం అనే పదం ఉంది. ఆవళి అనే పదం ఉంది. అందుకే దీపావళి అనే పదం పుట్టింది.
రెండేళ్ళ తర్వాత :
దీవాళీ అనే పండుగ ఉత్తర భారతదేశం లో ఎక్కువగా జరుపుకుంటారు. రాఖి పండుగ వలెనే ఈ పండుగ కూడా ఉత్తరాది నుండి దక్షిణాది కి వచ్చింది. ఆ రోజు అంధ్రప్రదేశ్ లో కూడా దీవాళీ ని భక్తి శ్రద్దల తో జరుపుకుంటారు.
రాష్ట్రమంతా "దీవాళీ ధమాకా " లు రాజ్యమేలుతాయి.
-------------------------------------------------------------------------------------------------
మనం వాడే పదాలని బట్టే ఒక భాష మనుగడ ఆధార పడి ఉంటుంది అని నమ్మే వాళ్ళకి నేను ఏంచెప్పబోతున్నానో అర్ధం అయ్యే ఉంటుంది. "ఆ! దీపావళి ని దీవాళీ అన్నంత మాత్రాన కొంపలు ముంచుకుపోతాయా అనే వాళ్ళకి , ఈ బ్లాగ్ కి సంబంధం లేదు. వాళ్లు హాయిగా వేరే బ్లాగ్లు చదువుకోవచ్చు. కాకపోతే అంటే ఏమొచ్చింది అనేవాళ్ళు అనాల్సిన అవసరం ఎందుకొచ్చింది అని ఆలోచించుకుంటే చాలు.
-------------------------------------------------------------------------------------------------
"Happy DIWALI"
"DIWALI Wishes for you and your family"
"Let this DIWALI bring light to your life,many wishes" ....
ఇది వరస,
పండుగలని కూడా పర భాష లోనే ......
ఇప్పుడు నాకు తెలిసిన పిల్లలంతా దీవాళీ అనే అంటున్నారు. ఈ సంవత్సరం దీపావళి అనే మాట అసలు విన్నట్టు గుర్తే లేదు.

దీపావళి అనే మాట మన మన రాతలో గాని, మాటలో గాని మిగలనప్పుడు మన హృదయాలలో , మన తర్వాతి తరాల హృదయాలలో ఎలా మిగులుతుంది. జీ తెలుగు లో దీపావళి ప్రత్యేక ప్రసారాల కోసం వేసే ప్రకటనలో "దీవాళీ ధమాకా"
అని ఉంటుంది చూడండి కావాలంటే . మనకు మనమే గొయ్యి తీసి తెలుగు ని పరభాషామట్టి తో పూడ్చి వేస్తున్నంత కాలం తెలుగు ఇలాగే ఉంటుంది.

తెలుగుని వాడుతున్నంత కాలమే తెలుగు బతికి ఉంటుంది. ఇది నిజం.

టెండుల్కర్-గిల్ క్రిస్ట్ -జయసూర్య

నిన్న మొన్ననే IPL (DC Vs MUMBAI) లో చుసిన ఈ బానర్ ఇంకా స్మృతి పధంలో నుండి చెరిగిపోలేదు. ప్రపంచ క్రికెట్ లో ఆటగాడిగా కంటే వ్యక్తి గా అందరికంటే ఎక్కువగా నేను (నా లాంటి వాళ్లు చాలామంది )గౌరవమిచ్చే గిల్ క్రిస్ట్ నుండి ఈ తరహా వ్యాఖ్యలను నేను అసలు జీర్నిచుకోలేక ఈ టపా రాస్తున్నాను.
గిల్ క్రిస్ట్ తన ఆత్మ కధ, "True colours" లో సిడ్ని (౨౦౦౮) లో టెండుల్కర్ నిబద్ధతని ప్రశ్నించాడు.
హర్భజన్ మాట్లాడినప్పుడు టెండుల్కర్ అవతలి ఎండ్ లో ఉన్నాడని, అసలు భజ్జీ ఏమన్నాడో సచిన్ కి తెలిసే అవకాశమే లేదని సచిన్ ఇచ్చిన వాంగ్మూలం అంతా ఒక "జోక్" అని కొట్టి పారేసాడు.
ఇంకా సచిన్ ఓడిపోవడాన్ని ఇష్ట పడడని, సిడ్ని టెస్ట్ లో మ్యాచ్ అనంతరం "shake hand " కూడా ఇవ్వలేదని గిల్లి ప్రస్తావించాడు.
గిల్ క్రిస్ట్ మాటల్లో :
"The next thing I saw, Symo … said to Harbhajan something like, 'Don't touch him, you've got no friends out here."'

