Friday, December 28, 2012

చందమామ రావే - ఇంకా ఎవరైనా పాడుతున్నారా?

ఈ రోజు పౌర్ణమి.ఎందుకో ఈ మధ్య పౌర్ణమి అంటే కొంచెం దిగులుగా ఉంటుంది. "చంద్రమా మనసో జాతః" అని ఎందుకన్నారో కానీ, రేపటినుండి ఆకాశంలో చంద్రుడు ఆలస్యంగా వస్తాడని బాధ. నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేసరికి అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చే నా కూతురుకి ఇప్పుడు ఏ చందమామని చూపించి "చందమామ రావే" అని పాటపాడాలి? ప్రతిరోజూ ఒకే టైమ్ కి చందమామ ని పరిశీలిస్తూ ఉంటాము నేను, మైథిలీ. విదియ రోజు ఏడింటికి పడమర దిక్కున చివరి మెట్టు మీద ఉన్నట్టు కనపడే ఆయన రోజులు గడిచే కొద్దీ నడినెత్తి మీదికి వస్తాడు, పౌర్ణమికి తూర్పుకి తిరుగుతాడు. అప్పుడు పైన స్లాబ్ అడ్డు వస్తుంది కదా, అప్పుడు మైథిలి చందమామని వెతకడానికి పడే పాట్లు చూడాలి. అటు తిరిగి,ఇటు తిరిగి, ఆ చివరికి పోయి, ఈ చివరికి పోయి, మెట్లు ఎక్కి, దిగి, చివరికి మెట్లు పైదాక ఎక్కి చూస్తే కనపడతాడు. అప్పుడు ఆ పసిపిల్ల ముఖంలో కనపడే ఆనందం ఎంత హాయిగా ఉంటుందో. నిండా పదహారు నెలలు లేవు, ఏమర్ధమవుతుందో, ఏమనిపిస్తుందో మరి చందమామని చూస్తే. మనవరకు ఎందుకు సుందరకాండలో ఆ స్వామికే ఉత్తేజాన్నిచ్చి, సాచిర్యం చేసాడాయన. 



చెయ్యెత్తి చందమామని పిలిచినా, చేతిలో ఏమన్నా ఉంటే చందమామకి పెట్టమంటే చెయ్యి సాగదీసినా , దా దా అని చందమామని పిలిచినా, చందమామకి టాటా చెప్పమంటే చెయ్యి పదహారు వంకలు తిప్పి టాటా చెప్పినా పసిపిల్లలకే చెల్లు. అందుకేనేమో మతంతో సంబంధం లేకుండా పిల్లల్ని దేవుడితో  పోల్చారు పెద్దలు. సనక సనందాదులు, ప్రహ్లాదుడు ఐదేళ్ళవారు. మీరు పసిపిల్లలలాగునైతేనే దేవునిరాజ్యంలోకి ప్రవేశించగలరు అన్నది బైబిల్. ఒక్కసారి బయటికి వచ్చి మీ కుటుంబంతో సాయంత్రం పూట డాబా మీద కూర్చుని పున్నమి చంద్రుని వెన్నెలలని అనుభవించండి. వేలరూపాయలు తగలేసి వెలిగించే డిస్కో లైట్లు వాటిముందు దిగదుడుపే.

ఎప్పుడైనా సాయంత్రం పూట రోడ్డుమీద నడుస్తూ ఉంటే తల పైకెత్తి చందమామని చూస్తూనో, లేకుంటే వెతుకుతూనో ఉంటుంది. ఉంటే మొహం వెలిగిపోతుంది. లేకుంటే చిన్నగా అయిపోతుంది. అలా తల పైకెత్తి చందమామని వెతుకుతుంటే  సుందరకాండలో స్వామి సముద్రాన్ని దాటడానికి గరుత్మంతుడిని తలచుకుని తల పైకెత్తి నిలుచున్న సన్నివేశం గుర్తు వస్తుంది.

అందుకే పౌర్ణమి అంటే నాకు దిగులు. రేపటినుండి చందమామ కనపడక మొత్తం వెతికొచ్చి చేతులు తిప్పుతూ "పొయ్,పొయ్" అని చెప్తుంది? (తన బాషలో పోయింది  అని). ఏం చెయ్యాలి?

