Tuesday, May 19, 2009

హనుమత్ రక్షా యాగం పూర్ణాహుతి .





రవ్వవరం లో రెండు ఎకరాల సువిశాల క్షేత్రంలో నిర్మింప బడ్డ శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం లో హనుమత్ రక్షా యాగం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ యాగం ఇప్పుడు పూర్ణాహుతి దశకు చేరుకుంది. ఎక్కడెక్కడనుండో మీ సంకల్పాలను మాష్టరుగారు ఆ స్వామికి నివేదించి, రోజూ మన గోత్ర నామాలతో క్రమం తప్పకుండా పూజ ను నిర్వహిస్తూ వచ్చారు.ఆ స్వామి అనుగ్రహం చేత నేను రవ్వవరం లో వేంచేసి యున్న ఆ జగన్మాత ని, క్షేత్ర పాలకుడైన ఆ వాయునందనుడిని దర్శనం చేసుకోగలిగాను.ఎన్నో రకాలుగా పరీక్షలు పెట్టి ఆ స్వామి రవ్వవరం వెళ్ళడానికి నాకు అనుమతినిచ్చారు. పీఠం, యాగం అనగానే నేను ఏదో అనుకున్నాను. కానీ అక్కడకు వెళ్ళిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను. చక్కటి ప్రదేశం, చూడగానే ప్రశాంతత మూర్తీభవించినట్లుండే పరిసర ప్రాంతాలు, పల్లెటురి ఆప్యాయతలు, అక్కడ దీక్ష తీసుకున్న బాల స్వాములు, అంతా కలిసి నా అనుభవాన్ని ఆనంద మయం చేసారు.వెళ్ళగానే స్నానాదికాలు పూర్తి గావించి స్వామికి పూజ చేసాము. తర్వాత యాగం లో పాల్గొన్నాము. ఆ తర్వాత ఆ పీటం గురించి , పూర్వ చరిత్ర గురించి చెప్పారు. ఆ తర్వాత బాలస్వాములతో మాటలు మొదలుపెట్టాం. మొదట కొంచెం దూరంగా మసలినా తర్వాత దగ్గరయ్యారు. దానికి తోడు నాతో పాటు నాగప్రసాద్ ఉండనే ఉన్నాడయ్యే. వాడుంటే పిల్లలు చాలా తొందరగా దగ్గరికి వస్తారు. అలా వాళ్ళు బాగా కలిసిపోయారు.వాళ్ళ మాటలు వింటూ ఉండగానే సాయంత్రం అయ్యింది.సరే పిల్లలందరినీ రమ్మనమని చెప్పి ఆటలాడాము.ఖో ఖో ఆడి కాలు బెనికించుకున్నాను. ఆ తర్వాత నాగప్రసాద్ పరిగెత్తకుండా ఆడే ఆటలు ఆడించడంతో ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత సాయంత్రం మళ్ళీ పూజ, భజన జరిగింది. మాష్టరు గారి తాళజ్ఙానం అబ్బురపరిచింది.ఆదివారం రోజు ఇంకా ఆహ్లాదంగా గడిచింది. అక్కడున్న చెట్టూ,చేమా కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించాయి. దగ్గరిలో ఒక కొండ మీద కొండగురునాధ స్వామి ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళాము. మాకు తోడుగా కొంతమంది బాలస్వాములు వచ్చారు. ట్రెక్కింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి రవ్వవరం ఆ చుట్టుపట్ల ఉన్న కొండలు కోరిక తీరుస్తాయి.ఆ తర్వాత ఊళ్ళో వెలిసిన వేణుగోపాల స్వామిని, శివున్ని దర్శించుకుందామనుకుంటే సమయాభావం చేత కుదరలేదు.
కుదిరితే మీరు కూడా పూర్ణాహుతి కి వెళ్ళడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. ఏర్పాట్లు మాత్రం భారీ ఎత్తున జరుగుతున్నాయి. వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనిపిస్తుంది. ప్రయత్నించండి. ౫౪ (54) రోజుల పాటు అఖండంగా జరిగిన ఈ దీక్షా కార్యక్రమాన్ని చివరి రోజైనా దగ్గరనుండి చూడాలనుకుంటే,చూడాలనుకుంటే ఏంటి పాల్గొనాలనుకుంటే మరెందుకు ఆలస్యం, వెంటనే irctc నో,RTC నో అడిగి వినుకొండ కి టికెట్ తీసుకోండి. ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి.




