Tuesday, October 9, 2007

కర్ణ- గురి తప్పిన(తప్పని) శరమా? లేక గురి లేని శరమా

ఎప్పుడు భారతం గురించినా మాట్లాడినా నేను ముఖ్యంగా ఇద్దరి గురించి మాట్లాడుతాను. ఒకరు ధుర్యోధనుడు మరొకరు కర్ణుడు. ఇంకా చెప్పాలంటే కర్ణుడంటేనే నాకు చాలా ఇష్టం. స్నేహానికి ప్రాణమిచ్చేవాడు,చేతికి ఎముక లేని దాత, గురి తప్పని శరసంధాత, అభయ ప్రదాత అని. కానీ ఈ మధ్య ఎప్పుడో "దానవీరశూరకర్ణ" చూస్తుంటే చాలా సందేహాలు వచ్చాయి. ఎవరిని అడగాలో తెలియక బ్లాగ్లోక సహాయాన్నర్ధిస్తున్నాను.

కర్ణుడు నిజంగా స్నేహానికి న్యాయం చేసాడా? తెలిసి తెలిసి కుంతికి పుత్రభిక్ష ఎలా ఇచ్చాడు. కర్ణుడు తన కోసం యుధ్దం చేస్తే వైరి వర్గంలోని వారిని చంపడం , వదలడం తన ఇష్టం, కానీ తన రాజు కోసం చేస్తూ శత్రువర్గంలోని నలుగురు ప్రదాన వీరులను వదిలేస్తానని మాట ఇవ్వడం ఏ విధంగా న్యాయం? అదీ సైన్యాధిపతి స్ధానంలో ఉండి.దేవదేవుడైన వాసుదేవుడికే స్నేహధర్మాన్ని వివరించిన వాడు, తల్లి ప్రేమకు లొంగిపోయాడా?

నిజంగా కర్ణుడు స్నేహానికి న్యాయం చేసాడా? వివరించగలరు.