Saturday, September 15, 2012

మరువబోకు మానవుడా మమత వీడరా

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
రామాయణంలో చాలాసార్లు, వాల్మీకి మహర్షులు జంతువులతో పోలిక చెప్పారు.సింహ మధ్య అనీ, శార్దూల విక్రముడనీ ఇలా. కొన్ని విచిత్రమైన పోలికలు ఈ రోజు.
సుందరకాండలో స్వామి లంకాప్రవేశం చేసేముందు తన శరీరప్రమాణాన్ని చాలా తగ్గించారు. ఎంత అంటే పిల్లిపిల్ల అంతగా తగ్గించారు. ఇంతవరకూ చెప్పి ఊరుకోలేదు మహర్షి. "భభూవాద్భుత దర్శనః" అని విడిచిపెట్టారు. దర్శన సామర్ధ్యం చాలాబాగా ఉన్న పిల్లి ప్రమాణానికి తన శరీరాన్ని తగ్గించారు అని చెప్పి మెలిక పెట్టారు. ఇంతేనా ఈ మాటకర్ధం? కాదన్నారు పెద్దలు. గురువుగారు చాలాసార్లు చెప్తూ ఉండేవారు, రామాయణాన్ని రకరకాల కోణాల్లోనుండి అర్ధం చేసుకోవచ్చు అని. అప్పలాచార్య స్వామి వారు కూడా రామాయణాన్ని కావ్యంగా, కధగా, తత్వశాస్త్రంగా మూడురకాలుగా చూడవచ్చు, చూడాలి అని చెప్పేవారు.
 అలా చూస్తే, అప్పుడు అద్భుతం అనేమాట కీలకమౌతుంది. అధ్బుతం అనేమాటకి  భగవంతుడు అని అర్ధం ఉన్నదని శ్రీభాష్యం వారు ఒకసారి చెప్పారు. అలాంటి అధ్బుతమైన దాన్ని దర్శించడానికి వెళ్తున్నాడు అని చెప్పకనే చెప్తున్నారు. ఇక అలాంటి అద్భుతాన్ని చూడడం సాధ్యమయ్యేది, మనలని మనం తగ్గించుకున్నప్పుడే. నేను అనే భావనని తగ్గించుకుంటేనే. నిన్ను నువ్వు తగ్గించుకుంటే తరుగు లేని అద్భుతాన్ని దర్శించడానికి అర్హతని సంపాదించుకున్నట్టే అని సుందరకాండ సందేశం.