దూర ప్రాంతములో ఉండి ఇక్కడకు రాలేని పరిస్థితిలో ఉన్న వారి కోసం స్వామి వారి రక్షలను (ఉచితంగానే) పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టల్ ఖర్చులు మాత్రం పంపించవలసి ఉంటుంది. ఇతర వివరాల కోసం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలవరకు ఈ ఫోన్ లలో సంప్రదించండి. అందుబాటులో ఉంటాము.Phone numbers: 09948235641, 09940050078, 08646211717.




marinni ఫోటో లు తదుపరి టపాలో ................

Saturday, May 2, 2009

విజయేంద్ర జాతక కధలు-"మిత్రుడు"

బుద్ధుడి జాతక కధలు అని అప్పుడప్పుడూ మీరు వినే వుంటారు. ఇది మన విజయేంద్రుడి కలం నుండి జాలువారిన జాతక కధ. పోస్టర్ చూసిన తర్వాత ఫస్ట్ అనిపించింది ఏంటంటే శివలెంక కృష్ణప్రసాద్ కి ఈ సినిమా కొంచెం డబ్బులు మిగులుస్తుంది అని. టైటిలే కొంచెం మార్చి ఏ మూడు ముళ్ళ బంధం అనో ఏడడుగుల సంబంధం అనో పెట్టుంటే బాగుండు అనిపించింది. బహుశా విదేశంలో జరిగిన పెళ్ళికి అంత పవర్ ఉండదనుకున్నారేమో అందుకే టైటిల్ అవి తట్టినట్టు లేవు. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాలో నిజంగా నటించాడు. ఒక్క మగాడిని అని అహంకరించకుండా స్క్రిప్ట్ లో ఉన్న మిగతా నటీనటులకి కూడా కనిపించే అవకాశం ఇచ్చాడు. ఇక కొయ్యడాలు, నరకడాలు ,భారీ భారీ డవిలాగులు లేకుండా మరి మన బొబ్బిలి సింహంతో సినిమా తీసినందుకు నిజంగా దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఒక యంగ్ హీరో కి సరిపోయే కధతో ఆ కధలో బాలకృష్ణ ని పెట్టి బాలకృష్ణ ని యంగ్ గా చూపించగలిగిన(మరీ టూ మచ్ రాస్తున్నానా ,లేదు లే బాలకృష్ణ నిజంగానే యంగ్ గా ఉన్నాడు సినిమా లో) టీం నిజంగా ప్రశంసా పాత్రమే. సినిమా ఆద్యంతం ఒకే టెంపో మెయింటెయిన్ చేసాడు. టెంపో అంటే పెద్ద ఉద్దేశ్యం ఏమీ లేదండీ నాకు. బాలకృష్ణ సినిమా అంతా పాటలతో సహా ఒకేలా కనిపించాడు. మామూలుగా అయితే విజయేంద్రవర్మ క్లైమాక్స్ లాగా ప్రతీ సినిమాలోనూ పదీ ,పదిహేను రకాలుగా కనిపించేవాడు.ఇందులో అలా లేదు ఇందుకు దర్శకుడిని తప్పకుండా మెచ్చుకోవాలి. ఇక ద్రోణ తర్వాత సినిమా అయినా కూడా దర్శకుడు ప్రియమణిని కంట్రోల్ లో ఉంచాడు. అందుకు ఒక ఓ ! డైరెక్టర్ కి ,.



ఇక ఇప్పుడు విషయంలోకి (నా బొంద విషయం ఏముంది చెప్పడానికి. సినిమా చూసిన వాళ్ళకి టైటిల్ చూడగానే అర్ధం అవుతుంది. సినిమా చూడని వాళ్ళకి ఎటూ నేను స్టొరీ చెప్పబోవడం లేదు కాబట్టి అర్ధం కాదు.)సరే విషయం టూకీగా చెప్తాను అర్ధం చేసుకోగలిగినవాళ్ళు చేసుకోండి. లేదంటే సినిమా చూడండి.