Gilchrist said he next heard Matthew Hayden tell Harbhajan, "You've got a witness now," before overhearing the spinner telling skipper Ricky Ponting, "Sorry, I apologise, it won't happen again."
"The look on Harbhajan's face was very telling," Gilchrist said. "He looked like he was thinking, 'Oh shit. What have I done here? They're all over me."'

ఇదంతా తన బుక్ పబ్లిసిటి కోసమా లేక దీనిలో ఏమైనా నిజం ఉండి ఉంటుందా ? ఏమో గిల్లి కి సచిన్ కి మాత్రమే తెలియాలి. లేక ఆస్ట్రేలియా మాటల యుద్ధం లో ఇప్పుడు గిల్ క్రిస్ట్ పాలుపంచుకుని తన వంతు సహాయం చేద్దాం అనుకుంటున్నాడా?
రిఫరెన్స్ కోసం కింది ఆస్ట్రేలియన్ వార్తా పత్రిక ని చూడండి.
sydney morning herald:
http://www.smh.com.au/news/sport/cricket/tendulkar-is-a-bad-sport-gilly/2008/10/23/1224351448791.html

comments by the world about gilli's comments on tha same site. and the one at october 24,2008 3:40 pm is highlight.. by "jacob effect"
http://blogs.smh.com.au/sport/archives/2008/10/gillys_outburst.html?page=fullpage#comments

Tuesday, October 21, 2008

ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం

౧౯౫ (195)
PM Siddle not ఔట్
క్లార్క్ కి మద్దతు ని ఇచ్చిన బ్రాడ్ హాడిన్ ని జహీర్ ఖాన్ ఔట్ చెయ్యడంతో మొదలైన ఈరోజు ఆట అంతటితో ఆగలేదు.
మరుసటి ఓవర్ లో మరో రెండు వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియాని కోలుకోలేని దెబ్బ తీశాడు. తరువాతి లంచనాలని అమిత్ మిశ్రా పూర్తి చేశాడు
ఒంటరి పోరాటం జరుపుతున్న మైకేల్ క్లార్క్ ని అమిత్ మిశ్రా ఔట్ చెయ్యడంతో భారత్ ని విజయం వరించింది.ఈ విజయంతో టెస్ట్ సారధ్యాన్ని కూడా ధోనికి అప్పగించాలనే వారి సంఖ్య పెరుగుతుంది అనడంలో సందేహం లేదు అని నా అభిప్రాయం ఏమంటారు?

మీరైతే మాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికిస్తారు.
జహీర్ కా?
అమిత్ కా?
గంభీర్ కా?
సెహ్వాగ్ కా ?

Monday, October 20, 2008

ఆస్ట్రేలియా నడ్డి విరిచిన టర్బోనేటర్

102/5
--------------------
హర్భజన్ -౩ వికెట్స్
ఇషాంత్ శర్మ -౨ వికెట్స్.(2)
మొత్తంగా ఆస్ట్రేలియా ని ఇవ్వాలే చాప చుట్టేస్తారా మన బౌలర్స్ , ఇంకొక ముప్పావు గంట ఆగితే తెలుస్తుంది ....
lets wait and see........................

పటిష్ట స్థితిలో భారత్

197/1 ఈ స్కోర్ చూసి ఎ దేశందో అనుకుంటారేమో , కాదు మనదే .
ఆస్ట్రేలియా తో జరుగుతున్న రెండవ టెస్ట్ లో భారత ఓపెనర్లు చెలరేగి ఆడి 180 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు.
ఇక మన బౌలర్స్ ఎంతవరకు తమ భాద్యత నిర్వహిస్తారో చూడాలి.

Thursday, October 16, 2008

ప్రత్యేక హైదరాబాద్ వస్తుందా?

ప్రత్యేక తెలంగాణా పై దానం నాగేందర్ స్పందన : ఈనాడు నుండి