బైబిల్ లో ఒకమాట ఉంటుంది, "తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును"  ఇదే స్వామి సుందరకాండలో చేసి చూపించారు, వాల్మీకి రాసి చూపించారు. ఆత్మ దర్శనానికి వెళ్ళేవాడు దేహాభిమానాన్ని ఎంత తగ్గించుకోవాలో చెప్పే శ్లోకం ఇది.
సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః!
పృషదంశక మాత్రస్సన్ భభూవాద్భుత దర్శనః!!
ఇక రాత్రి అనేదాని గురించి గీతాచార్యులు చెప్పేవారు ఉన్నారు. మాములు వారికి పగలు, జ్ఞానికి రాత్రి, మాములు వారికి రాత్రి జ్ఞానికి పగలు. బాహ్యార్ధంగా చూస్తే మామూలు జనాలు నిద్రించేటప్పుడు జ్ఞాని మేల్కొని ఉంటాడు అని అర్ధం వస్తుంది. కానీ అంతరార్ధం కోసం పెద్దలు చెప్పిన వ్యాఖ్యానాలు చూస్తే మరో విషయం తెలుస్తుంది. మామూలు మనిషి పగటిపూట వేటిని చూసి ఆనందపడతాడో వాటిని జ్ఞాని పట్టించుకోడు, మామూలు మనిషి పట్టించుకోని భగవంతుని మాత్రం జ్ఞాని ఎప్పుడూ దర్శిస్తూ ఉంటాడు.
ఇలా చాలా ఉన్నాయి. అసలు ప్రకృతిలో ప్రతి వస్తువు, ప్రతి జంతువు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉంటుంది. మనం తెలుసుకోగలమో లేదో అని ఋషులు సరళం గా వాటిని కావ్యాలుగా, పురాణాలుగా, ఇతిహాసాలుగా ఇచ్చారు. ఇవి కూడా అర్ధం చేసుకోలేకపోతే అని రామనామాన్ని ఇచ్చారు. రామ రామ రామ అని జపిస్తుంటే ప్రకృతి మాయ పొరలు పొరలుగా విడిపోతుంది. అన్నీ వాటంతటే అవే ద్యోతకమవుతాయి. జ్ఞాని ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటే, భక్తుడు అప్రయత్నంగా, భగవంతుని విభూతిగా దేన్నైనా అర్ధం చేసుకోగలడు.  ఉదాహరణకి ఒక చీమ చూడండి. ఎన్ని సార్లు కిందపడ్డా తన గమ్యం చేరేవరకూ వదలదు. పొద్దున్నుండీ, సాయంత్రం దాకా అయినా ప్రయత్నిస్తూనే ఉంటుంది. తనకేదన్నా దొరికితే అందరికీ చెప్పి అందరినీ తీసుకొస్తుంది. మొత్తం నాకే అని ఊరుకోదు. సద్గురువులు కూడా అంతే. తాము కష్టపడి సాధించిన జ్ఞానాన్ని దాచుకోరు. అర్హుడైన శిష్యుడు దొరికితే ఆ అమృతవాణి  గంగా ప్రవాహంలా వెలివడి లోకాన్ని ఉద్ధరిస్తుంది. 
ఒక శక్తి ప్రయోగం నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక పదిలక్షలసార్లు రామనామజపం చేస్తే ఏ శక్తి నైనా ఎదుర్కోవచ్చు. రామనామం, మనసుని ప్రశాంతం చేస్తుంది. తమస్సుతో నిండి ఉండే మనస్సనే నది, స్వచ్చంగా ఎలా వాల్మీకి కి దర్శనమిచ్చిందో అలా మన మనస్సే మనకు అద్దమై మనమేంటో చూపిస్తుంది. లోకమేంటో చూపిస్తుంది. లోకంలో సాధించాల్సింది ఏమిటో చూపిస్తుంది. ఎలా సాధించాలో చూపిస్తుంది.ఏది అడ్డమో చూపిస్తుంది. నిజానికి పంచాంగ చూడటంలో కూడా అర్ధం ఇదేనని పెద్దలు చెప్పారు. నేనెవరిని, ఎవరికి చెందినవాడిని, ఏమి సాధించాలి, ఎలా సాధించాలి, ఏమిటి అడ్డు అనే ఐదింటిని గురించి నిత్యం ఆలోచించమని పంచాంగం చెప్తుందట. మనం కూడా ఆ ఆలోచనని పెంచుకుని రామనామాన్ని మనసులో నింపుకుని జీవన్ముక్తులౌదాము.


నా భార్యకి పండరి భజన నేర్పిన గురువులు పల్లా వెంకటేశ్వర్లు గారు పాడిన ఒక పాట.
మరువబోకు మానవుడా మమత వీడరా!(౩)
ఆ మమత వీడి రామనామ స్మరణ చేయరా!
స్వామి స్మరణ చేయరా,స్వామి స్మరణ చేయరా

రామనామ స్మరణ చేసి ఆత్మసుఖము పొందరా!
ఆత్మసుఖము కన్న మరి పుణ్యమే లేదురా!!

మానవధర్మమ్ము వదిలి దానవుడవు కాకురా!
మాయకు లోబడితె నీవు మానవుడవు కావురా!!

ఒహో!! ఉన్నదానితోనే నీవు తృప్తి పొంది సుఖపడరా!
తృప్తి లేని మానవుడా, భస్మమై పోదువురా!!

అయ్యో!! నాది నీది యనే మూఢ తత్వము విడనాడరా!
వెదకి చూడ జగతిలోన ఏది నీది కాదురా!!


మరువబోకు మానవుడా మమత వీడరా!
ఆ మమత విడచి రామనామ స్మరణ చేయరా!

అయ్యో!! అప్పుడిప్పుడనగరాదు ఎప్పుడు ఏ వేళలో !
ఓ! తనువు వెళ్ళె వేళలోన దగ్గరెవ్వరుండరురా!!

అయ్యో!! ఆలుబిడ్డలన్నదమ్ములు, వెంట ఎవరు రారురా!(౨)
వదలలేక వచ్చినా వల్లకాటివరకేరా!!


మరువబోకు మానవుడా మమత వీడరా!
ఆ మమత విడచి రామనామ స్మరణ చేయరా!

చుట్టు నాల్గు గోడలలో ఇమిడి ఉన్న పుట్టరా!
పుట్టలోన తాచుపాము బుసలు కొట్టుచుండురా!!

అయ్యో!! కట్టెలే చుట్టాలురా, కాష్టమే ఇల్లురా!