ఓ యాక్సిడెంట్-కొన్ని చావులు-ఒక జాతక ( దోషం unna ) ప్రేమకధ- ఒక చావుకై ,తోడుకై వెతుకులాట (కంగారు పడద్దు చావులో తోడు అని కాదు , చావక పోతే,చావు రాకపోతే బతకాడిని తోడు అని అర్ధం) - అదీ స్టోరి .


ఒక వేల మీరీ టపా చదివి సినిమాకెల్తే మాత్రం బయటకు వచ్చాక కూడా మీకు కూడలీ,జల్లెడా నా బ్లాగూ తప్పకుండా గుర్తుంటాయి నాదీ పూచీ.



ఎనీ క్వశ్చన్స్:


-- ఈ టపాకి మీ టైటిల్ కీ సంబంధం లేదు అని నా ఆబిప్రాయం ,దీనికి మీ సమాధానం?


సమా: సర్లే పెద్ద చెప్పొచ్చావు కాదు కాదు అడగొచ్చావు తెలుగు సినిమా టైటిల్స్ కి , సినిమాలకీ ఉంటున్న సంబంధం కంటే ఎక్కువే వుంది .అయినా అడిగావు కాబట్టి నీకింకో విషయం చెప్తా. సినిమా చూసి బయటకు రాగానే సినిమా పోస్టర్ చూసి నేను అన్న మొదటి మాట ఇదే . అందుకే ఇదే టైటిల్ అంతే.

విజయేంద్ర జాతక కధలు-"మిత్రుడు"

బుద్ధుడి జాతక కధలు అని అప్పుడప్పుడూ మీరు వినే వుంటారు. ఇది మన విజయేంద్రుడి కలం నుండి జాలువారిన జాతక కధ. పోస్టర్ చూసిన తర్వాత ఫస్ట్ అనిపించింది ఏంటంటే శివలెంక కృష్ణప్రసాద్ కి ఈ సినిమా కొంచెం డబ్బులు మిగులుస్తుంది అని. టైటిలే కొంచెం మార్చి ఏ మూడు ముళ్ళ బంధం అనో ఏడడుగుల సంబంధం అనో పెట్టుంటే బాగుండు అనిపించింది. బహుశా విదేశంలో జరిగిన పెళ్ళికి అంత పవర్ ఉండదనుకున్నారేమో అందుకే టైటిల్ అవి తట్టినట్టు లేవు. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాలో నిజంగా నటించాడు. ఒక్క మగాడిని అని అహంకరించకుండా స్క్రిప్ట్ లో ఉన్న మిగతా నటీనటులకి కూడా కనిపించే అవకాశం ఇచ్చాడు. ఇక కొయ్యడాలు, నరకడాలు ,భారీ భారీ డవిలాగులు లేకుండా మరి మన బొబ్బిలి సింహంతో సినిమా తీసినందుకు నిజంగా దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఒక యంగ్ హీరో కి సరిపోయే కధతో ఆ కధలో బాలకృష్ణ ని పెట్టి బాలకృష్ణ ని యంగ్ గా చూపించగలిగిన(మరీ టూ మచ్ రాస్తున్నానా ,లేదు లే బాలకృష్ణ నిజంగానే యంగ్ గా ఉన్నాడు సినిమా లో) టీం నిజంగా ప్రశంసా పాత్రమే. సినిమా ఆద్యంతం ఒకే టెంపో మెయింటెయిన్ చేసాడు. టెంపో అంటే పెద్ద ఉద్దేశ్యం ఏమీ లేదండీ నాకు. బాలకృష్ణ సినిమా అంతా పాటలతో సహా ఒకేలా కనిపించాడు. మామూలుగా అయితే విజయేంద్రవర్మ క్లైమాక్స్ లాగా ప్రతీ సినిమాలోనూ పదీ ,పదిహేను రకాలుగా కనిపించేవాడు.ఇందులో అలా లేదు ఇందుకు దర్శకుడిని తప్పకుండా మెచ్చుకోవాలి. ఇక ద్రోణ తర్వాత సినిమా అయినా కూడా దర్శకుడు ప్రియమణిని కంట్రోల్ లో ఉంచాడు. అందుకు ఒక ఓ ! డైరెక్టర్ కి ,.