ఓహో!! కట్టెలే చుట్టాలురా, కాష్టమే ఇల్లురా!
 అగ్నిదేవుడే మనకు ఆత్మబంధుడురా!!

హరేరామ హరేరామ హరేరామ యనరా!
హరేరామ యనినంతనే హరియించును పాపములు!!


మరువబోకు మానవుడా మమత వీడరా!

ఆ మమత విడచి రామనామ స్మరణ చేయరా!!
స్వామి స్మరణ చేయరా,స్వామి స్మరణ చేయరా !!


సర్వం శ్రీ సీతారామ చంద్ర పరదేవతా పరబ్రహ్మార్పణ మస్తు..

Wednesday, July 4, 2012

గురువు



గురువంటే ఎవరు? శాస్త్రాలు చాలాచెప్తున్నాయి. నాకున్న శాస్త్రజ్ఞానం పరిమితం కాబట్టి వాటిని ఉటంకించడంలేదు. నాకున్న తెలివిలోనుండి గురువు గురించి నాకు తెలిసిన మాటలు రాస్తున్నాను. అయినా నాకున్న తెలివి అని మాట్లాడేవాడికి గురువు గురించి మాట్లాడే అర్హత ఉంటుందా? అందుకే ఆ స్వామి పలికిస్తున్నారన్న నా నమ్మకం చెప్పినట్టు రాస్తున్నాను. నా ఇంట్లో, గురువు హోదాలో నన్ను చెయ్యి పట్టుకుని నడిపించిన వారి గురించి ఈ టపా!

          ఎవరికైనా ప్రపంచంలో మొదటి గురువు అమ్మ అంటారు. కానీ ఎంత ఊహ తెలిసిన తర్వాతైనా ఆ విషయాన్ని పట్టించుకోము. ప్రపంచంలో అమ్మ ఒకటే "నా ఆయుష్షు కూడా పోసుకుని బతకరా" అంటుంది. మొన్ననే గూగుల్ ప్లస్సులో ఒక పోస్ట్ చదివాను. "తినవలసిన మనుషులు నలుగురు ఉండి, ముగ్గురికి మాత్రమే సరిపడా తిండి ఉన్నప్పుడు, ఏమాత్రం ఆలోచించకుండా నాకీరోజు ఆకలిలేదని అనే వ్యక్తి ఒక్క అమ్మ మాత్రమే". నిజం కూడా. అత్తా, తోడికోడలు తిండి కూడా పెట్టకుండా మాడ్చుతుంటే, భర్త దూరదేశంలో ఉంటే, కాన్పు తర్వాత పచ్చడి మెతుకులు తినవలసి వచ్చినా, తన కొడుకుకి మాత్రం పాలపొడి డబ్బాలు తెమ్మని భర్తని సాధించింది ఒక తల్లి, పాలు లేనప్పుడు మరో తల్లి గోమాత పాలు తెచ్చి పట్టింది. నెలల పసిగుడ్డుని భుజాన వేసుకుని పొలం పనులకి వెళ్ళింది ఆ మహాతల్లి. ఆవిడ ఏమి చదుకోలేదు, స్వార్ధం, త్యాగం లాంటి మాటలు కూడా తెలియవు. ఐతేనేం, తన బిడ్డలు బాగా బతకాలన్న స్వార్ధం, తన బిడ్డలకోసం ఏమైనా వదులుకోగల త్యాగం ఆమె సొంతం.

                  అందుకే ఆమెని సనాతన ధర్మం తొలిగురువుని చేసింది. దక్షిణామూర్తి ఏ రకంగానైతే "మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వమో" తల్లి కూడా అలాంటిదే, ఒక్కనాడు నోరు విప్పి జ్ఞానబోధ చెయ్యదు. కాని మనసు పెట్టి ఆ తల్లిని అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఎన్ని తెలుస్తాయో. సకలవేదస్వరూపం అమ్మ. తన బిడ్డలకోసం లోకం మొత్తంతో పోరాడగల ధనుర్వేద ధురంధరి ఆమె. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఎన్నని చెప్పగలం? ఎన్నని , ఏమని ఎన్నగలం తల్లి ప్రేమని.

అందుకే "మాతృదేవోభవ".

                           సహజంగా లోకంలో ఒక నానుడి ఉంది. తల్లి నిజం, తండ్రి నమ్మకం అని. కానీ ఆ స్థాయిని దాటి తండ్రికి గురువు స్థానం ఇచ్చింది సనాతన ధర్మం. అంటే తన బిడ్డ భాధ్యతయుతంగా పెరగాలని కోరుకోవడమే కాదు, పెరిగేలా చెయ్యాల్సిన ప్రాధమిక భాద్యతని కూడా తండ్రి మీదనే ఉంచింది ధర్మం. నివురుగప్పిన నిప్పులా ఉంటూ, ఎన్ని బాధలు ఎదురైనా గుట్టుగా ఉంటూ తినడానికి తిండి లేకపోయినా తన బిడ్డ మాత్రం మంచి చదువు చదవాలని కోరుకుంటాడు, ఉన్నతజీవితం అందాలని ఆశపడతాడు. అందుకోసం తను నిలువెల్లా కరిగిపోయినా బాధపడడు. ఒకతండ్రి తను చదవలేకపోయి మధ్యలో ఆపేసిన చదువుని తన బిడ్డలకి అందించాలని తన కోరికలన్నీ చంపుకుని ఒక యోగిలా బతికాడు. వారు ఒక ఒడ్డుకి చేరుకున్నాక తను వెనక్కి తిరిగి చూసుకుంటే వారికోసం తిన్న ఢక్కామొక్కీలే తప్ప తమకంటూ ఏమీ మిగలదు. అయినా ఆయన బాధపడడు. పైపెచ్చు ఏమీ అనుభవించకపోయినా అన్నీ తానే అనుభవించినట్టు గర్వంగా చెప్పుకుంటాడు, అన్నీ అందరికీ ఇచ్చేసి పులిచర్మం కట్టుకుని మిగిలిపోయిన పరమశివుడిలా....

అందుకే పితృదేవోభవ!

ఇక గురువు, గురువు గురించి చెప్పేటంత పెద్దవాడినికాదు కానీ, ఈ పరంపరలో కనపడకుండా పోయిన మరో గొప్పవ్యక్తి గురించి కూడా చెప్పాలి. పరంపరలో కూడా చేర్చవలసిన విషయం(అని నా అబిప్రాయం). అదే

భ్రాతృ దేవోభవ!

                 తల్లీ,తండ్రీ, గురువు, దైవం వీరికిచ్చిన గొప్పదనం నిర్ద్వంద్వంగా అంగీకరించవలసిందే, కానీ సోదరుడు కూడా అంత గొప్పవాడే అని నా అభిప్రాయం. తల్లి తర్వాత తల్లిలా, తండ్రి తర్వాత తండ్రిలా నీడలా ఉండి కాపాడేవాడు అతను. మారుమూల పల్లెటూళ్ళో తల్లితో పాటు అవమానాలను దిగమింగుతూ కూడా తన తోబుట్టువులను కంటికి రెప్పలా చూసుకున్నాడు నా అన్నయ్య. యశోదమ్మ అంటుంది భాగవతంలో, ఏ సిద్ధాశ్రములం తొక్కితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో నేటికి మన భాగ్యశేషంచేత బిడ్డ దక్కాడు కదా అని. ఎంతో భాగ్యశేషం ఉంటే తప్ప గొప్ప అన్నకూడా దొరకడు. అమ్మ పొలంపనులకి వెల్తే పసిగుడ్డుని భుజాన వేసుకుని తిరిగాడు, స్కూలుకి రానీయకపోతే స్కూలుని వదిలేశాడు కానీ నన్ను వదలలేదు. నేను విసర్జించిన అవశేషాలని పెద్దవాడైయ్యుండి కూడా కడిగాడు. నాకోసం ఎంతోమందిని ఎదిరించాడు. ఇద్దరి చదువుకి ఆర్ధికస్థోమత సరిపోదని తన చదువుని కూడా వదిలాడు, తద్వారా తను పొందవలసిన ఉన్నత జీవితాన్ని నాకు భిక్షగా వేసాడు నా అన్న. ఈ రోజున ఒక ఇంజినీర్ గా సమాజంలో నాకు గుర్తింపు ఉందంటే అది నా అన్నయ్య నాకు పెట్టిన భిక్ష. ఒక పిల్లి తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు, కోడి తనపిల్లల్ని భద్రంగా రెక్కలకింద దాచుకున్నట్టు, సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా, జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నావని అన్నా భరించి నాకు నీడై నిలబడ్డాడు. నాలో చదవడం అనే ఒక ఆసక్తికి బీజం వేసినవాడు ఆయన.