ఇక ఇప్పుడు విషయంలోకి (నా బొంద విషయం ఏముంది చెప్పడానికి. సినిమా చూసిన వాళ్ళకి టైటిల్ చూడగానే అర్ధం అవుతుంది. సినిమా చూడని వాళ్ళకి ఎటూ నేను స్టొరీ చెప్పబోవడం లేదు కాబట్టి అర్ధం కాదు.)సరే విషయం టూకీగా చెప్తాను అర్ధం చేసుకోగలిగినవాళ్ళు చేసుకోండి. లేదంటే సినిమా చూడండి.

ఓ యాక్సిడెంట్-కొన్ని చావులు-ఒక జాతక ప్రేమకధ- ఒక చావుకై ,తోడుకై వెతుకులాట (కంగారు పడద్దు చావులో తోడు అని కాదు , చావక పోతే,చావు రాకపోతే బతకాడిని తోడు అని అర్ధం) - అదీ స్టోరి .

ఒక వేల మీరీ టపా చదివి సినిమాకెల్తే మాత్రం బయటకు వచ్చాక కూడా మీకు కూడలీ,జల్లెడా నా బ్లాగూ తప్పకుండా గుర్తుంటాయి నాదీ పూచీ.


ఎనీ క్వశ్చన్స్:

-- ఈ టపాకి మీ టైటిల్ కీ సంబంధం లేదు అని నా ఆబిప్రాయం ,దీనికి మీ సమాధానం?

సమా: సర్లే పెద్ద చెప్పొచ్చావు కాదు కాదు అడగొచ్చావు తెలుగు సినిమా టైటిల్స్ కి , సినిమాలకీ ఉంటున్న సంబంధం కంటే ఎక్కువే వుంది .అయినా అడిగావు కాబట్టి నీకింకో విషయం చెప్తా. సినిమా చూసి బయటకు రాగానే సినిమా పోస్టర్ చూసి నేను అన్న మొదటి మాట ఇదే . అందుకే ఇదే టైటిల్ అంతే.

Tuesday, April 21, 2009

రెండున్నరేళ్ళుగా అందని ద్రాక్షగా మిగిలిన ఆ స్వామి దర్శనం.