నాకు తెలిసిన ఇంకో అన్న, తల్లితండ్రులు పోయిన తర్వాత తమ్ముడిని ఉన్నత చదువులు చదివించాలని కోరుకున్నాడు, అన్నీ కుదిరినప్పుడు అలా అనుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ తనకే పూటగడవడానికి ఇబ్బందిగా ఉండి, తను చూసుకోవలసిన కుటుంబం ఉండి కూడా తమ్ముడిని ఏ కూలి పనులకో పంపకుండా దైర్యం చెప్పి చదివించాడు, అనారోగ్యకారణాలచేత పరీక్ష తప్పితే ధైర్యం చెప్పి, చదువుకోవడానికి పంపాడు. స్ఫూర్తిగా నిలిచాడు. ఈరోజున అతను ఒక గొప్ప స్థాయికి చేరిన తర్వాత అతని నుండి ఏమీ ఆశించకుండా అదే మారుమూల పల్లెటూళ్ళో ఉండిపోయాడు.

అందుకే పితృపంచకంలో అన్నని కూడా చేర్చింది సనాతన ధర్మం. అందుకే మరొక్కసారి



భ్రాతృదేవోభవ..........





Tuesday, April 24, 2012

అక్షయ తృతీయ అంటే

శ్రీ గురుభ్యోన్నమః




అందరికీ నమస్సులు

ఈ నాటి అక్షయ తృతీయ అందరికీ అక్షయమగు శుభఫలములిచ్చుగాక, లోకము శాంతి

సౌభాగ్యములతో ఉండుగాక అని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ తిథిని గూర్చి కొన్ని

విషయములు పురాణోక్తమైనవి ఇక్కడ పొందు పరుస్తున్నాను.



అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం వెండి లేదా ఇతర ఏదేని విలువైన

వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజు కొన్నది అక్షయం అవుతుందని

చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం

ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని డబ్బులేకున్నా అప్పు చేసో

తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవ్వడం అటుంచి చేసిన అప్పులు

తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అయ్యి కూర్చుంటాయి.



మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం..

ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి

చెప్పారు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమం,

దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది.

(పుణ్య కార్యాచరణం వల్ల వచ్చే ఫలితం అక్షయమైనప్పుడు పాపకార్యాచరణం వల్ల

వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుందిగా... ).

ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మగారితో కలిసి ఉంటుంది. అందుచే విశేష

పూజనీయమైనది. ఈ నాటి ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మమాచరించినా కూడా

తత్సంబంధఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు

పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో

స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి, తరవాత ఆ

బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని

దైవోచ్ఛిష్ఠంగా, బ్రాహ్మణోఛ్ఛిష్ఠంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో

స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో

ఈశ్వర వాక్కు.

ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా

వ్రతాన్ని ఆచరించిన తరవాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి

విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున

ముక్తిని పొందగలడు. (అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని,

గట్టిగా ఉన్న బియ్యము, అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ

ధాన్యమునుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన

ఆహారముని అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు)



శ్రీ నారద పురాణం కూడా, ఈ నాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని

చెప్తోంది.

ఈ నాడు దానం ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో ఈ

నాడు దానాది ఫలములు నారదమహర్షి ఇలా చెప్పారు. అక్షయ తృతీయ నాడు గంగా

తీరంలో నియమంతో ఘ్రుత ధేను దానం చేసినవాని ఫలితం ఇంతింత కాదు,

సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై బంగారము, రత్నములతో కూడి చిత్ర

హంసలతోకూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి

సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. తరవాత గంగా తీరంలో అత్యంత

ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు. అంతమున బ్రహ్మ జ్ఙానియై ముక్తిని

పొందుతాడు. అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోలోమ సంఖ్యలు ఎన్ని

ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్ల తరవాత భూమిమీద పుట్టి

చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు. గంగా

నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న

తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత

భూమిని దానం చేసాడో అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు

శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాదిపతి అగును. అతడు

నిద్రించినచో భేరీ శంఖాది నినాదములచే మేల్కొలపబడును. సర్వ ధర్మ పరాయణుడై

సర్వ సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చి

స్వర్కమున నున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి స్వయముగా జ్ఙానియై

అవిద్యను జ్ఙాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యముని పొంది పరబ్రహ్మమును

పొందెదడు. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి.

ఈ తిథినాడు పదహారు మాస మితమగు (పదహారు మినప గుండ్ల ఎత్తు) స్వర్ణమును

విప్రునకు దానమిచ్చిన, వాని ఫలము అక్షయము వాడు అన్ని లోకములందు పూజ్యుడై

విరాజమానుడగును.



దీనివల్ల తెలిసేదేమంటే బంగారం కొంటే అక్షయం కాదు, ఈ రోజు చేసే ధర్మ

కార్యాలు, ఉపాసనలు, దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అని.



తెలియని వారికి ఇది తెలియ చెప్పండి. ఈ నాడు డబ్బులు లేకున్నా అప్పు చేసి

బంగారం యొక్క డిమాండు పెంచి తద్వారా ధర పెంచి, దేశ ఆర్థిక పరిస్థులను,

వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను ఇన్ఫ్లేషన్ పేర ఇబ్బంది పాలు చేయకండి.


original source: Sri ayyagari suryanagendra garu.

Tuesday, January 10, 2012

MANMOHAN SINGH ECHOES JINNAH’S LANGUAGE ON MUSLIMS

One of the forwarded mail:

Congress *new* Hand symbol +




Prime Minister Manmohan Singh said plans for minorities, particularly Muslims, must have the ‘first claim’ on resources so that benefits of development reach them equitably.

”We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably the fruits of development. These must have the first claim on resources,” he said in his address at the 52nd meeting of the National Development Council (NDC) in New Delhi.

“Minorities kya unkey damad lagte hain (is minority community his son-in-law)

Manmohan Singh what are you talking about?

”ostradamus predicted that the world would be destroyed by a man in a blue turban. We all thought it’d be Osama or Saddam, but had to reject them since they didn’t wear a blue turban.




But lo and behold – the man to destroy India is already here — none other than our blue turbaned PM, who has now publicly stated that Muslims in India must get “first preference to national resources”

This man must be removed from office before he sells whatever’s left of the nation to someone else

Dear Friends:
Please forward to millions of voters.. Congress should be perceived as a pro muslim and anti Hindu party by the voters.

Friday, January 6, 2012

మురికి బొమ్మ - Dirty Picture

శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
ఆఫీస్ లో మా మేనేజర్ ఏదో మీటింగ్ అంటే వెళ్ళా. "We need to think about big picture" అని ఏదేదో చెప్తున్నాడు. ఆయన బిగ్ పిక్చర్ అనగానే నాకు డర్టీ పిక్చర్ గుర్తొచ్చింది. తర్వాత నాకింకా కొన్ని డౌట్లొచ్చాయి.

నటనలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన , ఓ ఎస్.వి రంగారావుగారు, ఊర్వశి శారద వీళ్ళ పేర్ళు జాతీయ స్థాయిలో చాలామందికి తెలియవు. ఎస్.వి. రంగారావంటే గుర్తొచ్చింది, ఏమి మనిషండీ, రూపు గట్టిన హిరణ్యకశిపుడే అనిపిస్తాడు భక్త ప్రహ్లాద సినిమాలో. "శ్రీ కాకుళాంధ్ర మహావిష్ణువు కధ" లో వల్లభుడనే సమాధానం వచ్చే పొడుపుకధ విప్పే సమయంలో, సంకెళ్ళు పటపటా తెంపే సన్నివేశంలో ఆయన హావభావాలు అలా గుర్తుండిపోయాయి. ఇలాంటివాడు కాబట్టే సంకెళ్ళు తెంపగలిగాడు అని అనుకునేవాడిని చిన్నప్పుడు. ఆయనవి ఇంకా మంచి మంచి సినిమాలు ఉన్నాయనుకోండి, నాకు బాగా నచ్చిన సినిమా భక్త ప్రహ్లాద, నాకు బాగా గుర్తున్న సీన్లు పైన చెప్పిన రెండూనూ.
అలాంటి తరం నుండి, నేటి తరం సినిమాలు ఎలా ఉన్నాయో చూస్తే కొంచెం బాధగానే ఉంది.
ఎందుకు ఈ మధ్య మన హీరోయిన్లంతా ఐటం సాంగులు, వాంపు రోల్స్ మీద పడ్డారు, ఇవ్వేళ ఏ ఇంట్లో విన్నా "జిలేబీ భాయ్ " అనో, లేకుంటే "చిక్ని చమేలి" అనొ ,"ఊ ళళా ఊళళా" అనొ,"చమ్మక్ చల్లో" అనొ ,"డియ్యాలో డియ్యాలో " అనొ, "రింగ రింగ" అనొ తప్ప వేరే పాటలు వినపడట్లేదు. మీడియా కూడా వీటినే పాపులర్ చెయ్యడానికి చూస్తుంది. రోజుకి పదిసార్లు అదే పాటని ప్రసారం చేస్తే , వాళ్ళని చూసి పిల్లలు కూడా ఓ మల్లికా షెరావత్ లాగానో, విద్యాబాలన్ లాగానో అయితే మనకి తొందరగా పేరొస్తుందనుకున్నరనుకోండి , సామాజిక విలువలు ఏ స్థాయికి పడిపోతాయో అందరూ అర్ధం చేసుకోవాలి. పిల్లలు ఏం చూస్తున్నారో ,వాటి ప్రభావం పిల్లలమీద ఎలా ఉంటుందో కూడా తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. అందరూ చూస్తున్నారు కదా, ఇవ్వాళ ఇదే ట్రెండ్ అని వదిలేస్తే, దాని పర్యవసానం చాలా తీవ్రం గా ఉంటుంది.