శ్రీ రామదూతం శిరసా నమామి
నేనుండేది లింగంపల్లిలో, ఉద్యోగం ఐఐఐటి దగ్గర. ఆటో లో పావుగంట ప్రయాణం. ఎప్పుడైనా స్నేహితులుంటే బైక్ మీద వెళ్ళేవాడిని. గుల్ మొహర్ పార్క్ దాటిన తర్వాత అలిండ్ కి ముందు ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది. కొంచెం ఎత్తులో ఉండేదేమో దారిన పోతుంటే మూల విరాట్టు స్పష్టంగా కనపడేది. 2006 ఆగస్ట్ నుండి ఆ గుడి కి వెళ్దామని ఉండేది. కాని ఎపుడూ కుదరలేదు. మధ్యలో ఆటొ దిగి మల్లీ ఇంకొక ఆటో పట్టుకొని రావాలి. దానికి తోడు షూ విప్పాలి. ఇవన్నీ పెద్ద ప్రతిబందకాలు గా అనిపించేవి. దాంతో మనసులోనే "అతులిత బలదామం "అనుకుంటూ ఉండేవాడిని. దానికి తోడు తారక మంత్రం ఉండనే ఉంది "దేవుడు అని మనసులో ఉంటే చాలు చూపించక్కరలేదు అని". అదేంటో నగా నట్రా చూపించాలి కానీ భక్తి మాత్రం ఎవరన్నా ఉంటే బయటికి రాకూడదు ఎందుకో . సీరియస్ గా అనుకునేవాడిని, బండి కొనుక్కున్నాక రోజూ వెళ్ళాలి అని అనుకునేవాడిని. కానీ కొన్నదీ లేదు వెళ్ళిందీ లేదు. కొన్నాళ్ళు మా శశాంక్ తో కలిసి బైక్ మీద ఆఫీస్ కి వచ్చాను కాని ఎప్పుడూ గుడికి వెల్దాం అని అడగలేదు. కొన్నిసార్లు ఇంటి దగ్గర తొందరగా బయలుదేరి గుడి దగ్గర దిగుదాం అనుకున్నా. కానీ అలా అనుకున్న ప్రతిసారి ఇంకా లేటయ్యేది. కొన్నాళ్ళు ఏదేమైనా ఈరోజు మర్చిపోకుండా దిగాలి అనుకునేవాడిని. ఆ రోజు ఆటోలో ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ రావడమో లెదా నేనే ఎవరికైనా ఫోన్ చెయ్యాల్సి రావడమో జరిగేది.ఇంకొన్ని సార్లు ఆటోలో నిద్రపోయేవాడిని, లేచి చూస్తే ఏ యూనివర్సిటీ దగ్గరో తేలేవాడిని.
కానీ ఈ రోజు అర్ఢమైంది. స్వామి కావాలనే నన్ను అక్కడికి దూరంగా ఉంచారని. విషయం ఏంటంటే బి.టెక్ లో ఉన్నప్పుడు నేను సుందరకాండ పారాయణ పుస్తకం కొన్నాను కాని ఎప్పుడూ తెరిచిన పాపాన పోలేదు. కాలగమనంలో నాహం కర్తా హరిః కర్తా పుస్తకం చదవడం, వేయిపడగలు చదవడం జరిగింది కానీ సుందరకాండ మాత్రం తెరవలేదు. అలాగే నాతో పాటు ఉద్యోగం కోసం నా వేయి పడగలు, సుందరకాండ , భగవద్గీత హైదరాబాద్ చేరాయి. వేయి పడగలు మళ్ళీ రెండు సార్లు చదివాను కానీ సుందరకాండ మాత్రం చదవలేక పోయాను. ఇలా కాదని ఎం.స్. రామారావు గారి తెలుగు సుందరకాండ ఆడియో సంపాదించాను. కాని అదేంటో నా దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి పాటల్లో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా వినకుండా ఉన్నది అదొక్కటే . దానితో ఇక సుందరకాండ గురించి మనకు తెలియడం ఈ జన్మలో జరగదేమో అనుకుంటున్న తరుణంలొ తెలుగు డివోషనల్ స్వరాంజలి బ్లాగు చూసాను . అక్కడ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి "హనుమధ్వైభవం" ప్రవచనం వినడం జరిగింది. ఆ తర్వాత సురస సైట్ గురించి తెలిసింది. అక్కడ ఉషశ్రీ గారి రామాయణం విన్నాను. దాని తర్వాత హనుమజ్జయంతి సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచ్చిన ఒక ప్రవచనం ఇంటర్నెట్లో విన్నాను. ఆ తర్వాత వారిచ్చిన రామాయణాంతర్గత