నేనో చిన్న ఉదాహరణ చెప్తాను.

మా కజిన్ ఒకామెకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్దామె పేరు వైష్ణవి, పాటలు బాగా పాడుతుంది అంటే ఒక రోజు ఏదన్నా పాట పాడమ్మా అని అడిగా, అంతే డియ్యాలో,డియాలో..... రింగ రింగ అని మొదలు, నాకు చిరాకు వేసి ఎక్కడ నేర్చుకున్నావు ఈ పాట అని అడిగా,మా నాన్న సెల్లులో పాటలు అని చెప్పింది. వాళ్ళ నాన్న సెల్లులో ప్లే చేస్తుంటే విని నేర్చుకుంది. తనకి ఆ పాట పూర్తి అర్ధం తెలియదు. సరే నేను ఒకసారి "మహా ప్రాణదీపం ,శివం,శివం" పాట వినిపించాను. అర్ధం కాకపోయినా మామయ్యా, ఈ పాటే బాగుంది, మళ్ళీ పెట్టవా అని అడిగి మరీ విన్నారు, ఎప్పుడు వెళ్ళినా మర్చిపోకుండా మావయ్యా అల్లా శివం పాట పెట్టవా అని అడిగి మరీ వింటారు. ఆ పాటకీ వాళ్ళకి అర్ధం తెలియదు, కానీ ఆ పాట వినేకంటే ఈ పాట వినడం మంచిది కదా.
రేపు పొద్దున్న ఈ పాటకి అర్ధం తెలిస్తే శివతత్వం మీద ఆసక్తి పెరుగుతుంది, ఒక్క పాట వేదాలెన్నో, సంగీత గతులెన్నో, ద్వాదశ జ్యోతిర్లింగాలేంటో, పంచాక్షరీ ప్రాశస్త్యమేంటో, అన్నిటి గురించీ చెప్తుంది. వీటిలో ఏ ఒక్కదానిమీద ఆ పాపకి ఆసక్తి కలిగినా తన జీవితం బాగుంటుంది కదా. on the other hand రేపు పొద్దున్న పెద్దయ్యాక డియ్యాలో డియ్యాలో పాట అర్ధం అయ్యే వయసు వచ్చినప్పుడు ?..........

అందుకే అంటారు మాట్లాడే మాట ఆత్మహత్యా సదృశమూ కాగలదు, అభయ,జ్ఞాన ప్రదానమూ చెయ్యగలదు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం రామాయణమే ఉంది. ఒక పతివ్రతని బంధించి తన ఇంట్లో పెట్టి అనకూడని మాటలన్నీ అని చావు కొని తెచ్చుకున్నాడు రావణాసురుడు, ఒక పతివ్రత దుఃఖాన్ని చేత్తో స్పృశించకుండా తన వాక్కుతో ఓదార్చి ధైర్యం చెప్పి ఆమెని మనస్పూర్తిగా నవ్వేలా చెయ్యగలిగాడు, శత్రు సభా మధ్యంలో నిలబడి నిర్భీతిగా మాట్లాడగలిగాడు హనుమ.

వాళ్ళు డబ్బొస్తుంది కదా అని ఆ మురికి బొమ్మల్లో పొర్లాడుతున్నారు, ఇకనుండైనా ఈ మురికి బొమ్మల మూలంగా పిల్లలకి మురికి అంటకుండా జాగ్రత్త పడదాం.