సుందరకాండ ప్రవచనం అంతర్జాలంలో విన్నాను. ఏడు రోజుల ప్రవచనం, రోజుకు రెండు గంటలు చొప్పున . ఇది పూర్తి గా వినడానికి కూడా లెక్కలేనన్ని అవాంతరాలు. ఒక అవాంతరం తర్వాత మళ్ళీ కొత్తగా వినడం మొదలుపెట్టడం , మళ్ళి అనుకోని విధంగా ఇంకొక అవాంతరం రావడం ఇలా ఎంతవరకు వెళ్ళిందంటే కేవలం సముద్ర లంఘనమే ఐదారు సార్లు విన్నాను. తర్వాత అలోచించుకుంటే ఆ భగవతుడే కావాలని, ఆత్మ దర్శనానికి ఎన్ని అవరోధాలుంటాయో చెప్పడానికే అలా చేశారనిపించింది. ఒక పక్క హనుమత్ రక్షా యాగం మర్చి పోయాననే బాధ , ఇంకొక పక్క నాలుగేళ్ళుగా ప్రయత్నిస్తున్నా సుందరకాండ ఎందుకు తెలుసుకోలేక పోతున్నానే సందేహం, ఈసారి ఎలాగైనా విని తీరాలన్న పట్టుదల , పైన ఆ పవనసుతుని కృప చేత నిన్నటికి ఆ ప్రవచనం వినడం పూర్తి చేయ గలిగాను. ఆ ప్రవచనం గురించి చెప్పాలంటే ఇంకొక పది టపాలు రాయాలి అంత అధ్భుతమైన వాగ్ధాటి,ప్రఙ్ఞ,కౌశలం ఉన్న పండితులు కోటేశ్వరరావు గారు. నిన్నటికి ప్రవచనం వినడం పూర్తి అయ్యింది, చూసుకుంటే సోమవారం. నేను మొదలుపెట్టింది ఒక మంగళవారం (చాలా మంగళవారాల క్రితం) అనుకోని విధంగా మంగళవారానికి పూర్తి అవ్వడం వెనుక ఆ స్వామి నాకు ఏమైనా చెప్పదలచుకున్నారా అనిపించింది. సరే మంగళవారం, సుందరకాండ వినడం పూర్తి అయ్యింది కదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అనుకున్న. అనుకోగానే గుల్ మొహర్ పార్క్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి గుర్తొచ్చింది. సరే ఎలాగైనా మధ్యలో దిగి గుడి లోకి వెళ్ళాలి అనుకున్నా. అనుకోవడం ఐతే అనుకున్నా కానీ మనసులో భయంగానే ఉంది ఆ స్వామి అనుమతి ఉందో లేదో అని . ఎందుకంటే ఎన్నో సార్లు మనసులో గట్టిగా అనుకుని అక్కడ దిగకుండా వెళ్ళిపోయిన సందర్భాలు ఈ రెండేళ్ళలో చాలా ఉన్నాయి కదా. సరే చూద్దాం ఆ స్వామి ఏం రాసిపెట్టారో అని వేయి పడగల్లో గణాచారి పూర్వీకుడు ప్రాణాలని అప్రమత్తతకి వెలకట్టి జాగరూకతతో ఆవుని వెతకడానికి పోయినట్టు , బయలుదేరాను. ఆటో ఎక్కి బయలుదేరాను నరాలు తెగిపోయేటంత టెన్షన్ గా ఉంది- దిగుతానో దిగనో , మర్చిపోతానేమో , నిద్ర పోతానేమో, ఎవరన్నా ఫోన్ చేస్తారేమో అని . చివరికి ఎలాగో గుడి ముందు "ఇక్కడ ఆపు బాబూ" అనగలిగాను.ఇప్పటికీ నాకు డౌటే నేనన్నానో , ఆ స్వామి అన్నారో. దిగిన తర్వాత చాలాసేపు నన్ను నేనే నమ్మలేకపోయాను. ఆ తర్వాత దర్శనం చేసుకున్నాను. అప్పుదు తెలియలేదు కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం గుర్తు తెచ్చుకుంటే ఆ స్వామి "ఇందుకే నువ్వింతవరకూ ఈ గుడికి రావడం కుదరలేదు" అని చిద్విలాసంతో అన్నట్టనిపిస్తోంది. సుందరకాండ ప్రవచనాన్ని విన్నందుకు ఆ స్వామి నాకు ఇచ్చిన బహుమానం "రెండున్నరేళ్ళుగా అందని ద్రాక్షగా మిగిలిన ఆ స్వామి దర్శనం" .
ఆ స్వామి అనుగ్రహ ప్రసాదాన్ని మీతో పంచుకుందామని చేసిన చిన్న ప్రయత్నం ఇది. మొదలు పెట్టినపుడు ఇంత రాస్తానని కానీ రాయాలని కానీ అనుకోలేదు. కానీ ఆ అంజనీ సుతుడు తోడుండి రాయిస్తుంటే రాయగలిగాను.

Friday, April 17, 2009

ఎవరు వేసారు వోటు ?

ఒక విడత ఓటింగ్ అయిపోయింది. కానీ ఎంతమంది ఓటేసారు?సెలవు లేదో లేదో అని గోలెట్టేసారు. ఇచ్చారు. కానీ ఏం లాభం. చదువుకోని వాళ్ళు చాలావరకు ఓటేసారు. పడని 35% ఓట్లలో 99% చదువుకున్న వాళ్ళవే అని నా నమ్మకం. చదువుకుంటే కాకరకాయ కీకరకాయ అయినట్టు ఉంది.

మొత్తం జనాభాలో 60% కి ఓటుహక్కు ఉందనుకుంటే , అందులో 60% జనాభా ఓటుహక్కును వినియోగించుకుంటే ఎంతమంది ఓటేసినట్టు? (36%) అంటే వందకి 36 మంది మీద ఆధారపడిన ఈ దేశ భవిష్యత్తు ని విమర్శించడానికి మాత్రం అందరూ ముందే. ఎందుకీ దుస్ధితి. దీనికి కారణం ఎవరు? నిరక్షరాస్యులా, నిస్సందేహంగా కాదు. అక్షరాస్యులమని, ఆధునికులమని చెప్పుకునే వాళ్ళే.

Wednesday, April 15, 2009

ఎందుకు లోక్ సత్తా?

Hi,
At least after seeing below comments from all the party leaders, we should decide to VOTE for LOKSATTA.
Not only us, we should also mobilise our friends,relatives or even unknown persons.
Let us decide how we want our state and then country. Let us have good future.
I hope you all agree and farward this mail and also mobile people at home, neighbour hood, friends and relatives .
Let us all unite for Independence form this murky politics and Give correct value to our VOTE.


1.

ప్రజా రాజ్యం పార్టీ ని విమర్శించే నైతిక హక్కు కేవలం ఒక లోక్ సత్తా పార్టీ కి మాత్రమే వుంది - పవన్ కళ్యాణ్, యువ రాజ్యం అధ్యక్షుడు.

నేను పార్టీ నిర్ణయాల మేరకే మాట్లాడాలి, నిజం మాట్లాడే హక్కు నాకు లేదు , ఇనుప చట్రం లో బందీ ని నేను. జయ ప్రకాష్ నారాయణ అలా కాదు, స్వేత్చా జీవి. నిజం నిర్భయంగా గా చెప్పగలడు - కే రోశయ్య, ఆర్ధిక మంత్రివర్యులు,

కాంగ్రెస్ పార్టీనోట్లకు వోట్లు అమ్మే ఈ రోజుల్లో జయ ప్రకాష్ నారాయణ వంటి ఆణిముత్యం కూడా గెలిచే పరిస్తితి లేదు - బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి, బి జే పి

పార్టీలు మెచ్చిన పార్టీ, ప్రత్యర్డులు మెచ్చిన నాయకుడు... కొత్త తరం రాజకీయల్ని ఆహ్వానిద్దాం , లోక్ సత్తా కి వోటు వేద్దాం.

2. గత సంవత్సరం హైదరాబాద్ లో వరదలు వచినప్పుడు ఒక నలభై ఏళ్ళ మహిళ మ్యాన్ హోల్ లో పడి మరణించిన సంఘటన గుర్తు వుందా ?

పంజా గుట్ట ఫ్లై ఓవర్ కూలి నలుగురి నిర్దాక్షిణ్య మృతి గుర్తు వుందా ?

గోకుల్ చాట్ బాంబు పేలుళ్లు ?

సత్యం కంప్యూటర్స్ వుదంతం ?

పాత బస్తి అల్లర్లు ?

మీ ఇంటి ఎదురు రోడ్ మీద గుంటలు ?

50 మంది ఎక్కాల్సిన బస్సు లో 200 మంది అత్యంత ప్రమాదకర ప్రయాణాలు ?

ఏడుగురు పట్టే ఆటో లో 15 మంది వెళ్ళడం ?

పోలీసుల బూతులు ?

మనిషి మరో సృష్టి నిర్మించే దిశ గా ప్రపంచ దేశాలు అడుగు వేస్తుంటే మనం ఎక్కడ వున్నాం ? మార్పు వద్దా ? ఆలోచించండి !!నిస్వార్థ రాజకీయాలకు నాంది పలుకుదాం, లోక్ సత్తా కి వోట్ వేద్దాం. నవ సమాజం నిర్మిద్దాం

3. నాలుగే నాలుగు సులభమైన ప్రశ్నలకు సమాధానం వ్రాయండి, బహులైచ్చిక ప్రశ్నలు :


1) మన బ్రతుకుల్ని మార్చగలిగేది ?

a) బెల్టు షాపులు, ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మే నాయకులూ b) సినీ నటుల ఫైట్స్ , డాన్సులు c) కలర్ టీవీలు d) స్పష్టమైన సేవా దృక్పదం, .నిజాయితీ.


2) ఎలాంటి ముఖ్య మంత్రి అయితే బావుంటుంది ?

a) ఫ్యాక్షనిస్ట్ b) తాగుబోతు c) వెన్నుపోటు దారుడు d) IAS,మేధావి.


3) గెలవటానికి మూడు కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు సేవ చేస్తాడా ?

a) చేస్తాడు b) చెప్పలేం c) చెయ్యడు d) చెయ్యడానికి ఏమైనా పిచ్చా ?


4) మీ వోటు విలువ ?

a) 500 Rs b) సారాయి c) బద్ధకం d) మీ భవిషత్తు
ఆలోచించండి. లోక్ సత్తా మార్పూ తెగలదా ? అంత కన్నా మంచి పార్టీ వుందా ?లోక్ సత్తా గెలవదు అని సందేహం వద్దే వద్దు. ఇది నిశబ్ద విప్లవం. ఏ పిలుపు లేకుండా 1500 వందల మంది వచ్చి, పది నిమిషాల్లో 5 లక్షలు విరాలు మరే పార్టీ కైనా ఇస్తారా ?ఆలోచించండి, లోక్ సత్తా కి నిస్సందేహం గా వోటు వెయ్యండి

with due credits to the original author(I received this from my friend ashok)

Monday, April 13, 2009

ఎవరికి మీ వోటు?

ఈ మధ్య కాలంలో లోక్ సత్తా గురించి ఎప్పుడు మాట్లాడినా
నువ్వు నేను తప్ప ఇంకెవరూ లోక్ సత్తా కి ఓటెయ్యరు. మనిద్దరి వల్లే లోక్ సత్తా గెలుస్తుందా అని అడుగుతున్నారు.

కానీ ఒకసారి లోక్ సత్తాని కనీసం ప్రతిపక్షానికైనా పంపగలిగితే మరికొంతమందికి స్ఫూర్తిగా ఉంటుందేమో, లేకపోతే నిజాయితీగా పనిచేద్దాం అనుకున్నవాడు కూడా ప్రజలు సినిమా వాళ్లకైనా వేస్తారు కానీ పని చేసేవాళ్ళకు మాత్రం వెయ్యరు అనుకునే ప్రమాదం ఉంది.ఒక రామా రావు గెలిస్తే ఇంకొక చిరంజీవి పుట్టుకొచ్చాడు, ఇప్పుడు చిరంజీవి గెలిస్తే ఇంకో జూనియర్ ఆర్టిస్ట్(అప్పటికి వాడు సీనియర్ అవుతాడు) మళ్ళీ వస్తానంటాడు. కానీ లోక్ సత్తా గెలిస్తే జయప్రకాష్ లాంటి అభిప్రాయాలు , ఆశయాలు ఉన్న మరి కొద్దిమంది రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉంది.కనీసం అలా మార్చగలం అన్న స్పూర్తి అన్నా కలుగుతుంది.

మళ్ళీ ఒకసారి ఇది కేవలం
మనిద్దరి వల్లే లోక్ సత్తా గెలుస్తుందా అని అడిగేవాళ్ళ కోసం........